ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

నిమ్హాన్స్ 25 వ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ


' నవ భారత నిర్మాణంలో నేటి డాక్టర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది' .. మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ

' మానసిక వైద్యంపై సమాజంలో అవగాహన కలగాలి'

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందేశం ఇచ్చిన మంత్రి

90 పడకల మాడ్యులర్ ఫీల్డ్ కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన శ్రీ మాండవీయ

Posted On: 10 OCT 2021 8:35PM by PIB Hyderabad

బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) 25 వ స్నాతకోత్సవం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ రోజు ఘనంగా జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బి. ఎస్. బొమ్మాయి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్నాతకోత్సవంలో 227 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు వివిధ డిగ్రీలు, సర్టిఫికెట్లను స్వీకరించారు. ప్రతిభ కనబరచిన 13 మందికి పతకాలను ప్రధానం చేశారు. తన  స్నాతకోత్సవ ఉపన్యాసంలో శ్రీ మాండవీయ డాక్టర్లు అంకిత భావంతో పనిచేసి రోగులకు మెరుగైన సేవలను అందించాలని అన్నారు. నవ భారత నిర్మాణంలో డాక్టర్లు కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు. 

రజతోత్సవ వేడుకల సందర్భంగా  నిమ్హాన్స్‌లో నూతనంగా కల్పించిన  వివిధ సౌకర్యాలను కేంద్ర  ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన మరియు ఖచ్చితమైన క్రేనియల్  రేడియో సర్జరీ గామా నైఫ్ ఐకాన్ లను మంత్రి జాతికి అంకితం చేశారు. సాంప్రదాయ భారతీయ ఆరోగ్య సంరక్షణ విధానాన్ని  ఆధునిక బయో మెడిసిన్ తో  మిళితం చేసి వైద్యం అందించే  డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, నర్సుల హాస్టల్‌ లను మంత్రి ప్రారంభించారు. 

 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా   నిమ్‌హాన్స్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  మానసిక ఆరోగ్యంపై ఏర్పాటు చేసినఎగ్జిబిషన్‌ను ఆయనసందర్శించారు.  ప్రపంచ మానసిక ఆరోగ్య  దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మంత్రి  మానసిక ఆరోగ్యంపై సామాజిక అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.   మానసిక ఆరోగ్య సమస్యలను నివారించి,చికిత్స అందించవచ్చునని  ఆయన అన్నారు.  కేంద్రమంత్రి నిమ్హాన్స్‌లో 'పొగాకు మానేయండిహీరోగా ఉండండిఅనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 అంతకుముందు బెంగుళూరులో 90 పడకల మాడ్యులర్ కోవిడ్ ఫీల్డ్ హాస్పిటల్‌ను కేంద్ర ఆరోగ్య,, కుటుంబ సంక్షేమరసాయన , ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బిఎస్ బొమ్మై మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ కె. సుధాకర్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.  90 పడకల మాడ్యులర్ కోవిడ్ ఫీల్డ్ హాస్పిటల్ టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్నోకియాస్వస్తివియాట్రిస్ సంస్థలు సామజిక భాద్యత కార్యక్రమం కింద అందించిన నిధులతో  26 రోజుల రికార్డు సమయంలో రూపుదిద్దుకుంది.  ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో అమలు జరుగుతున్న టీకా కార్యక్రమం లక్ష్యాల మేరకు అమలు జరుగుతున్నదని అభినందించారు.  సిఎస్ఆర్ నిధులను సమకూర్చిన సంస్థల ప్రతినిధులను సన్మానించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి కర్ణాటకలో ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన నిర్వహించిన  ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్‌లకు ఉచిత ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పిఎమ్‌బిజెపి దేశవ్యాప్తంగా 8,300 మించి ఔషధ కేంద్రాలను నెలకొల్పి  అందరికీ సరసమైన ధరలకు నాణ్యమైన ఔషధాలను అందిస్తున్నదని అన్నారు.  దేశంలో జనరిక్ ఔషదాల  వినియోగం దేశంలో 2% నుంచి  10% కి పెరిగిందని అన్నారు.

 

***



(Release ID: 1762809) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi , Kannada