సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
శ్రీనగర్‌లో ప్రసార భారతి ఆడిటోరియంను ప్రారంభించిన సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
Posted On:
11 OCT 2021 3:57PM by PIB Hyderabad
సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ శ్రీనగర్ ఆల్ ఇండియా రేడియోలోని ప్రసార భారతీ ఆడిటోరియంను ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాగణంను మొత్తం 170 మంది వీక్షకులకు అనువుగా నిర్మించారు. ప్రత్యేకమైన డిజిటల్ టెక్నాలజీతో దీనిని తీర్చిదిద్దారు. 2014లో ఇక్కడ వచ్చిన వరదల కారణంగా ఈ ఆడిటోరియం దెబ్బతిన్నది. దీనిని ఇప్పుడు పునరుద్ధరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆల్ ఇండియా రేడియో, దూర్‌దర్శన్‌ల పాత్రను కొనియాడారు. ఈ రెండు సంస్థలు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎంతో నాణ్యమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టుగా ఆయన వివరించారు. 2014లో వచ్చిన వరదలు, కోవిడ్-19 మహమ్మారి విస్తరించిన సమయంలో ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) శ్రీనగర్ శాఖ, దూర్‌దర్శన్ శ్రీనగర్ పోషించిన కీలక పాత్రను ఆయన గుర్తుచేశారు. దేశ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఆల్ ఇండియా రేడియో, దూర్‌దర్శన్ శ్రీనగర్ శాఖలు దేశ వ్యతిరేకంగా మన పోరుగు దేశాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తమతమ కార్యక్రమాల ద్వారా సమర్థంగా తిప్పుకొడుతూ తగిప అవగాహనను కల్పిచండంలో కీలక ప్రాతను పోషిస్తున్నట్టుగా తెలిపారు. 370వ ఆర్థికల్‌ను రద్దు చేసిన తరువాత జమ్ము కాశ్మీర్ శాంతి సౌభాగ్యాలతో ప్రగతి పథంలో వేగంగా దూసుకుపోతోందని తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేపట్టిన సమీకృత అభివృద్ధి, సుపరిపాలనతో పాటుగా స్థానికంగా జమ్ము కాశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరిపాలన ఈ ప్రాంతాన్ని గణనీయమైన అభివృద్ధి పథంలో నిలిపుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా ప్రముఖ కశ్మీరీ కళాకారులు, ప్రముఖ గాయకులు బషీర్ అహ్మద్ తైల్బాలీ బృందం గాత్ర కచేరీని ఏర్పాటు చేశారు.
****
(Release ID: 1763154)
Visitor Counter : 165