భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ఉప ఎన్నికల సమయంలో మొత్తం జిల్లాలో ఎన్నిక ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి (ఎంసీసీ) అమలు - గురించి

Posted On: 21 OCT 2021 6:14PM by PIB Hyderabad

ఉప ఎన్నికల సమయంలో మొత్తం జిల్లాలో ఎన్నిక ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి (ఎంసీసీ) అమలు గురించి క‌మిష‌న్ త‌న వివ‌ర‌ణ‌ను వెల్ల‌డించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎంసీసీ గురించి వివ‌రిస్తూ లేఖ సంఖ్యః 437/6/INST/2016-CSS తేదీ 29 జూన్, 2017న తెలియ‌జేయ‌డ‌మైంది. ఎన్నికలు జ‌రిగే  నియోజకవర్గం రాష్ట్ర రాజధాని/ మెట్రోపాలిటన్ నగరాలు/ఇత‌ర మునిసిపల్ కార్పొరేషన్ల ప‌రిధిలో  ఉన్నట్లయితే ఎన్నిక ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిలోని నిబంధ‌న‌లు  కేవ‌లం సంబంధిత నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల‌కు మాత్రమే వర్తిస్తాయి.  ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి అమ‌లు విష‌యం గ‌తంలోనే కమిషన్ దృష్టికి తీసుకురాబడింది, దీనికి సంబంధించి సూచన చేస్తూ 29 జూన్, 2017వ తేదీన వెల్ల‌డించి లేఖ సంఖ్యః 437/6/INST/2016-CSS పూర్తి స‌మాచారాన్ని తెల‌ప‌డం జ‌రిగింది. దీనికి కొన‌సాగింపుగా జనవరి 18, 2018 తేదీన లేఖ సంఖ్యః 437/6/1/ECI/INST/FUNCT/MCC/2017
ద్వారా ఇదే విష‌యం  పునరుద్ఘాటించబడింది. అన్ని ఇతర సందర్భాల్లో ఉప-ఎన్నికలకు వెళ్లే నియోజకవర్గాన్ని కవర్ చేసే మొత్తం జిల్లా (ల) లో పైన పేర్కొన్న సూచనలు అమలు చేయబడతాయి. ఈ సూచనల స్ఫూర్తి ఏమిటంటే, ఎంసీసీ యొక్క చిక్కులు లేకుండా అభివృద్ధి మరియు పరిపాలనా పనులు కొనసాగేలా చూడ‌డం మరియు ఉప ఎన్నిక కోసం ప్రచారం అనే అంశాన్ని పీసీ/ఏసీల‌కు మాత్రమే పరిమితం చేయ‌డం. ఉప ఎన్నికలకు సమానంగా రాజకీయ కార్యకలాపాలు పీసీ/ఏసీ వెలుపల కానీ జిల్లా పరిధిలో నిర్వహించే పరిస్థితి ఉంది. అటువంటి కార్యకలాపాలు పైన పేర్కొన్న సూచనల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటాయి. ప్ర‌స్తుత ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎల‌క్ష‌న్లు జ‌రిగే జిల్లాలో ఎక్క‌డైన ఎన్నిక‌ల ప్ర‌చార‌పూర్వ‌కంగా జ‌రిపే వివిధ కార్య‌క‌లాపాల‌కు ఎంసీసీ, కోవిడ్‌, వ్యయ పర్యవేక్షణ అమలుకు సంబంధించి అన్ని సూచనలు ఆయా రాజకీయ కార్యకలాపాల విషయంలోనూ  వర్తిస్తాయి. సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి అటువంటి సందర్భాలలో అవసరమైన అన్ని నియంత్రితపు  చర్యలను అమలు చేయాలి. ఖచ్చితమైన సమ్మతిని నిర్ధారించాలి.
                                                                                         

****


(Release ID: 1765654) Visitor Counter : 300


Read this release in: English , Urdu , Hindi , Marathi