సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

మై పార్కింగ్స్ యాప్ ను ప్రారంభించిన శ్రీ అనురాగ్ ఠాకూర్


ప్రజలకు మై పార్కింగ్స్ యాప్ వల్ల అనేక ప్రయోజనాలు

అన్ని మున్సిపాలిటీలు ఇటువంటి సౌకర్యాన్ని కల్పించడానికి కృషి చేయాలి .. శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 14 OCT 2021 6:22PM by PIB Hyderabad

మై పార్కింగ్స్ యాప్ ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమంలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ముకేష్ సూర్యాన్కమీషనర్ శ్రీ గ్యానేష్ భారతి, .బిఈసిఐఎల్ సీఎండీ శ్రీ జార్జ్ కురువిల్లా కూడా పాల్గొన్నారు. 

యాప్ ను ప్రారంభించిన తరువాత ఏర్పటైన కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ ఠాకూర్  పార్కింగ్ సమస్య క్లిష్టమైన సమస్యగా మారిందని అన్నారు. ఈ యాప్ పార్కింగ్ సమస్యను పరిష్కరిస్తుందని అన్నారు. యాప్ తో పార్కింగ్ అంశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఒత్తిడి తగ్గుతుందని, తమ ప్రయాణాలను వారు ముందుగా నిర్ణయించుకోవచ్చునని అన్నారు. ఎటువంటి సమస్య లేకుండా యాప్ సహకారంతో ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చునని మంత్రి అన్నారు. పార్కింగ్ స్థలాలను ముందుగానే బుక్ చేసుకోవడానికి  యాప్ అవకాశం కల్పిస్తుందని వివరించారు. ఆన్ లైన్ లో పొందిన పార్కింగ్ స్థలంలో ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా తమ వాహనాలను నిలుపుకోవచ్చునని మంత్రి తెలిపారు. 

పార్కింగ్ సమస్యతో పాటు  కాలుష్య సమస్యను కూడా ఈ యాప్ తగ్గిస్తుంది. వాహనాలను నిలుపుకోవడానికి ఎక్కువ సమయం ప్రయాణించకుండా ముందుగా నిర్ణయించుకున్న స్థలానికి వెళ్లి పార్కింగ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ యాప్ ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ రోజు అందుబాటులోకి వచ్చిన యాప్ తరహాలో ఇతర మున్సిపాలిటీలు కూడా తమ తమ ప్రాంతాల్లో అమలు చేసి పార్కింగ్ సమస్యను పరిష్కరిస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 

ఢిల్లీలో వాహనాల సంఖ్యతో పాటు పార్కింగ్ సమస్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది.    పార్కింగ్ స్థలాలను డిజిటల్ విధానంలో గుర్తించి వాటిని నిర్వహించాలన్న ఆలోచన ఈ యాప్ కు రూపకల్పన చేసింది. మై పార్కింగ్స్ యాప్ ను బిఈసిఐఎల్  రూపొందించి అభివృద్ధి చేసింది. 

ఐఓటీ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే మై పార్కింగ్స్ యాప్ 1. ఐఒఎస్ ఆధారంగా పనిచేసే పరికరాలు , ఆండ్రాయిడ్ లలో ఉపయోగించడానికి వీలుగా యాప్ ను అభివృద్ధి చేశారు. 2. ప్రీ-పైడ్ కార్డులు 3 క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి యాప్ ను ఉపయోగించవచ్చు. 

దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని అధీకృత  పార్కింగ్ స్థలాలను డిజిటలీజ్ చేస్తూ కార్పొరేషన్ సహకారంతో  బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ యాప్ ను రూపొందించింది. ఈ సౌకర్యాన్ని దేశంలోని ఇతర మునిసిపాలిటీలలో కూడా అందుబాటులోకి తీసుకుని వస్తారు. 

యాప్ కింది ప్రయోజనాలను అందిస్తుంది. 

1.  స్పాట్ లేదా ముందుగానే పార్కింగ్ స్థలాన్ని పొందడం 

 

2. సులువుగా ఉపయోగించగలిగే మొబైల్ యాప్ ద్వారా  స్లాట్‌లను ఎంచుకునే సౌలభ్యం

 

3.  ప్రీపెయిడ్/స్మార్ట్ కార్డ్‌లతో పార్కింగ్ సమస్యకు పరిష్కారం 

 

4.  కాగిత రహిత చెక్-ఇన్ , వాహనాల చెక్-అవుట్ సౌలభ్యం 

 

5.  భద్రత,  రీకాల్ విధానంలో పార్కింగ్ స్థలాన్ని ఉపయోగించడం 

 

6.  సమీప పార్కింగ్ ప్రదేశంలో సౌకర్యాలు & సౌకర్యాల ప్రదర్శన

 

7.  రోజువారీ/సాధారణ ప్రయాణికుల కోసం పార్కింగ్ పాసుల జారీ 

 

8. ఈవీ  ఛార్జింగ్ స్టేషన్డీటీసీ / ఢిల్లీ మెట్రో కార్డుతో మై పార్కింగ్స్ యాప్ ను అనుసంధానం చేసుకోవడానికి అవకాశం 

9. బుకింగ్చెక్ ఇన్,  చెక్అవుట్ కోసం స్మార్ట్ QR కోడ్

 10.  ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థ

***



(Release ID: 1764190) Visitor Counter : 171