విద్యుత్తు మంత్రిత్వ శాఖ

సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్.ఎం.బి.సి) నుండి ఎస్.ఓ.ఎఫ్.ఆర్. తో అనుసంధానమైన 75 మిలియన్ అమెరికా డాలర్ల నిర్ణీత కాల వ్యవధి ఋణాన్ని పొందిన - ఆర్.ఈ.సి. లిమిటెడ్

Posted On: 20 OCT 2021 5:11PM by PIB Hyderabad

భారతదేశం లో ఏదైనా ఎన్.బి.ఎఫ్.సి. కోసం మొదటిసారిగా, 75 మిలియన్ అమెరికా డాలర్ల మేర, ఐదు సంవత్సరాల సెక్యూర్డ్ ఓవర్నైట్ ఫైనాన్సింగ్ రేటు (“ఎస్.ఓ.ఎఫ్.ఆర్”) తో అనుసంధానమైన సిండికేటెడ్, నిర్ణీత కాల వ్యవధి ఋణాన్ని, ఆర్.ఈ.సి. లిమిటెడ్, 2021 అక్టోబర్, 7వ తేదీన, విజయవంతంగా పొందింది.  ఈ ఋణ ఒప్పందానికి, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్.ఎం.బి.సి) కు చెందిన సింగపూర్ శాఖ ను ఏకైక తప్పనిసరి లీడ్ అర్రేంజర్ మరియు బుక్ రన్నర్‌ గా నియమించడం జరిగింది.  ఈ రుణం తో పాటు, ఈ సౌకర్యం పై వడ్డీ రేటు వల్ల సంభవించే నష్టాన్ని తగ్గించడానికి ఆర్.ఈ.సి. సంస్థ, వడ్డీ రేటు స్వాప్ రిఫరెన్సింగ్ ఎస్.ఓ.ఎఫ్.ఆర్. సదుపాయాన్ని కూడా తీసుకుంది. భారతదేశం లోని ఏదైనా ఒక కార్పొరేట్ సంస్థ ఇటువంటి ఒప్పందాన్ని చేసుకోవడం ఇదే మొదటిసారి. 

భారతీయ రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన ఈ.సి.బి. మార్గదర్శకాల ప్రకారం అనుమతించిన మౌలిక సదుపాయాల విద్యుత్ రంగ ప్రాజెక్టులకు, ఈ సౌకర్యం ద్వారా సమకూరే నిధులను వినియోగించడం జరుగుతుంది. 

అమెరికా డాలర్ల నిర్ణీత కాల వ్యవధి రుణ ఒప్పందం విజయవంతం కావడం పై, ఆర్.ఈ.సి. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యానిస్తూ,  "ఎల్.ఐ.బి.ఓ.ఆర్. త్వరలో నిలిపివేయడంతో మరియు  ఎల్.ఐ.బి.ఓ.ఆర్. పరివర్తన కోసం కార్యాచరణ ప్రణాళిక లో భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్‌ ను అనుసరించడం ద్వారా,  ఈ ఎస్.ఓ.ఎఫ్.ఆర్. అనుసంధానమైన నిర్ణీత కాల వ్యవధి రుణ సదుపాయాన్ని సమకూర్చుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము.  భారతదేశంలో ఏ ఎన్.బి.ఎఫ్.సి. కైనా కూడా ఇది మొదటిది. ప్రస్తుతం ఉన్న మా నిర్ణీత కాల వ్యవధి రుణ సదుపాయాలను మెరుగైన రీతిలో ఎస్.ఓ.ఎఫ్.ఆర్. కి అమెరికా డాలర్ల ఎల్.ఐ.బి.ఓ.ఆర్. పరివర్తనలో వినియోగించుకోడానికి, ఈ ప్రక్రియ నుండి పొందిన అనుభవం, ఆర్.ఈ.సి. కి అవకాశం కల్పిస్తుంది." అని పేర్కొన్నారు. 

ఆర్.ఈ.సి. లిమిటెడ్ గురించి:

ఆర్.ఈ.సి. లిమిటెడ్ అనేది నవరత్న ఎం.బి.ఎఫ్.సి.  ఇది భారతదేశం అంతటా విద్యుత్ రంగానికి అవసరమైన పెట్టుబడి తో పాటు, అభివృద్ధి పై దృష్టి పెడుతుంది.  1969 లో స్థాపించబడిన ఆర్.ఈ.సి. లిమిటెడ్ సంస్థ, సంబంధిత కార్యకలాపాలలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  రాష్ట్ర విద్యుత్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర / రాష్ట్ర విద్యుత్ వినియోగ సంస్థలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి దారులు, గ్రామీణ విద్యుత్ సహకార సంఘాల తో పాటు, ప్రైవేటు రంగ విద్యుత్ వినియోగ సంస్థలకు, ఆర్.ఈ.సి. లిమిటెడ్, ఆర్థిక సహాయం అందిస్తుంది.  దీని వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, ప్రాజెక్టులు, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల తో సహా, పూర్తి విద్యుత్ రంగానికి అవసరమైన వివిధ రకాల పెట్టుబడి ప్రాజెక్టులు ఉన్నాయి.

 

*****(Release ID: 1765344) Visitor Counter : 43