విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎన్.హెచ్.పి.సి., దుల్హస్తి విద్యుత్పత్తి కేంద్రంతో పాటు, కిషన్-గంగా విద్యుత్పత్తి కేంద్రాలకు చెందిన ఆనకట్ట ప్రాంతాలను సందర్శించిన - కేంద్ర విద్యుత్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి
Posted On:
15 OCT 2021 4:21PM by PIB Hyderabad
జమ్మూ-కశ్మీర్ లోని బందిపోరా జిల్లా లోని గురేజ్ వద్ద ఉన్న 330 మెగా వాట్ల ఎన్.హెచ్.పి.సి., కిషన్-గంగా విద్యుత్ కేంద్రానికి చెందిన ఆనకట్ట స్థలాన్ని, కేంద్ర విద్యుత్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి, శ్రీ ఆర్. కె. సింగ్, ఈ రోజు, సందర్శించారు.
గౌరవనీయులైన కేంద్ర మంత్రి తో పాటు, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, శ్రీ ఎస్.కె.జి. రహాతే; ఎన్.హెచ్. పి.సి., సి.ఎం.డి., శ్రీ ఎ.కె. సింగ్; జమ్మూ-కశ్మీర్ రాష్ట్ర విద్యుత్ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి, శ్రీ రోహిత్ కన్సల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి, తమ పర్యటనలో భాగంగా, ఆనకట్ట మరియు స్పిల్-వే లోని వివిధ భాగాలను పరిశీలించారు. ఆనకట్ట టో-పవర్-హౌస్ (0.8 X 3 = 2.4 ఎం.డబ్ల్యూ) నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించి, పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ కేంద్ర మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా సంభాషించారు.
కేంద్ర విద్యుత్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి, శ్రీ ఆర్. కె. సింగ్, నిన్న, దుల్హస్తి విద్యుత్ప ఉత్పత్తి కేంద్రానికి చెందిన ఆనకట్ట ప్రాంతాన్ని కూడా సందర్శించారు. కేంద్ర మంత్రి తో పాటు, విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన వారిలో - భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, శ్రీ ఎస్.కె.జి. రహాతే; జమ్మూ-కశ్మీర్ రాష్ట్ర పి.డి.డి., ప్రధాన కార్యదర్శి, శ్రీ రోహిత్ కన్సల్; ఎన్.హెచ్. పి.సి., సి.ఎం.డి., శ్రీ ఎ.కె. సింగ్; కూడా ఉన్నారు.
ఆనకట్ట ప్రాంగణానికి చేరుకున్న శ్రీ ఆర్.కె. సింగ్ మరియు ఇతర ప్రముఖుల కు, దుల్హస్తి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, జనరల్ మేనేజర్ (ఇన్-ఛార్జ్), శ్రీ నిర్మల్ సింగ్, పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రముఖులందరికీ దుల్హస్తి విద్యుత్ కేంద్రం ఉద్యోగులు, ఇతర సీనియర్ అధికారులు ఘన స్వాగతం పలికారు. గౌరవనీయులైన కేంద్ర మంత్రి, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా, కేంద్ర మంత్రి, ఆనకట్ట ప్రాంగణాన్ని పరిశీలించి, విద్యుత్ కేంద్రం పనితీరును, అడిగి తెలుసుకున్నారు. దుల్హస్తి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, జనరల్ మేనేజర్ (ఇన్-ఛార్జ్), శ్రీ నిర్మల్ సింగ్, ఈ సందర్భంగా, విద్యుత్ కేంద్రం పనిచేసే విధానం గురించి, కేంద్ర మంత్రికి వివరించారు.
*****
(Release ID: 1764322)
Visitor Counter : 181