ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆధార్ హాకెథాన్ -2021ను 28 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ 2021 వరకు నిర్వహించనున్న యుఐడిఎఐ
ఉత్సాహభరితమైన స్పందన; నేటి వరకూ 2700+ నమోదులు (రిజిస్ట్రేషన్లు)
Posted On:
26 OCT 2021 11:38AM by PIB Hyderabad
భారతీయ యువతలో ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహించేందుకు, ఆజాదీ కా అమృతత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా యుఐడిఎఐ ఆధార్ హాకెథాన్ 2021ని అక్టోబర్ 28, 2021 నుంచి 31 అక్టోబర్ 2021 వరకు నిర్వహించనుంది.
ఆవిష్కరణ అనేది కేవలం ఒక పదం, ఘటన కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సమస్యను అర్థం చేసుకుని, దానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేసినప్పుడే మీరు ఆవిష్కరణ చేయగలరు. మనం సమస్య మూలాలలోకి వెళ్ళి, సత్వరం ఉపయోగించగలిగిన పరిష్కారాలను కనుగొనాలి. జ్ఞానమే శక్తి అయిన కాలంలో, ఆవిష్కరణ అనేది వృద్ధికి తోడ్పడి, వేగవంతం చేస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ మార్గదర్శనాలకు అనుగుణంగా, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా నమోదు, ప్రామాణీకరణ సాఫ్ట్‌వేర్ వేదికలలో వారు వివరాలను అందించడంలో పౌరుల అనుభవాన్ని పెంచేందుకు యుఐడిఎఐ ఆధార్ హాకెథాన్ -2021కి శ్రీకారం చుట్టింది. రెండు విస్త్రత ఇతివృత్తాలలో వర్గీకరించిన బహుళ సమస్యల ప్రకటనలు - నమోదు, ప్రామాణీకరణలకు సంబంధించి హాకెథాన్ ఉంటుంది. నేటి వరకూ, యుఐడిఎఐ 2700+కు పైగా ఇంజనీరింగ్ విద్యార్ధుల నుంచి నమోదులను అందుకుంది. నివాసితులు ఎదుర్కొంటున్న వాస్తవ జీవన సవాళ్ళను పరిష్కరించే దిశగా యువ మెదడులు ఎంతగా మొగ్గు చూపుతున్నాయో, దీని ద్వారా అర్థం అవుతుంది. ఇందులో దేశం నలువైపుల నుంచి - ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరంలో జమ్ముకాశ్మీర్ వరకు ఉన్న అన్ని వర్గాల ఇంజినీరింగ్ సంస్థలు - ఐఐటిలు, ఎన్ఐటిలు, ఎన్ఐఆర్ఎఫ్, మరిన్ని ఉత్యన్నత స్థాయి కళాలశాలలకు చెందిన విద్యార్ధులు పాలు పంచుకుంటున్నారు. చిగురించే యువ మెదళ్ళకు మద్దతునిచ్చేందుకు, తగిన వినియోగ సందర్భాలలో సమస్య ప్రకటనలను వివరించడానికి యుఐడిఎఐ బృందం రోజువారీ ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహిస్తోంది.
ఈ సెషన్లు ప్రధానంగా అనుకూల పరిష్కారాలను రూపొందించడం అవసరమైన సమస్య ప్రకటనలు,యుఐడిఎఐ ఎపిఐలు, ఉత్పత్తుల వివరాలను కవర్ చేస్తాయి. పలువురు యువ ఆవిష్కర్తలు / పాలుపంచుకునే యువత ఈ ఇంటరాక్టివ్ సెషన్లను విస్త్రతంగా ఆమోదించి, ప్రశంసిస్తున్నారు. యుఐడిఎఐ ద్వారా ఐటి పరిశ్రమ, విద్యారంగం, కన్సల్టింగ్, ప్రభుత్వానికి చెందిన సీనియర్ సభ్యులు/ అధికారులతో కూడిన జ్యూరీ ఆధారిత విధానం ద్వారా సమర్పించిన అంశాల మూల్యాంకనం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సభ్యులు ఉత్తమ పరిష్కారాన్నిగుర్తించి, ఎంపిక చేసేందుకు నిర్మాణాత్మక ప్రక్రియ ద్వారా సమర్పించిన అంశాలను మూల్యాంకనం చేస్తారు. దీనిని యుఐడిఎఐ బహుమానం అందించడమే కాక, ఇతర నిబంధనలు, షరతులకు లోబడి ఆ బృందానికి ప్లేస్‌మెంట్‌ను ఆఫర్ చేస్తుంది.
ఇప్పటికే ఆధార పౌరులను సాధికారం చేస్తున్నందున, ఇందులో పాలు పంచుకుంటున్నవారికి నేను శుభాకాంక్షలు తెలుపుతూ, నూతన భారతానికి నిర్మాణ స్తంభాలైన మన యువ ఆవిష్కర్తలు ప్రస్తుతమున్న ఆధార్ మౌలిక సదుపాయాలను మరింత బలపరిచే మమ్మల్ని ఆశ్చర్యపరిచే అత్యుత్తమ విధానాలు / పరిష్కారాలను కనుగొని, అంతిమంగా ఆధార సంబంధిత సేవల నుంచి పౌరులు గరిష్ఠ విలువను పొందేందుకు దోహదం చేస్తారని ఆశిస్తున్నానని, యుఐడిఎఐ, సిఇఒ డాక్టర్ సౌరభ్ గార్గ్ అన్నారు.
ఆధార్ హాకెథాన్ 2021కు సంబంధించిన వివరాలు https://hackathon.uidai.gov.in/ అన్న లింక్‌లో అందుబాటులో ఉన్నాయి.
***
(Release ID: 1766739)
Visitor Counter : 229