కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రిజల్యూషన్ ప్రొఫెషనల్స్ కోసం ఐబీబీఐ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (టీటీ) ప్రోగ్రామ్‌ను నిర్వహించింది.

Posted On: 24 OCT 2021 9:04AM by PIB Hyderabad

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా, రిజల్యూషన్  రిజల్యూషన్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), యూకేలోని ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎఫ్సీడీఓ)తో కలిసి రెండు రోజులపాటు ''ట్రైనర్ ది ట్రైనర్'' కార్యక్రమాన్ని నిర్వహించింది. "రిజల్యూషన్ పరిష్కార ప్రక్రియకు సహాయపడటం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతుల వాడకం’’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 22,  23 తేదీలలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు.

సామర్థ్యాన్ని పెంపొందించడం  భారతదేశంలో రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంపై "ట్రైనర్ ది ట్రైనర్" కార్యక్రమం దృష్టి పెట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగా, కార్యక్రమంలో పాల్గొనేవారికి లోతైన ఆచరణాత్మక శిక్షణ అందించారు.  వివాదాలను చూసే మార్గాన్ని సానుకూలంగా మార్చడం, మధ్యవర్తిత్వ పద్ధతుల ప్రభావం, సున్నితమైన మూల్యాంకనం, ప్రతిభ మొదలైన అంశాల గురించి ఈ సందర్భంగా వివరించారు.  భారతదేశంలో రిజల్యూషన్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, దివాలా నిపుణులు (ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్),  ఇతర భాగస్వాములు శిక్షకులు తమ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫలితంగా వీళ్లు తిరిగి ట్రెయినర్లుగా మారి మరింత మందికి శిక్షణ ఇస్తారు.

  బ్రిటీష్ డిప్యూటీ హైకమిషన్‌లోని సీనియర్ ఫైనాన్షియల్ పాలసీ అడ్వైజర్ డాక్టర్  శిఖా పరేఖ్ స్వాగత ప్రసంగం చేస్తూ, ఐబీబీఐ–ఎఫ్సీడీఓ భాగస్వామ్యం పరీక్షల్లో నెగ్గిందని  కాలంతో పాటు బలంగా పెరుగుతోందని ఉద్ఘాటించారు. ఐబీబీఐ శాశ్వత సభ్యురాలు ముకుళితా విజయవర్గరియ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పరిష్కార పరిష్కారం (ఏడీఆర్) విధానాల వల్ల ప్రయోజనాలను వివరించారు. దివాలా చట్టంలో ఏడీఆర్ విధానాలను వాడితే సత్వర ఫలితాలు వస్తాయని అన్నారు. సంబంధిత రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఏజెన్సీలు నామినేట్ చేసిన నలభై ఐదు మంది రిజల్యూషన్ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్సాల్వెన్సీ, రిజల్యూషన్ వ్యవస్థల్లో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఇలాంటి మరికొన్ని సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.  ఫ్యాకల్టీ ప్రముఖుల్లో ఆండ్రూ మిల్లర్ (క్యూసి, యునైటెడ్ కింగ్‌డమ్),  స్టెఫానో కార్డినల్ (ఇటలీ),  అనురూప్ ఓంకార్ (బ్రిడ్జ్ పాలసీ థింక్ ట్యాంక్)   కృతిక కృష్ణమూర్తి (బ్రిడ్జ్ పాలసీ థింక్ ట్యాంక్) ఉన్నారు.

***


(Release ID: 1766580) Visitor Counter : 116


Read this release in: English , Urdu , Hindi , Tamil