రక్షణ మంత్రిత్వ శాఖ
భారత పర్యటనలో బంగ్లాదేశ్ నౌకాదళం అధినేత అడ్మిరల్ షాహీన్ ఇక్బాల్
Posted On:
25 OCT 2021 11:00AM by PIB Hyderabad
బంగ్లాదేశ్ నౌకాదళం అధినేత అడ్మిరల్ ఎం షాహీన్ ఇక్బాల్ భారత దేశంలో అధికారిక పర్యటనలో ఉన్నారు. అక్టోబరు 23 నుండి 29, 2021 వరకు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా అడ్మిరల్ ఎం షాహీన్ ఇక్బాల్, న్యూఢిల్లీలోని
డిఫెన్స్ స్టాఫ్ అధినేత, భారత ప్రభుత్వంలోని ఇతర ఉన్నత స్థాయి అధికారులతో పాటుగా నౌకాదళం అధినేతతోనూ సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక పరస్పర చర్యల సమయంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వెంట పెట్రోలింగ్‌లో సమన్వయం, ద్వైపాక్షిక కసరత్తు బొంగోసాగర్, నావికా శిక్షణ నిర్వహణ మరియు ప్రతినిధుల పరస్పర సందర్శనల వంటి వివిధ ఉమ్మడి సహకార ప్రయత్నాలకు సంబంధించిన అంశాలు చర్చించనున్నారు. ఢిల్లీలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, అడ్మిరల్ షాహీన్ ఇక్బాల్ ముంబయి వెళతారు. అక్కడ ఆయన వెస్ట్రన్ నేవల్ కమాండ్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఆర్ హరి కుమార్‌తో కూడా సమావేశమవుతారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్‌ను కూడా సందర్శిస్తారు.
ముంబయి సందర్శన పూర్తయిన తర్వాత, అడ్మిరల్ వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి శిక్షణ కార్యకలాపాలను చూడటానికి మరియు కమాండెంట్, డీఎస్ఎస్‌సీతో సంభాషించడానికి వెళ్లారు. భారతదేశం, బంగ్లాదేశ్ చరిత్ర, భాష, సంస్కృతి మరియు ఇతర సామాన్యతల సమూహాలను పంచుకుంటాయి. అత్యుత్తమ ద్వైపాక్షిక సంబంధాలు సార్వభౌమత్వం, సమానత్వం, విశ్వాసం, అవగాహనపై ఆధారపడిన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తాయి, ఇది వ్యూహాత్మక సంబంధాలకు అతీతంగా ఉంటుంది. ఈ సంవత్సరం బంగ్లాదేశ్ విమోచన యుద్ధం , 1971లో జరిగిన యుద్ధంలో విజయవంతమైన తరుణాన్ని పురస్కరించుకొని గోల్డెన్ జూబ్లీ వేడుకలను భారత్ మరియు బంగ్లాదేశ్ సంయుక్తంగా జరుపుకోనున్నాయి. నౌకాదళాల పరస్పరం ఓడల సందర్శనలు మరియు బంగ్లాదేశ్ సాయుధ బలగాల బృందం న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ 2021లో పాల్గొనడం మరియు యుద్ధ స్మారక చిహ్నాలను బహుకరించడం వంటి అనేక ఉమ్మడి కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. 2021 చివరి త్రైమాసికంలో, నావల్ వార్ కాలేజ్ & ఇండియన్ నేవల్ అకాడమీలో బంగ్లాదేశ్ వార్ వెటరన్స్ చర్చలు నిర్వహించడం మరియు బంగ్లాదేశ్‌లోని 'విక్టరీ డే సెలబ్రేషన్స్'లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కంటెంజెంట్ & బ్యాండ్ పాల్గొనడం వంటి వివిధ రకాలైన ఆయా కార్యక్రమాలు ప్రణాళిక చేయబడ్డాయి.
***
(Release ID: 1766416)
Visitor Counter : 242