రక్షణ మంత్రిత్వ శాఖ
సాయుధ దళాలలో మహిళల పాత్ర అన్న అంశంపై ఎస్‌సిఒ వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Posted On:
13 OCT 2021 4:16PM by PIB Hyderabad
కీలకాంశాలు
అధ్యక్షోపన్యాసం చేయనున్న సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్
యుద్ధ కార్యకలాపాలలో మహిళల పాత్రపై చారిత్రిక దృష్టి కోణం అన్న అంశంపై సెషన్‌కు అధ్యక్షత వహించనున్న ఐడిఎస్ (వైద్య) డిప్యూటీ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ మాధురీ కనిత్కర్
యుద్ధంలో నూతన పోకడలు, మహిళా యోధులకు అవకాశమున్న పాత్రలు అన్న ఇతివృత్తంపై సెషన్‌కు అధ్యక్షత వహించనున్న విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి శ్రీమతి నిరుపమా రావ్ మీనన్
అక్టోబర్ 14, 2021న షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సిఒ) నిర్వహిస్తున్న సాయుధ దళాలలో మహిళల పాత్ర అన్న అంశంపై నిర్వహిస్తున్న వెబినార్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో ఈ అంతర్జాతీయ వెబినార్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ స్వాగతోపన్యాసం చేయనున్నారు. ఎస్‌సిఒ సభ్యదేశాల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఇది విధానకర్తలకు, ఆ వృత్తిలో ఉన్నవారికి అవగాహన కల్పించడమే కాక, వారి జ్ఞానాన్ని సుసంపన్నం చేస్తుంది.
ఈ వెబినార్‌ను రెండు సెషన్లుగా నిర్వహించనున్నారు. యుద్ధ కార్యకలాపాలలో మహిళల పాత్రపై చారిత్రిక దృష్టి కోణం అన్న అంశంపై సెషన్‌కు ఐడిఎస్ (వైద్య) డిప్యూటీ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ మాధురీ కనిత్కర్ అధ్యక్షత వహిస్తారు. ఈ సెషన్‌లో భారత్ మాత్రమే కాకుండా, చైనా, కజఖస్తాన్, కిర్గిజస్తాన్ కు చెందిన వక్తలు తమ దృష్టి కోణాలను పంచుకుంటారు.
రెండవ సెషన్‌కు విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి శ్రీమతి నిరుపమా రావ్ మీనన్ అధ్యక్షత వహిస్తారు. ఈ సెషన్ ఇతివృత్తం - యుద్ధంలో నూతన పోకడలు, మహిళా యోధులకు అవకాశమున్న పాత్రలు. పాకిస్తాన్, రష్యన్ ఫెడరేషన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ప్రతినిధులు ఈ అంశంపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ సమావేశాన్ని, సభ్యదేశాల ప్రతినిధుల భౌతిక హాజరీతో 2020లో నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, దానిని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఎస్‌సిఒ సభ్య దేశాల మధ్య చర్చలు ముఖ్యమైనందున మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ నిర్వహిస్తున్నారు.
ముగింపు ఉపన్యాసాన్ని చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సిఐఎస్‌సి) చైర్మన్‌కు చీఫ్ ఆఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ బిఆర్ కృష్ణ ఇవ్వనున్నారు. ఈ వెబినార్‌లో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ పౌర, సైనిక అధికారులు పాల్గొననున్నారు.
భారతీయ రక్షణ దళాలలో మహిళలను అత్యవసరమైన, గర్వకారణమైన సభ్యులుగా గుర్తించడమే కాక, వారు సాయుధ దళాలకు తీసుకువచ్చే సామర్ధ్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. తదనుగుణంగా, భారతీయ రక్షణ దళాలలో మహిళలకు మరిన్ని అవకాశాలను కల్పించడమే కాక, పురుషులకు, మహిళలకు సమాన పనివాతావరణాన్ని సృష్టించేందుకు గత ఏడేళ్ళలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అది భారత సైన్యమైనా, భారతీయ నావికాదళమైనా, భారతీయ వైమానిక దళమైనా, నేడు భారతీయ రక్షణ దళాలలో మహిళలు ఎంతో సాధికారతను కలిగి ఉన్నారు.
(Release ID: 1763697)
Visitor Counter : 156