హోం మంత్రిత్వ శాఖ

గోర్ఖా సమస్య పరిష్కారానికి చర్చలు


గోర్ఖాలు, గూర్ఖా ప్రాంత సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయత్వంలో నిరంతర ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం

అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

2021 నవంబరులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో రెండవ దఫా చర్చలు జరపాలని నిర్ణయం

Posted On: 12 OCT 2021 7:43PM by PIB Hyderabad

గూర్ఖా సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలను చర్చించడానికి కేంద్ర హోంశాఖత్రిముఖ చర్చలు జరిపింది. డార్జీలింగ్ కొండలుటెర్రాయిదూర్స్ ప్రాంతానికి చెందిన గూర్ఖాల ప్రతినిధులుపశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో ఈ రోజు హోం శాఖ చర్చలు జరిపింది. కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఈ చర్చలు జరిగాయి. గూర్ఖా ప్రతినిధి వర్గానికి డార్జీలింగ్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ రాజు  బిష్త్ నాయకత్వం వహించారు. గోర్ఖాలుగూర్ఖా ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన శ్రీ అమిత్ షా దృష్టికి తీసుకుని వచ్చారు. 

  గూర్ఖా ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని శ్రీ అమిత్ షా అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను శ్రీ షా తెలుసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సీనియర్ అధికారుల సమక్షంలో 2021 నవంబరులో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించారు. ఈ సమావేశానికి సీనియర్ అధికారులను పంపాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. డార్జీలింగ్ కొండలు,టెర్రాయిదూర్స్ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసే అంశానికి మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. 

ఈ సమావేశంలో రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్మైనారిటీ వ్యవహారాల మంత్రి మరియు అలిపుర్ ద్వార్  పార్లమెంటు సభ్యుడు శ్రీ జాన్ బార్లాకేంద్ర హోం కార్యదర్శి శ్రీ అజయ్ భల్లాగిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వివేక్ జోషిపశ్చిమ బెంగాల్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ కృష్ణ గుప్తా మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  గూర్ఖాల ప్రతినిధి బృందంలో డార్జీలింగ్ శాసనసభ్యుడు నీరజ్ జింబాకుర్సోంగ్  శాసనసభ్యుడు    బి. పి.  బజ్‌గైన్కల్చిని  శాసనసభ్యుడు   బిషాల్ లామా,జిఎన్ఎల్ఎఫ్  అధ్యక్షుడు మన్ ఘిసింగ్సీపీఆర్ఎం అధ్యక్షుడు ఆర్‌బి రాయ్గోరానిమో అధ్యక్షుడు  దవా పఖ్రిన్ ఏబీజీఎల్  అధ్యక్షుడు   ప్రతాప్ ఖాటి ,సుమూమో అధ్యక్షుడు  బికాష్ రాయ్  కూడా సమావేశంలో పాల్గొన్నారు  

***



(Release ID: 1763399) Visitor Counter : 155


Read this release in: Hindi , English , Urdu , Bengali