ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌సిఆర్, హర్యానా, పశ్చిమ బెంగాల్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు : దిగుమతుల విలువను భారీగా తగ్గించి చూపినట్టు గుర్తింపు

Posted On: 16 OCT 2021 11:31AM by PIB Hyderabad

ల్యాప్‌టాప్‌లుమొబైల్ ఫోన్‌లు వాటి విడి భాగాలను దిగుమతి చేసుకుంటూ వ్యాపారం చేస్తున్న వ్యాపారిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి సోదాలు చేపట్టింది . జాతీయ రాజధాని ప్రాంతంహర్యానా మరియు పశ్చిమ బెంగాల్ లలో ఈ దాడులను 10.10.2021 న ప్రారంభించారు.

సదరు సంస్థ తానూ దిగుమతి చేసుకున్న వస్తువుల వివరాలను సక్రమంగా వెల్లడించలేదని, వీటి విలువను తక్కువ చేసే చూపించించిందని సోదాల్లో అధికారులు గుర్తించారు. దీనికి సంబందించిన పత్రాలను, డిజిటల్ సాక్ష్యాలను అధికారులు సేకరించి స్వాధీనం చేసుకున్నారు. రికార్డులలో చూపని లావాదేవీలకు సంబంధించిన పత్రాలను, లెక్కల్లో చూపని పెట్టుబడులను, బోగస్ రుణ పత్రాలు లాంటి అక్రమాలకు సంస్థ పాల్పడినట్టు అధికారుల సోదాల్లో వెల్లడయింది. 

కస్టమ్స్ సుంకం నుంచి తప్పించుకునే ఉద్దేశ్యంతో  మనుగడలో లేని సంస్థల పేరిట వస్తువులను దిగుమతి చేసుకుని వాటి విలువను తక్కువ చేసి చూపడం మరియు/ లేదా వాటి వివర్రాలను  తప్పుగా ప్రకటిస్తూ సంస్థ అక్రమాలకు పాల్పడినట్టు అధికారుల సోదాలలో వెల్లడయింది. పోర్టు (లు) లలో వీటికి  క్లియరెన్స్ పొందిన  వస్తువులను  పుస్తకాల వెలుపల నగదుగా  లావాదేవీలు పేరిట దేశంలోని అన్ని ప్రాంతాలలో సంస్థ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కలకత్తా పోర్ట్ లో ఒక కంటైనర్ ను పరిశీలించిన సమయంలో అధికారుల దృష్టికి ఈ అక్రమ వ్యాపార మార్గం వచ్చింది. ఈ కంటైనెర్ లో 'హెచ్ డి ఎం ఐ కేబుళ్లు వచ్చినట్టు బిల్ అఫ్ లాడింగ్ లో చూపించారు. దీని విలువను 3.8 లక్షలుగా చూపించారు.  అయితే, అనుమానంతో కంటైనర్ సీలును తొలిగించి పరిశీలించిన అధికారులు దీనిలో ఎక్కువ విలువ కలిగిన ల్యాప్‌టాప్‌లుమొబైల్ ఫోన్‌లు వంటి వస్తువులను కనుగొన్నారు. వీటి విలువ 64 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. 

హవాలా రూపంలో ఇలా తక్కువ విలువ చూపి  దిగుమతి చేసుకున్న వస్తువులకు చెల్లింపులు చేసినట్టు అధికారుల సోదాలు, పరిశీలనలో వెల్లడయింది. ఇటువంటి అక్రమ పద్దతులను అనుసరిస్తూ సంస్థ వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 

గత మూడు సంవత్సరాలుగా సంస్థ మనుగడలో లేని సంస్థల పేరుతో పోర్టు ద్వారా దాదాపు 20 కోట్ల రూపాయల విలువ చేసే వస్తువులను దిగుమతి చేసుకుందని అధికారులు గుర్తించారు. అయితే, భారీగా విలువను తక్కువ చేసి చూపించడం వల్ల దిగుమతి చేసుకున్న వస్తువుల వాస్తవ విలువ 2000 కోట్ల రూపాయల వారు ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. 

అక్రమ విధానాలు అనుసరించి సంపాదించిన ఆదాయాన్ని ఎక్కువ విలువ కలిగిన ఆస్తుల కొనుగోలు , విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి,  అద్దెల రూపంలో వచ్చిన ఆదాయంగా సంస్థ చూపించింది. 

కేసులో ఆదాయం పన్ను శాఖ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. 

***(Release ID: 1764495) Visitor Counter : 100