పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
సెంట్రల్ ఆసియా ఫ్లైవేకి సంబంధించిన 30 రేంజ్ దేశాల రెండు రోజుల సమావేశం ప్రారంభం
వలస పక్షులను కాపాడడమంటే చిత్తడి నేలలను కాపాడడం, టెరెస్ట్రియల్ ఆవాసాలను కాపాడడం, మొత్తంగా పర్యావరణాన్ని కాపడడం : శ్రీ భూపేంద్ర యాదవ్
Posted On:
06 OCT 2021 7:14PM by PIB Hyderabad
సెంట్రల్ ఏసియన్ ఫ్లైవే లో వలసపక్షుల సంరక్షణకు చర్యలు, వాటి ఆవాసాల పరరిరక్షణను బలోపేతం చేసే సంకల్పంతో రేంజ్ దేశాల రెండు రోజుల ఆన్‌లైన్ సమావేశం ఈరోజు ప్రారంభమైంది.
సెంట్రల్ ఏసియా ఫ్లైవే (సిఎఎఫ్) ఆర్కిటిక్, హిందూ మహాసముద్రం మధ్య యూరేసియాలో పెద్ద ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఈ ఫ్లైవే లో పలు వలసపక్షుల మార్గాలు ఉన్నాయి. ఇందులో ఇండియాతోపాటు 30 దేశాలు సెంట్రల్ ఏసియన్ ఫ్లైవేలో ఉన్నాయి.
ఈ సందర్భంగా కీలకోపన్యాసం చేస్తూ కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్, వలసపక్షలను సంరక్షించే కీలక బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2020 ఫిబ్రవరిలో గాంధీనగర్‌లో జరిగి వలసపక్షుల సదస్సుకుసంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి) 13 వ సమావేశం లో ప్రారంభోపన్యాసం చేస్తూ, ఇండియా వలస పక్షల సంరక్షణకు ఆసక్తితో ఉందని, ఇందుకు సంబంధించి అన్ని మధ్య ఆసియయా ఫ్లైవే రేంజ్ దేశాలతో క్రియాశీల సహకారాన్ని కలిగి ఉండనున్నదని చెప్పారన్నారు. అలాగే ఇతర దేశాల కోసం సెంట్రల్ ఏసియా ఫ్లైవే వెంట వలస పక్షుల సంరక్షణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారన్నారు.
సిఎంఎస్ సిఒపి 13 సందర్భంగా (యుఎన్ ఇపి,సిఎంఎస్ తీర్మానం 12.11(రివైసిఒపి3), 13.46 నిర్ణయాన్ని తీసుకొవడం జరిగింది. అలాగే సిఎంఎస్, ఏవియన్ సంబంధింత ఒప్పందాలకు సంబంధించి న చొరవలను మరింత బలోపేతం చేసేందుకు ఈ ప్రాంతంలో వలస పక్షుల సంరక్షన చర్యలకు మద్దతు నిచ్చేందుకు సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇండియా తన బాధ్యతనునిర్వర్తించేందుకు ,2021 అక్టోబర్ 6, 7 తేదీలలో ఇండియా సిఎఎఫ్ రేంజ్ దేశాలతో సమావేశాన్ని నిర్వహిస్తొంది. ఇందులో వలసపక్షుల సంరక్షణ విషయంలో ఇండియా తన అనుభవాన్ని , జాతీయ స్థాయి కార్యాచరణను ఇతరులతో పంచుకోనుంది. సిఎఎఫ్ పరిధిలో చోటుచేసుకుంటున్న చర్యలు, పరిరక్షణ ప్రాధాన్యతలు ఇతర కార్యకలాపాలను తెలియజేయనుంది. ఈ సమావేశంలో సిఎఎఫ్ రేంజ్ దేశాల ప్రతినిధులు, సిఎంఎస్ అనుబంధ సంస్థలు, అంతర్జాతీయంగా ఈ రంగంలోని నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభుత్వాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు.
కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ తమ ప్రసంగంలో, వలసపక్షుల ప్రాధాన్యత, పర్యావరణ వ్యవస్థలో వాటి ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు. అవి వెళ్లే మార్గంలో ఆహారం కోసం ఆగడం, వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని పరస్పర సమన్వయంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలన్నారు.
ప్రపంచంలోని 11 వేల పక్షుల రకాలలో ఐదింట ఒకటి వలసపోతాయన్నారు. కొన్ని సుదూర ప్రాంతాలకు వలసవెళ్లేవి కూడా ఉన్నాయన్నారు. వలస పక్షులను కాపాడుకోవడంలో పరస్పర సహకారం, సమన్వయం అవసరమని అవి ప్రయాణించే మార్గంలోని దేశాల మధ్య ఈ సహకారం అవసరమని అన్నారు.
***
(Release ID: 1762676)
Visitor Counter : 209