ఆర్థిక మంత్రిత్వ శాఖ
నకిలీ సంస్థలు నడుపుతూ రూ. 48 కోట్లకు పైగా జీఎస్టీని ఎగవేసినందుకు 03 వ్యక్తులను అరెస్టు చేసిన గురుగ్రాం డిజిజిఐ విభాగం
Posted On:
27 OCT 2021 1:35PM by PIB Hyderabad
రెండు భిన్న కేసులలో నకిలీ పత్రాల బలంతో బహుళ నకిలీ సంస్థలు నడుపుతున్నారన్న ఆరోపణలపై జీఎస్టీ చట్టంలోని అంశాల కింద ముగ్గురు వ్యక్తులను డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) గురుగ్రాం జోనల్ విభాగం (జిజడ్‌యు) అరెస్టు చేసింది.
దాదాపు 20 నకిలీ సంస్థలతో కూడిన నకిలీ బిల్లింగ్ రాకెట్‌ను నడిపారన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి 5, 9వ అక్టోబర్, 2021న అరెస్టు చేశారు. ఆర్ధిక శాఖను మోసం చేస్తూ రూ.22 కోట్లకన్నా ఎక్కువ నగదును మోసపూరితంగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను ఈ నకిలీ సంస్థల ద్వారా పొందారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టటు చేసి ఢిల్లీ, చీఫ్‌మెట్రొపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, న్యాయం సంస్థానం వారిని 14 రోజుల న్యాయ నిర్బంధానికి (జ్యుడిషియల్ కస్టడీ)కి పంపింది.
మరొక కేసులో హర్యానాలోని పటౌడీ నివాసితుడైన వ్యక్తిని నకిలీ బిల్లింగ్ వ్యవహారంలో అరెస్టు చేశారు. అతడి నుంచి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నకిలీ స్టాంపులు, చెక్ బుక్కులు, నకిలీ సంస్థల ఎటిఎంలు, టోలు రసీదు పుస్తకం, ధర్మకాటా స్టేషన్ పుస్తకాలు, నకిలీ రవాణాదారుల పుస్తకాలు తదితర నేరారోపణ చేసే పత్రాలు లభ్యం అయ్యాయి. అనేక నకిలీ సంస్థల ద్వారా నకిలీ వస్తు రవాణా చేసినట్టు చూపుతూ, నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ని ఉత్పత్తి చేశారనే ఆధారాలుగా వీటిని ఉపయోగించనున్నారు.
రుజువుల ఆధారంగా ఆ వ్యక్తిని 23 అక్టోబర్ 2021న జిఎస్టీ చట్టంలోని ప్రొవిషన్ల కింద దాదాపు రూ. 26 కోట్లకు పైగా జీఎస్టీ విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేశారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది.
రెండు కేసులలోనూ తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
***
(Release ID: 1767031)
Visitor Counter : 197