ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమగ్ర వైద్య విద్యా రంగంలో భారత్ భారీ పెట్టుబడులు


2014 నుంచి 157 నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులు .. 17,691.08 కోట్ల రూపాయల పెట్టుబడులు

నూతన వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అదనంగా 16000 సీట్లు

పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ లేదా కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాల స్థాయి పెంచడానికి 2014 నుంచి 2,451.1 కోట్ల రూపాయల కేటాయింపు

Posted On: 24 OCT 2021 10:35AM by PIB Hyderabad

దేశంలో నూతనంగా 17,691.08 కోట్ల రూపాయల పెట్టుబడితో 157 వైద్య కళాశాలలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఇంతవరకు అనుమతులు మంజూరు చేసింది. ఈ వైద్య కళాశాలలు పనిచేయడం ప్రారంభించినప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అదనంగా 16000 సీట్లు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతులు పొందిన కళాశాలల్లో ఇప్పటికే 64 నూతన కళాశాలలు పనిచేయడం ప్రారంభించాయి. వీటిలో 6,500 సీట్లు ఉన్నాయి. 

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇప్పటికే కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో ఉన్న వైద్య కళాశాలల స్థాయి పెంచి వైద్య సీట్లను ఎక్కువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2,451.1 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మానవ వనరులను అభివృద్ధి చేసే అంశానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల వైద్య విద్యలో అంతరాలు తగ్గి దేశంలో అన్ని ప్రాంతాలలో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడానికి అవకాశం కలుగుతుంది. 

   అంశాలలో   అమలవుతున్నాయి. 

a ) ఇప్పటికే పనిచేస్తున్న జిల్లా/రిఫరల్ ఆసుపత్రులకు అనుబంధంగా నూతన వైద్య కళాశాలలను  నెలకొల్పడం 

b ) దేశంలో ఎంబీబీస్  సంఖ్యను ఎక్కువ చేయడానికి పనిచేస్తున్న రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాయిని పెంచడం 

c )కొత్తగా పీజీ కోర్సులను ప్రారంభించడానికిపీజీ కోర్సుల్లో  సంఖ్యను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వ వైద్య  కళాశాలలను పటిష్టం చేసి వాటి స్థాయిని పెంచడం 

d ) కేంద్ర ప్రాయోజిత పథకాల వివరణ: జిల్లా/ రిఫరల్ ఆసుపత్రులకు అనుబంధంగా నూతన వైద్య కళాశాలలను నెలకొల్పడం 

      ఈ పథకం కింద ప్రభుత్వ/ప్రైవేట్ వైద్య కళాశాల లేని జిల్లాల్లో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సౌకర్యాలు లేని/ వెనుకబడిన/ గుర్తించిన జిల్లాలకు దీనిలో ప్రాధాన్యత ఇస్తారు.

ఈ పథకాన్ని మూడు దశల్లో అమలు  చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కొత్తగా కళాశాలలను నెలకొల్పడానికి 157 అనుమతులు మంజూరు అయ్యాయి. వీటిలో ఇప్పటికే 63 కళాశాలలు పనిచేయడం ప్రారంభించాయి. కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏర్పాటు కానున్న 157 కళాశాలల్లో 39 కళాశాలను ఆశాజనక జిలాల్లో నెలకొల్పోడం జరుగుతుంది. 

నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రణాళికను రూపొందించి దానిని అమలు చేసి  ప్రాజెక్టుల ప్రారంభం అయ్యేలా చూడడానికి  రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

దశల్లో సాధించిన విజయాలు:

దశ

ప్రారంభించిన సమయం 

వైద్య కళాశాలల సంఖ్య

ప్రణాళిక


పనిచేస్తున్న వైద్య కళాశాలల సంఖ్య

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కవర్ చేయబడ్డాయి

ఒక్కో కాలేజీకి ఖర్చు

మొత్తం వ్యయం

కేంద్ర వాటా

విడుదల అయిన కేంద్ర వాటా 

నేను

జనవరి  2014

58

48

20

189 కోట్లు

10,962 కోట్లు

7541.1 కోట్లు

7541.1 కోట్లు

II

ఫిబ్రవరి 2018

24

8

8

250 కోట్లు

6000 కోట్లు

3675 కోట్లు

3675 కోట్లు

III

ఆగస్టు 2019

75

8

18

325 కోట్లు

24,37.41 కోట్లు 

15,499.74 కోట్లు

6719.11

 కోట్లు

 

 

b ) దేశంలో ఎంబీబీస్ సీట్ల సంఖ్యను ఎక్కువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ/కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాయిని పెంచడం:-

     దేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో  సంఖ్యను 10,000  పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇప్పటికే పనిచేస్తున్న రాష్ట్ర/కేంద్ర వైద్య కళాశాలల స్థాయిని పెంచడానికి కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ  శాఖ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. 

 ఈశాన్య రాష్ట్రాలుప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో 90:10 నిష్పత్తిలోమిగిలిన రాష్ట్రాల్లో 60:40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూరుస్తాయి. ఒక సీటుకు అత్యధికంగా 1.20 కోట్ల రూపాయలను కేటాయించడం జరుగుతుంది. 15 రాష్ట్రాలలో పనిచేస్తున్న 48 కళాశాలలకు అదనంగా  3325 సీట్లను పెంచడానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీనికోసం తన వాటాగా కేంద్రం 6719.11 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 

c .    కొత్త పీజీ  విభాగాలను ప్రారంభించడం మరియు పీజీ  సీట్లను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేయడం మరియు అప్‌గ్రేడ్ చేయడం :-

ఈ కార్యక్రమాన్ని  దశల్లో అమలు చేయడం జరిగింది. 

 కొత్త పీజీ  సీట్లను అందుబాటులోకి తేవడానికి  రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేయడం మరియు అప్‌గ్రేడ్ చేయడం కోసం పథకం మొదటి దశ XI ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది. 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 72 ప్రభుత్వ వైద్య కళాశాలలు 4058 పీజీ సీట్లను పెంచడానికి ఈ పథకం కింద అనుమతులు పొందాయి . ఈ పథకం కింద ఇప్పటివరకు1049.3578 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయబడ్డాయి.

పథకం రెండవ దశలో దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో 4000 పీజీ సీట్లను అదనంగా అందుబాటులోకి తేవడం జరుగుతుంది. దీనికోసం  ఈశాన్య రాష్ట్రాలు మరియు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 మరియు ఇతర రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. ఒక్క సీటుకు గరిష్టంగా  1.20 కోట్ల రూపాయలను  జరుగుతుంది. ఇప్పటి వరకు 1741 పీజీ సీట్ల పెంపుదల కోసం మొత్తం 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ పథకం కింద ఆమోదం పొందాయి.  ఈ పథకం కింద ఇప్పటి వరకు  694.534 కోట్ల నిధులు విడుదల చేయబడ్డాయి.

వైద్య రంగంలో  మానవ వనరుల కొరతను తగ్గించడానికి,దేశవ్యాప్తంగా శిక్షణ పొందిన వైద్య సిబ్బంది లభ్యతను పెంచి  భౌగోళిక అసమతుల్యతను తగ్గించడానికి కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడం జరుగుతున్నది. కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా దేశంలో ఆరోగ్య నిపుణుల లభ్యత పెరిగింది. వైద్య కళాశాలల ఏర్పాటులో చోటుచేసుకున్న భౌగోళిక అసమానతలను  తగ్గించి, అందరికి అందుబాటులో ఉండేలా వైద్య విద్యా రంగాన్ని అభివృద్ధి చేసిజిల్లా ఆసుపత్రుల ప్రస్తుత మౌలిక సదుపాయాలను మెరుగు పరచి ప్రభుత్వ రంగంలో వైద్య సౌకర్యాలను అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 

***


(Release ID: 1766233) Visitor Counter : 208