శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ , యూరోపియన్ యూనియన్ సహకారం 200 కోట్ల ప్రజల ఆకాంక్షలను సూచిస్తుంది.... కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


శాస్త్ర సాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై శ్రీ జితేంద్ర సింగ్ తో సమీక్షించిన అంబాసిడర్ యుగో అస్తుటో నేతృత్వంలోని యూరోపియన్ యూనియన్ బృందం

మరింత ఎక్కువ మంది విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలపై భారత్ యూరోపియన్ యూనియన్ దృష్టి... డాక్టర్ జితేంద్ర సింగ్

ప్రపంచవ్యాప్త ప్రభావం ఉన్న సముద్ర గర్భ ఖనిజ అన్వేషణా రంగంలో మరింత సహకారం అవసరం అన్న భారత్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన యూరోపియన్ యూనియన్

Posted On: 13 OCT 2021 4:29PM by PIB Hyderabad

భారత్ , యూరోపియన్ యూనియన్ సహకారం 200 కోట్ల  ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉంటుందని  కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూగర్భ శాస్త్రం, పెన్షన్లు, ప్రజా ఫిర్యాదులు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ ( స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. అంబాసిడర్ యుగో అస్తుటో నేతృత్వంలోని యూరోపియన్ యూనియన్ బృందంతో మంత్రి ఈ రోజు ద్వైపాక్షిక సంబంధాల పై చర్చలు జరిపారు. బృందానికి స్వాగతం పలికిన మంత్రి శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్  యూరోపియన్ యూనియన్ల మధ్య కుదిరిన అవగాహనను మరో అయిదేళ్ల పాటు పొడిగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కొని అభివృద్ధి సాధించడానికి వివిధ రంగాలలో భారత్ యూరోపియన్ యూనియన్ కలసి పని చేయవలసి ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  

ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి శాస్త్ర సాంకేతిక రంగాల అంతిమ లక్ష్యం కావాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షను ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఆరోగ్య, వ్యవసాయ, జల వనరులు, పునరుత్పాదక శక్తి, బయో టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి రంగాల్లో సహకారాన్ని మరింతగా మెరుగు పరుచుకోవడానికి భారతదేశంతో  యూరోపియన్ యూనియన్ కలిసి పని చేయాలని ఆయన కోరారు. 

భారత్ యూరోపియన్ యూనియన్ సాధించిన ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి పరిశోధన, ఆవిష్కరణ రంగాలలో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవలసిన అవసరం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 తీవ్ర ప్రభావాన్ని చూపిందని వ్యాఖ్యానించిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటువంటి పరిస్థితులు తిరిగి తలెత్తకుండా చూడడానికి శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషి చేయాలని కోరారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం కోవిడ్ సమస్యను సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించిందని మంత్రి వివరించారు. అంతర్జీతీయ భాధ్యతను నిర్వర్తించడానికి దేశంలో తయారైన వాక్సిన్ ను భారత్ విదేశాలకు ఎగుమతి చేస్తున్నదని అన్నారు.

ఇటీవల యూరోపియన్ యూనియన్ ప్రారంభించిన " హారిజాన్ యూరోప్ ( 2021-27) కార్యక్రమాన్ని ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్ దీనిలో పాల్గోవాలని దేశానికి ఆహ్వానం అందిందని అన్నారు. ఏడేళ్ల పాటు అమలులో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, ఐపీఆర్ సహకారం, సంయుక్త ప్రకటన, ఒప్పందం పై సంతకాలు చేయడం, సంయుక్త విశ్లేషణ లాంటి అంశాలపై తమకున్న సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన అంగీకారం కుదిరిన తరువాత మాత్రమే ఈ అంశంపై తుది నిర్ణయాన్ని తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 

యూరోపియన్ యూనియన్ నేతృత్వంలో అమలు జరుగుతున్న మిషన్ ఇన్నోవేషన్ 2.0 కార్యక్రమంలో భారతదేశం చురుగ్గా పాల్గొంటూ అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. నిర్దిష్ట కాల వ్యవధిలో అభివృద్ధి  లక్ష్యాలను సాధించడం, వనరుల వినియోగం అంశాలలో భాతదేశం తన వంతు సహకారాన్ని అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇంధన రంగంలో మార్పులు తీసుకుని రావడానికి అన్ని దేశాలు సంయుక్తంగా కార్యక్రమాలను అమలు చేయాలని భారత్ కోరుతున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

యూరోపియన్ యూనియన్ రాయబారి ఉగో అస్తుటో మాట్లాడుతూ కాలుష్య రహిత ఇంధన రంగం,  జీనోం సీక్వెన్సింగ్అంటార్కిటికాలోని సముద్ర రక్షిత ప్రాంతాలు,  హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాలలో సంయుక్తంగా పరిశోధనలు చేపట్టి మానవ సంబంధాలపై దృష్టి సారించ వలసి ఉంటుందని అన్నారు. యూరోపియన్ యూనియన్, భారతదేశాల మధ్య  విద్యార్థుల మార్పిడి కార్యక్రమం మరింత ఎక్కువగా జరగాలని అన్నారు. యూరోపియన్ యూనియన్ లో  ప్రస్తుతం  విద్యార్థుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా భారతదేశానికి చెందిన దాదాపు 200 మంది పీహెచ్ డి, 80 మంది హయ్యర్ స్కాలర్లు ఉన్నారని అన్నారు. 

ఆవిష్కరణ రంగంలో భారత్ యూరోపియన్ యూనియన్ ల మధ్య ఒక పైలట్ ప్రాజెక్టు అమలు జరుగుతున్నదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్త ప్రభావం ఉన్న సముద్ర గర్భ ఖనిజ అన్వేషణా రంగంలో మరింత సహకారం అవసరం అన్న భారత్ ప్రతిపాదన పట్ల ఆయన  సానుకూలంగా స్పందించారు. గుర్తించిన అంశాలపై తరచు చర్చలు జరపాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. 

అంటార్కిటికా పర్యావరణాన్ని పరిరక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహకరిస్తున్న భారతదేశానికి యూరోపియన్ యూనియన్ రాయబారి కృతజ్ఞతలు తెలిపారు.తూర్పు అంటార్కిటికా, వెడ్డెల్ సండ్ర ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా గుర్తించాలన్న యూరోపియన్ యూనియన్ ప్రతిపాదనకు భారతదేశం మద్దతు ప్రకటించింది. 

భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన శాస్త్ర సాంకేతిక అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా ఐపీఆర్, సమాచార మార్పిడి, వస్తువులు/పరికరాల బదిలీ అంశాలను అమలు చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. దీనికి సంబంధించిన అంశాలను చర్చించి, నివేదికను సిద్ధం చేయడానికి ఒక సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేస్తారు. 


(Release ID: 1763920) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Hindi , Tamil