రక్షణ మంత్రిత్వ శాఖ
డిఆర్‌డిఒకు చెందిన నావల్ సైన్స్ & టెక్నలాజికల్ లాబొరేటరీ ప్రాంగణంలో డాక్టర్ ఎపిజి అబ్దుల్ కలాం ప్రేరణా స్థల్ ఆవిష్కరణ
Posted On:
15 OCT 2021 2:15PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఎపిఇ అబ్దుల్ కలాం 90వ జయంతి సందర్భంగా అక్టోబర్ 15, 2021న విశాఖపట్నంలోని నావల్ సైన్స్& టెక్నలాజికల్ లాబొరేటరీ (ఎన్ఎస్‌టిఎల్) ఆవరణలో డాక్టర్ ఎపిజి అబ్దుల్ కలాం ప్రేరణా స్థల్‌ను ప్రారంభించారు. డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ)కి చెందిన అత్యుత్తమ నావికాదళ పరిశోధనా ప్రయోగశాల ఎన్ఎస్‌టిఎల్. డాక్టర్ కలాం విగ్రహాన్నిడిఆర్‌డిఒ డైరెక్టర్ జనరల్ (నావల్ సిస్టమ్స్ & మెటీరియల్స్) డాక్టర్ సమీర్ వి కామత్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్‌టిఎల్ ఉత్పత్తులైన వరుణాస్త్ర, టార్పెడో అడ్వాన్స్‌డ్ లైట్ (టిఎఎల్), మరీచ్ డెకాయ్‌ను కూడా ఆ ప్రదేశంలో ప్రదర్శిస్తున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్&డి) ప్రాముఖ్యతను పట్టి చూపేందుకు డిఆర్‌డిఒ వివిధ చొరవలను చేపట్టి సాధారణ ప్రజలలో చైతన్యాన్ని పెంచి, యువ మనస్సులకు ప్రేరణను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. కలాం ప్రేరణా స్థల్ ప్రజలను, ముఖ్యంగా యువ మనసులను డాక్టర్ కలాం జీవితం, ఆయన తిరుగులేని విజయాలను ప్రభావితం చేసి, ప్రేరేపించనుంది.
***
(Release ID: 1764198)
Visitor Counter : 240