నౌకారవాణా మంత్రిత్వ శాఖ
విజిలెన్స్ అవగాహనా వారాన్ని పాటిస్తున్న విఒసి పోర్టు
Posted On:
27 OCT 2021 2:26PM by PIB Hyderabad
వి.ఒ. చిదంబరంనార్ పోర్ట్ ట్రస్టుకకు చెందిన సీనియర్ అధికారులతో పోర్ట్ ట్రస్టు చైర్మన్ టి.కె. రామచంద్రన్ విజిలెన్స్ సమగ్రత ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా, డిప్యూటీ చైర్మన్ బిమల్ కుమార్ ఝా, శాఖల అధిపతులు కూడా ప్రతిజ్ఞ చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సివిసి) ఆదేశాల మేరకు స్వతంత్ర భారతదేశం@ 75ః సమగ్రతతో స్వీయ సమృద్ధి అన్న ఇతివృత్తంతో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 01, 2021వరకు ట్యూటీకార్న్‌లోని వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ ట్రస్టు విజిలెన్స్ అవగాహనా వారాన్ని నిర్వహిస్తోంది.
భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు అయిన సందర్భాన్ని స్మరించుకుంటూ, దేశంలోని అవినీతి వ్యతిరేక కేంద్ర సంస్థ అయిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, స్వీయ సమృద్ధమైన భారతదేశంలో ప్రజా జీవితంలో సమగ్రతను సాధించేందుకు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించింది.
ప్రజా జీవితంలో సమగ్రతను, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర విజిలెన్స్ కమిషన్ పని చేస్తోంది. అవినీతి రహిత సమాజాన్నిసాధించేందుకు, ప్రజా జీవితంలో నిజాయితీని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా, పోర్టు వినియోగదారులు, వాటాదారులు, ప్రజలు, ఉద్యోగులు, పాఠశాల/ కళాశాల విద్యార్ధులలో అవినీతి వల్ల కలిగి దుష్ప్రభావాలు, సమాజంపై దాని ప్రభావాన్ని పట్టి చూపుతూ, వారిలో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
అక్టోబర్ 26 నుంచి 01 నవంబర్వా, 2021వరకు వారంపాటు పాటించనున్న విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా విక్రేతలు, కాంట్రాక్టర్ల కోసం ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం, సెన్సిటైజేషన్ కార్యక్రమాలు, 2021సంవత్సరం ఇతివృత్తానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది, కళాశాలు / పాఠశాల విద్యార్ధులకు వివిధ పోటీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యకలాపాలు అదికారులు, సిబ్బంది జీవితంలోని అన్ని రంగాలలో అవినీతిని నిర్మూలించేందుకు తమ పనిలో అప్రమత్తంగా, పారదర్శకంగా ఉండేలా సెన్సిటైజ్ చేస్తాయి.
***
(Release ID: 1767033)
Visitor Counter : 165