కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

4కోట్లమందికి పైగా కార్మికులు ఈ-శ్రామ్ పోర్టల్.లో నమోదు!


అసంఘటిత రంగ కార్మికులపై
తొలి జాతీయ సమాచార వేదిక ఇదే..

రిజిస్ట్రేషన్లలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్,
బీహార్, మధ్యప్రదేశ్ ముందంజ..


వ్యవసాయ, నిర్మాణ రంగాలనుంచే
అత్యధికంగా కార్మికుల నమోదు..

ప్రభుత్వ పథకాలను ప్రయోజనాలు అందుకోవడానికి
వారికి సరైన సదుపాయం ఈ-శ్రామ్: భూపేందర్

Posted On: 17 OCT 2021 12:44PM by PIB Hyderabad

    ఈ శ్రామ్ (e-Shram) పోర్టల్.ను ప్రారంభించిన నాలుగు నెలల్లోనే ఈ పోర్టల్ ద్వారా 4 కోట్ల మందికిపైగా కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ పోర్టల్.లో కార్మికుల వివరాల నమోదుతో అసంఘటిత రంగానికి చెందిన కార్మికులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా లభిస్తాయని ఆయన తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

   ఈ శ్రామ్ పోర్టల్.లో వివిధ రకాల వృత్తుల కార్మికులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. నిర్మాణరంగం, దుస్తుల తయారీ, జి.ఐ.జి. ఫ్లాట్ ఫాం పనులు, వీధి వ్యాపారం, ఇళ్లలో పనిమనుషులు, వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలు, రవాణా రంగం వంటి వివిధ రంగాలకు చెందిన వారు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ రంగాలు కొన్నింటిలో భారీ ఎత్తున వలస కూలీలను కూడా వినియోగిస్తూ వస్తున్నారు. వలసకూలీలతో సహా, అసంఘటిత రంగానికి చెందిన కార్మికులంతా ఇపుడు వివిధ సామాజిక భద్రతా పథకాలు, ఉపాధి ఆధారిత పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ శ్రామ్ పోర్టల్.లో వారు తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా వివిధ పథకాల ప్రయోజనాలు పొందడానికి వీలుంటుంది.

https://ci4.googleusercontent.com/proxy/62sHtXE-0qL3Es4B3uUw_z7j4Rpwazo4Ax1q6IRy9fy5RXG6L6fLzm6WPaFjJ3oFLcwQH61b9P6-t5-jB0nI4_tciUgslagM3Kv2S0Uqaq_y_ApPrljHpgnpDg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001B484.png

https://ci5.googleusercontent.com/proxy/b2afrFTLEGqLCdANOAn8cUyqhH52_gOz7kFTezVCYPUVTTxY7amUMQ1B2IQksnyZWiQUJ4QIM9VhzIP2foeuzGN7PINQitzzh2KE-7RTl_tU1ZaLcy2ywNYuyQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002W9FT.png

   తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకూ 4కోట్ల 9లక్షల మంది కార్మికులు పేర్లు నమోదు చేయించుకున్నారు. వారిలో 50.2శాతం మంది మహిళా కార్మికులు కాగా, 49.98మంది పురుష కార్మికులు. పురుషులు, మహిళలు దాదాపు సమానస్థాయిలో పేర్లు నమోదు చేసుకోవడం ఎంతో ప్రోత్సహకరమైన పరిణామంగా భావిస్తున్నారు. ఈ కింద గ్రాఫ్.లలో చూపిన ప్రకారం ఈ శ్రామ్ పోర్టల్.లో నమోదు చేసుకున్న పురుష, మహిళా కార్మికుల సభ్యల సంఖ్యలో ఏ వారానికి ఆవారం వృద్ధి ఉన్నట్టు తెలుస్తోంది.

https://ci5.googleusercontent.com/proxy/ZuLb4lBRP4FirJC9huFYk_TqFUy6_SyR_AP8CD1Ure0OrTKNwJAScvjwLJEJ-qt83MasiKRv3Xikzyfa6yXfI92PWoMgARLNvDo_3juQ53V2cdMRd0oVh-ftmg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003X9OX.png

     ఈ శ్రామ్ పోర్టల్.లో కార్మికుల వివరాల నమోదు విషయంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ కింద సూచించిన గ్రాఫ్. ప్రకారం ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ రిజిస్ట్రేషన్ సంఖ్య పరిశీలనలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంది. చిన్న చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తక్కు సంఖ్యలో కార్మికుల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. మేఘాలయ, మణిపూర్, గోవా, చండీగఢ్ వంటి చోట్ల కార్మికుల నమోదు ప్రక్రియ మరింత  వేగం పుంజుకోవలసిన అవసరం ఉంది.

https://ci3.googleusercontent.com/proxy/7p2DAhx2MXQw1lUWBKoyPSgKt2O6NNT2lNorZrSWKc6FjqcZc2t6D6y27Omwg0-ZBrzEMzBVw1OdlXWRtEHGJTnuru7GzMQsW3lChHr2c9kXIuA7otLil6iijw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004JTAZ.png

   అత్యధిక శాతం కార్మికుల రిజిస్ట్రేషన్ మాత్రం,.. వ్యవసాయ, నిర్మాణ రంగాల్లోనే జరిగింది. భారతదేశంలో ఉపాధి కల్పన కేవలం ఈ రెండు రంగాల్లోనే ఎక్కువగా జరుగుతున్నందున సదరు రంగాల్లోనే రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి తోడు, ఇళ్లలోని పనిమనుషులు, గృహ సంబంధమైన కార్యకలాపాలు నిర్వహించేవారు, దుస్తుల రంగం కార్మికులు, ఆటోమొబైల్, రవాణా రంగాల కార్మికులు, ఎలక్ట్రానిక్స్ హార్డ్ వేర్ కార్మికులు, విద్యారంగం, ఆరోగ్యరక్షణ, రిటెయిల్ వాణిజ్యం, పర్యాటక, ఆతిథ్య, ఆహార పరిశ్రమ వంటి రంగాలకు చెందిన పలువురు కార్మికులు కూడా పెద్దసంఖ్యలో తమ వివరాలను పోర్టల్.లో నమోదు చేయించుకున్నారు.

   వివరాలు నమోదు చేయించుకున్న కార్మికుల్లో దాదాపు 65.68శాతం మంది 16-40 సంవత్సరాల మధ్య వయస్కులే ఉన్నారు. 40 సంవత్సరాలు ఆపైన వయస్సున్న కార్మికులు 34.32శాతం మంది ఉన్నారు. ఇక సామాజిక నేపథ్యం ప్రకారం కార్మికుల వివరాల రిజిస్ట్రేషన్లను పరిశీలించినపుడు, ఇతర వెనుకబడిన తరగతుల వారు (ఒ.బి.సి.లు) 43శాతం మంది,  సాధారణ కులాల వారు 27శాతం మంది ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలవారు (ఎస్.సి.లు) 23శాతం ఉండగా, షెడ్యూల్డ్ తెగల (ఎస్.టి.) కార్మికులు 7శాతం మంది ఉన్నారు.

https://ci5.googleusercontent.com/proxy/V4XbQhAr7R0ighuTwX0ro6yBNPC4zrJ5kqMTJdJ_emxP-d2s1ClF19PYMl5V2KCAYyG0URwE_UTPwaHmdvP5cN6uP7A4L8jKUHe0L-vi6LgWOe_dfIBwXatcrw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005LVNZ.png

   ఇక ఈ రిజిస్ట్రేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్ల (సి.ఎస్.సి.) ద్వారా గణనీయ స్థాయిలో  కార్మికుల నమోదు ప్రక్రియ జరిగింది. పైన ఇచ్చిన గ్రాఫ్.ను పరిశీలించినపుడు ఇదే విషయం తెలుస్తోంది. అయితే, కేరళ, గోవా, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపూర్.లలో ఎక్కువ సంఖ్యలో కార్మికులు తమంతట తామే స్వయంగా వివరాలను పోర్టల్.లో నమోదు చేసుకోవడం ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చు. దాద్రా నాగర్-హవేళీ, అండమాన్-నికోబార్ దీవులు, లడఖ్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

   అయితే,..ఎక్కువ భారీ స్థాయిలో (77శాతం) కార్మికులు సి.ఎస్.సి.ల ద్వారానే తమ వివరాలను నమోదు చేయించుకున్నారని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. సి.ఎస్.సి.ల ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ల సంఖ్యకు సంబంధించి వారం వారం పెరుగుదల నమోదవుతూ వచ్చిందని గ్రాఫ్ సూచిస్తోంది. పోర్టల్.లో పేర్ల, వివరాల నమోదు వల్ల ఉపయోగాలను, వివిధ సంక్షేమ పథకాల అనుసంధాన ప్రయోజనాన్ని కార్మికులకు వివరించి, వారు తమ సమపంలోని సి.ఎస్.సి.ల ద్వారా వివరాలు నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తూ అధికారులు తగిన చర్యలు కూడా తీసుకున్నారు.

   ఈ-శ్రామ్ పోర్టల్. వల్ల ఒనగూడే ప్రయోజనాలు, పోర్టల్ స్వరూప స్వభవాల గురించి కార్మికులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కార్యదర్శులు రామేశ్వర్ తేలీ, సునీల్ బర్త్వాలీ, కార్మిక వ్యవహారాల కేంద్రీయ కార్యాలయం ప్రధాన కమిషనర్, ప్రాంతీయ కార్యాలయాల అధికారులు పలు చర్యలు తీసుకున్నారు.  అసంఘటిత రంగ కార్మికులతో, ట్రేడ్ యూనియన్ల నాయకులతో, మీడియాతో వారంతా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. తద్వారా, కార్మికులు తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా తమ వివరాలను ఈ-శ్రామ్ పోర్టల్.లో నమోదు చేసుకునేలా వారిని ప్రోత్సహించారు.

   అసంఘటిత రంగంలో పనిచేస్తున్న, ఉపాధి పొందిన కార్మికులు కీలకమైన సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను కోల్పోకుండా చూసేందుకు ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్లు ఉపయోగపడతాయి.

   ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోదలిచిన కార్మికులు,.. ఈ-శ్రామ్ మొబైల్ అప్లికేషన్.ను లేదా వెబ్.సైట్.ను వినియోగించుకోవచ్చు. అంతేకాక తమ సమీపంలోని సి.ఎస్.సి.లను, సంబంధిత రాష్ట్ర సేవా కేంద్రను, కార్మిక సహాయ కేంద్రాలను, తపాలాశాఖ పరిధిలోని డిజిటల్ కేంద్రాలకు సంబంధించిన ఎంపిక చేసిన పోస్టాఫీసులను కూడా వారు సంప్రదించి, తమ పేర్లను ఈ శ్రామ్ పోర్టల్.లో నమోదు చేసుకోవచ్చు.  

   ఈ-శ్రామ్ పోర్టల్.లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రామ్ డిజిటల్ కార్డు అందుతుంది. వారు తమ వివరాలను పోర్టల్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నవీకరించుకోవచ్చు. ఈ-శ్రామ్ కార్డు సార్వత్రిక ఖాతా సంఖ్య (యూనివర్సల్ అక్కౌంట్ నంబర్)ను కలిగి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఆ కార్డును ఆమోదిస్తారు. దీనితో,.. సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు అందుకునేందుకు వారు వివిధ ప్రాంతాల్లో మళ్లీ తమ వివరాలు నమోదుచేసుకోవలసిన అవసరం ఉండదు. ఈ-శ్రామ్ పోర్టల్.లో తన వివరాలు నమోదు చేసుకున్న ఎవరైనా కార్మికుడికి ప్రమాదం జరిగితే తగిన పరిహారం అందుతుంది. ప్రమాదంలో మరణం, లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ. 2లక్షలు, పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ. లక్ష పరిహారంగా లభిస్తుంది.

 

*******



(Release ID: 1764580) Visitor Counter : 235