సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
నవంబర్ 5న కేదార్‌నాథ్‌ని దర్శించి, శ్రీ ఆదిశంకరాచార్యుల సమాధిని ఆవిష్కరించనున్న ప్రధాని
శ్రీ ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని
పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, పూర్తి అయిన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
పూర్తి అయిన, కొనసాగుతున్న మౌలిక సదుపాయాల పనులను సమీక్షించి, తనిఖీ చేయనున్న ప్రధాని
Posted On:
29 OCT 2021 1:08PM by PIB Hyderabad
నవంబర్ 5వ తేదీన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ను దర్శించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాన మంత్రి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయన శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని, శ్రీ ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సమాధిని 2013లో సంభవించిన వరదల అనంతరం పునర్నిర్మించారు. మొత్తం నిర్మాణ పని ప్రధానమంత్రి మార్గదర్శనంలో చేపట్టారు. ప్రాజెక్టు పురోగతిని ఆయన నిరంతరం సమీక్షిస్తూ, పర్యవేక్షించారు.
దీనితో పాటుగా ప్రధానమంత్రి సరస్వతి ఆస్థపథ్ నిర్మాణ పనులను, పూర్తి చేసిన పనులను ప్రధానమంత్రి సమీక్షించి, తనిఖీ చేయనున్నారు.
అనంతరం ప్రధానమంత్రి బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరస్వతీ అడ్డుగోడ (రిటైనింగ్ వాల్) ఆస్థపథ్, ఘాట్లు, మందాకినీ అడ్డుగోడ ఆస్థపథ్, తీర్ధ్ పురోహిత్ గృహం, మందాకినీ నదిపై గురడ చట్టి వంతెన సహా పలు కీలక మౌలికసదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులను రూ. 130 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. సంగం ఘాట్ పునర్ అభివృద్ధి, ఫస్ట్ ఎయిడ్, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, పాలనా కార్యాలయం, ఆసుపత్రి, రెండు గెస్టు హౌజులు, పోలీస్ స్టేషన్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మందాకినీ ఆస్థపథ్ క్యూ నిర్వహణ, వర్షం నుంచి తలదాచుకునేందుకు శిబిరం, సరస్వతీ పౌర సౌకర్య భవనం, ఘాట్లు సహా దాదాపు రూ. 180 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ఆయన పునాది రాయి వేయనున్నారు.
****
(Release ID: 1767582)
Visitor Counter : 203