రైల్వే మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో వేగంగా సాగుతున్న రైల్వే విద్యుదీకరణ పనులు
ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేలో కతిహార్ నుండి గౌహతి వరకు మొత్తం 649 రూట్ కిలోమీటర్ల విద్యుదీకరణ పనులను పూర్తి చేసిన రైల్వే
న్యూ జల్పాయిగురి, న్యూ కూచ్‌బెహార్ వద్ద ట్రాక్షన్ మార్పు అవసరం ఉండదు : పెరగనున్న రైళ్ల వేగం
Posted On:
11 OCT 2021 12:13PM by PIB Hyderabad
దేశంలో బ్రాడ్ గేజ్ రైల్వే మార్గాన్ని 2023-24 నాటికి పూర్తిగా విద్యుదీకరణ చేయాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది. దీనివల్ల ఇంధన వినియోగ సామర్ధ్యం మెరుగుపడి ఉత్పాదకత ఎక్కువ అవడమే కాకుండా విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.
దేశంలో అమలు జరుగుతున్న ప్రణాళికలో భాగంగా ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే పరిధిలో 649 రూట్ కిలోమీటర్లు / కతిహర్ నుంచి గువహతి వరకు 1294 టన్ను కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. దీనితో దేశంలోని ముఖ్యమైన నగరాల నుంచి గువహతికి వేగంగా సులువుగా చేరడానికి రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా రాజధానికి రవాణా సౌకర్యం కల్పించడానికి ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒకటి.
ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే లోని 107 రూట్ కిలోమీటర్/ 273 టన్ను కిలోమీటర్ల పరిధిలో పూర్తి అయిన విద్యుదీకరణ పనులను కమిషన్ అఫ్ రైల్వే సేఫ్టీ అక్టోబర్ ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు తనిఖీ చేసింది. పనులు విజయవంతంగా పూర్తి అయినట్టు ప్రకటించింది. ఈ మార్గంలో ఎక్కువ వేగంతో ప్రయాణించే ప్రయాణీకుల రైళ్లను, ఎక్కువ బరువు కలిగి ఉన్న సరకుల రైళ్లను నడపడానికి అనుమతి ఇచ్చింది.
విద్యుదీకరణతో హై స్పీడ్ డీజిల్ ఆయిల్ పై చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. గువాహటి వరకు పూర్తి అయిన విద్యుదీకరణ వల్ల డీజిల్ పై చేస్తున్న ఖర్చు ఏడాదికి 300 కోట్ల రూపాయల వరకు తగ్గుతుంది. డీజిల్ వినియోగం నెలకు సరాసరిన 3400 కిలో లీటర్ల వరకు తగ్గుతుంది. గ్రీన్ రవాణా ఎక్కువ అవుతుంది. అంతరాయం లేకుండా జరిగే రైళ్ల కదలికల మూలంగా న్యూ జల్పైగురి, న్యూ కూచ్‌బెహార్ వద్ద పట్టాలను మార్చవలసిన అవసరం ఇకపై ఉండదు. దీనితో రైళ్ల వేగం పెరుగుతుంది. దీనితో కతిహార్/మాల్దా ల మధ్య రైళ్లు వేగంగా పరుగులు తీస్తాయి. రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ కాలం రెండు గంటల వరకు తగ్గుతుంది. సామర్ధ్యం 10 నుచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉండడంతో ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే లో రైళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది.
విద్యుదీకరణ వల్ల భారీ వస్తువుల రైళ్లను అధిక వేగంతో నడపవచ్చు. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే లో రైలు మార్గాలు ఎత్తుపల్లాలు, వంపులు, వంతెనలతో సంక్లిష్టంగా ఉంటాయి. ఉంది. ఎలక్ట్రిక్ ఇంజిన్లు ఈ సెక్షన్ లో సులువుగా, వేగంగా నడవగలుగుతాయి. దీనితో అధిక అశ్వ శక్తి గల డీజిల్ లోకోల అవసరాన్ని తొలగిస్తుంది. మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్ మరియు సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాలకు అదనంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడానికి వీలవుతుంది.
విద్యుదీకరణతో ఈ సెక్షన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. పవర్ కార్ల నిర్వహణ కోసం విఐయోగిస్తున్న ఇంధనం పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది (విద్యుదీకరించిన మార్గంలోనే సుమారు రూ. 10 కోట్లు). కామాఖ్యా జంక్షన్/ గువాహటి ల మధ్య 15 జతల ప్రస్తుత రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో ఒక పవర్ కార్‌ను తొలగించడం ద్వారా అదనపు ప్యాసింజర్ కోచ్‌తో నడపవచ్చు. దీనివల్ల ప్రయాణీకుల సంఖ్య మెరుగుపడుతుంది. విద్యుద్దీకరణ మెరుగైన నిర్వహణకు దారితీస్తుంది, వేగంగా తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేసే రైళ్ల నిర్వహణపై ఎక్కువ సమయాన్ని కేటాయించి వీటి నిర్వహణను మెరుగు పరచడానికి వీలవుతుంది.
***
(Release ID: 1762935)
Visitor Counter : 166