శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారతదేశంలో వ్యవసాయానికి ఇది స్వర్ణయుగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు
జమ్మూలో బాస్మతి & తేనెటీగల పెంపకందారుల సమావేశాలు, మొక్కల కణజాల సంస్కృతి ప్రయోగశాల, మూలికా తోట (సంజీవని తపోవన్) ను మంత్రి ప్రారంభించారు
నాడు పోస్టు చేయడమైనది:
10 OCT 2021 6:38PM by PIB Hyderabad
కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ (ఇండిపెండెంట్ ఛార్జ్) ఎర్త్ సైన్సెస్; పీఎంఓ (ఎంఓఎస్) పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం అగ్రికల్చర్ స్టార్ట్-అప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారతదేశంలో వ్యవసాయానికి ఇది స్వర్ణయుగం అని, ఆయన నాయకత్వంలో వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాలు, పరిశోధన ఆవిష్కరణలు 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని అన్నారు.
ఎస్‌కేయూఏఎస్‌టీ జమ్మూలో నిర్వహిస్తున్న 5 రోజుల ఉత్తర భారత ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన 2021 ముగింపు కార్యక్రమానికి ముఖ్యతిథిగా హాజరైన సందర్భంగా మంత్రి ఈ విషయం చెప్పారు.

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసమే రెండు కొత్త మంత్రిత్వ శాఖలు.. జల శక్తి నైపుణ్య అభివృద్ధి & వ్యవస్థాపకతశాఖలను సృష్టించారని ప్రకటించారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రకటించారు.
ప్రస్తుత ప్రభుత్వంలో భారతదేశంలో వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, భూసార కార్డు, వేప పూత యూరియా, పిఎమ్ ఫసల్ బీమా యోజన వంటి వివిధ కార్యక్రమాల ద్వారా స్పష్టమవుతోందని అన్నారు. పిఎం కిసాన్ సమ్మాన్, ఇ–-నామ్, పిఎం కిసాన్ మంధన్ యోజన లువ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా, వనరులతో బలోపేతం చేయడమే కాకుండా ఇంతకు ముందు లేనివిధంగా రైతులకు మర్యాద, గౌరవాన్ని కూడా అందించాయి.
వ్యవసాయం & ఆవిష్కరణల్లో జమ్మూకశ్మీర్ లో సాధించిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఉత్తర భారతదేశంలో మొదటి బయోటెక్నాలజీ పార్క్, కథువాలో రెండు హై సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, భారతదేశంలో మొదటి అరోమా మిషన్ ప్రారంభించడం వల్ల వృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు. ఫలితంగా జమ్మూలో వ్యవసాయదారులకు కొత్త అవకాశాలు వచ్చాయని మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా హాజరైన రైతులతో మంత్రి మాట్లాడుతూ, రైతు ఇప్పుడు తన సామర్థ్యం, వనరులను బట్టి బహుళ కార్యకలాపాలను చేపట్టవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి రాజీ లేకుండా రైతుకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని సింగ్ పేర్కొన్నారు.
వివిధ వినూత్న వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ రూ. లక్షల్లో సంపాదిస్తున్న పారిశ్రామికవేత్తల గురించి ఆయన ఉదహరించారు. అక్కడ ఉన్న విద్యార్థులను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వారిలా తయారు చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్‌ల ద్వారా వారిని వ్యవసాయ సాంకేతిక నిపుణులుగా మారాలని అన్నారు. నవ భారతదేశానికి వారు నిర్మాతలు కావాలని వ్యాఖ్యానించారు. మనదేశంలో వ్యవసాయం 19 వ శతాబ్దపు సాంప్రదాయ వ్యవసాయం కాదని, అత్యాధునికమైనదని అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విశ్వవిద్యాలయం కనీసం 75 వ్యవసాయ స్టార్టప్‌లను ప్రోత్సహించాలని ఎస్‌కేయూఏఎస్‌టీని కోరారు. తన మంత్రిత్వ శాఖ తరహాలో సైన్స్లో 75 యువ స్టార్టప్‌లు, సైన్స్లో 75 మహిళా యువ స్టార్టప్‌లు సైన్స్, 75 ఎస్ఐటీ హబ్‌లను ఎస్సీఎస్టీలకు అంకితం చేశామని డాక్టర్ జితేందర్ సింగ్ వివరించారు.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ మెడిసిన్, ఐఐఎం, ఎస్‌కేయూఏఎస్‌టీలను అనుసంధానం చేయడం అనివార్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రాధాన్యతాంశం (థీమ్) ఆధారిత ప్రాజెక్ట్‌లపై పనిచేయాలని, మిశ్రమ ఫలితాల కోసం సంస్థ ఆధారిత ప్రాజెక్ట్‌లను చేపట్టకూడదని సూచించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ (ఎన్ఐపీజీఆర్) , ఎస్‌కేయూఏఎస్‌టీవిద్యార్థులు మరింత అనుభవం కోసం ఈ సంస్థలను సందర్శించవచ్చని అన్నారు. ఇవి అత్యుత్తమ శాస్త్రీయ సాంకేతిక సంస్థలతో సమృద్ధిగా ఉన్నందున విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించాలని మంత్రి అన్నారు.

బాస్మతి బియ్యం, రాజ్‌మాష్ లేదా ఇతర ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడానికి సమర్థులను ఎంపిక చేయడానికి స్టార్టప్‌లు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. స్థానిక ఉత్పత్తులను, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి తాజా టెక్నాలజీ & సోషల్ మీడియా బూమ్‌తో పాటు విస్తృత మీడియా స్థలాన్ని అందుబాటులోకి తేవాలని మంత్రి అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయంపైనా మంత్రి మాట్లాడారు. తన పర్యటన సందర్భంగా, మంత్రి ఫ్యాకల్టీ క్లబ్, మెయిన్ క్యాంపస్ కోసం చాతాలో శంకుస్థాపన చేశారు. ఎస్కేయూఏఎస్టీలోని స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ లోగల టిష్యూ కల్చర్ ల్యాబ్ను, జమ్మూలో ఒక మూలికా తోట (సంజీవని తపోవన్)ను ప్రారంభించారు. బాస్మతిబియ్యం, తేనెటీగల పెంపకందారుల సమావేశాలను కూడా ప్రారంభించారు. ముగింపు కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు–-ఐసిఎఆర్ నిధులతో చేపట్టిన ఐడిపి ప్రాజెక్టును మంత్రి ఆవిష్కరించారు.
ప్రొఫెసర్ జె పి శర్మ, వైస్ ఛాన్సలర్, ఎస్కేయూఏఎస్టీ, జమ్మూ మాట్లాడుతూ వ్యవసాయ ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం ఎంతో మద్దతు ఇచ్చిందని ప్రశంసించారు. ఉత్తరాది రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల రైతులు, స్టార్టప్‌లు ఉత్సాహంగా పాల్గొన్నాయని చెప్పారు. జమ్మూ & కశ్మీర్లో ప్రత్యేక వ్యవసాయం ప్రగతిశీల రైతులకు కొత్త అవకాశాలను తీసుకొస్తుందని, స్టార్ట్-అప్‌లకు మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. డాక్టర్ ఎస్ కె మల్హోత్రా (కేంద్ర అగ్రికల్చర్ కమిషనర్), డాక్టర్ ఆర్ సి అగర్వాల్, (డిడిజి (విద్య), ఐసిఎఆర్, ఢిల్లీ),. దినేష్ కులకర్ణి, (ఆర్గనైజేషన్ సెక్రటరీ, బీకేఎస్), ప్రొఫెసర్ మనోజ్ కె ధర్, (వీసీ, జమ్మూ యూనివర్సిటీ), డాక్టర్ రెడ్డి, (డైరెక్టర్ సీఎస్ఐఆర్-ఐఐఎం జమ్ము) కూడా ముగింపు వేడుకలకు హాజరయ్యారు.
****
(రిలీజ్ ఐడి: 1762857)
సందర్శకుల సూచీ సంఖ్య : : 202