బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎన్‌టిపిసి దర్లిపాలి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరా ప్రారంభించిన ఎన్ఎల్‌సిఐఎల్ తలబిరా ప్రాజెక్టు
प्रविष्टि तिथि:
15 OCT 2021 1:47PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ పాలనా నియంత్రణలోని నవరత్న కంపెనీ అయిన ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్ ఒడిషా రాష్ట్రంలో తలబీరా II&III బొగ్గు గనులను (20ఎంటి వార్షిక సామర్ధ్యం) నిర్వహిస్తోంది.
తలబీరా II&III ఒసిపి ఆర్థిక సంవత్సరం 2020-21 నుంచి ఉత్పత్తిని ప్రారంభించి, తమిళనాడు, ట్యూటికోరిన్‌లోని ఎండ్ యూజ్ ప్లాంట్ (అదే రంగానికి చెందిన ) ఎన్‌టిపిఎల్‌కు సరఫరా చేస్తోంది. ఒప్పందం చేసుకున్న ఎండ్ యూజ్ ప్లాంట్ అవసరాలను నెరవేర్చిన తర్వాత, అధికంగా ఉన్న బొగ్గును దేశంలో బొగ్గు సరఫరా అవసరాలను నెరవేర్చేందుకు, బొగ్గు మంత్రిత్వ శాఖనుంచి తగిన అనుమతులు పొందిన తర్వాత ఇ-ఆక్షన్ ద్వారా బహిరంగ మార్కెట్‌లో అమ్ముతోంది.
విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరాలను పెంచేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అన్ని చర్యలనూ తీసుకొని, కాప్టివ్ కోల్ బ్లాకుల (గని యజమాని కంపెనీ అవసరాలను తీర్చేందుకు మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేసేవి) నుంచి కూడా విద్యుత్ రంగానికి సరఫరాలను మళ్ళించి, పెంచేందుకు నిర్ణయించింది. ఎన్‌టిపిసి విద్యుత్ ప్లాంట్ కోసం తలబిర II&III నుంచి బొగ్గు సరఫరాను మంత్రిత్వ శాఖ అందించింది.
ఈ నేపధ్యంలో, తలబిర II&III ఒసిపి నుంచి ఎన్‌టిపిసి (దర్లిపాలి & లారా విద్యుత్ ప్లాంట్లు)కి బొగ్గు సరఫరాను ప్రారంభించేందుకు రెండు కంపెనీలు కలిసి పని చేశాయి. ఒడిషా ప్రభుత్వానికి చెందిన గనుల శాఖ నుంచి అవసరమైన బొగ్గు బట్వాడా అనుమతులు, సకాల మద్దతు పొంది, బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాలు అందుకున్న 24 గంటలలోపు గురువారం (నిన్న) దర్లిపాలి విద్యుత్ ప్లాంట్కు బొగ్గు బట్వాడా ప్రారంభమైంది.
***
(रिलीज़ आईडी: 1764201)
आगंतुक पटल : 226