విద్యుత్తు మంత్రిత్వ శాఖ

3వ ఇండియా- యుకె ఎన‌ర్జీ అభివృద్ధి భాగస్వామ్యం- మంత్రుల‌స్థాయి ఇంధ‌న చ‌ర్చ‌


విద్యుత్ రంగంలో క్లీన్ ఎన‌ర్జీ ప‌రివ‌ర్త‌న దిశ‌గా నిర్మాణాత్మ‌క కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ముందుకు తీసుకువెళ్ల‌నున్న‌ ఉభ‌య‌ప‌క్షాలూ

Posted On: 09 OCT 2021 10:08AM by PIB Hyderabad

అభివృద్ధి భాగ‌స్వామ్యానికి ఇంధ‌నం-  3వ భార‌త్‌-యుకె మంత్రిత్వ‌స్థాయి ఇంధ‌న సంభాష‌ణ‌ను కేంద్ర విద్యుత్, నూత‌న‌ పునరుత్పాద‌క ఇంధ‌న శాఖ మంత్రి శ్రీ ఆర్‌.కె.సింగ్ భార‌త్‌వైపునుంచి పాల్గొన‌గా, యుకె వైపు నుంచి బిజిన‌స్‌, ఎన‌ర్జీ, పారిశ్రామిక వ్యూహానికి సంబంధించిన మంత్రి ,  క్వాసి క్వార్‌టెంగ్ ఎం.పి అధ్య‌క్థ‌త వ‌హించారు. ఇందుకు సంబంధించిన చ‌ర్చ వ‌ర్చువ‌ల్ విధానంలో నిన్న సాయంత్రం జ‌రిగింది.
ఈ చ‌ర్చ‌ల‌లో ఇంధ‌న ప‌రివ‌ర్త‌న ఒక ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా ఉంది.. ఇంధ‌న మంత్రులు ఇందుకు సంబంధించి  ఆయా దేశాల‌లో జ‌రుగుతున్ ఇంధ‌న ప‌రివ‌ర్త‌న కార్య‌క‌లాపాల పై విస్తృతంగా చ‌ర్చించారు. వీటిలో సౌర విద్యుత్‌, సముద్ర తీరం లోప‌ల ప‌వ‌న విద్యుత్‌. ఇవిలు, ప్ర‌త్యామ్నాయ ఇంధనాలు వంటివి ఇందులో ఉన్నాయి.

యుకె వైపు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చెప్పుకోద‌గిన  కార్య‌క‌లాపాల‌ను స‌వివ‌రంగా ప్ర‌స్తావించారు. అలాగే గ‌త రెండు సంవ‌త్సాల‌లో  ద్వైపాక్షిక  స‌హ‌కారం కింద  చేప‌ట్టిన కార్య‌కలాపాల‌నూ చ‌ర్చించి ,ఉభ‌య‌ప‌క్షాలూ దానివిష‌యంలో సంతృప్తి వ్య‌క్తం చేశాయి.

2021 మే 4న ఇండియా-యుకె వ‌ర్చువ‌ల్ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా ఇరువురు  ప్ర‌ధానమంత్రులు ఇండియా -యుకె భ‌విష్య‌త్ సంబంధాల‌పై 2030 రోడ్‌మ్యాప్ ను ఉభ‌య‌దేశాల ప్ర‌ముఖులు స్వాగ‌తించారు. 2030 రోడ్ మ్యాప్‌కు అనుగుణంగా భ‌విష్య‌త్ కొలాబ‌రేష‌న్‌కు సంబంధించి వివిధ అంశాలను వారు గుర్తించారు.

 

విద్యుత్‌, ప‌రిశుద్ధ ర‌వాణా, పున‌రుత్పాద‌క‌త‌, గ్రీన్ ఫైనాన్స్‌, క్లీన్ ఎన‌ర్జీ రిసెర్చ్ వంటి వాటిని 2030 రోడ్ మ్యాప్‌లో భాగంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ముంద‌కు తీసుకువెళ్లేందుకు ఉభ‌య‌ప‌క్షాలూ చ‌ర్చించాయి. స్మార్ట్ గ్రిడ్‌, ఎన‌ర్జీ స్టోరేజ్‌, గ్రీన్ హైడ్రోజ‌న్‌, చార్జింగ్ మౌలిక స‌దుపాయాలు, బ్యాట‌రీ స్టోరేజ్‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న‌లో పెట్టుబ‌డుల‌స‌మీక‌ర‌ణ‌, అలాగే బ‌హుళ ప‌క్ష కొలాబ‌రేష‌న్లు త‌దిత‌ర ప్ర‌తిపాద‌న‌ల‌ను గురించి కూడా ఉభ‌య‌ప‌క్షాలూ చర్చించాయి.


చ‌వ‌కయిని, సుస్థిర ఇంధ‌నాన్ని ప్ర‌పంచానికి అందించేందుకు, నిర్మాణాత్మ‌క కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ద్వారా విద్యుత్ రంగంలో పరిశ‌ద్ధ ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు ఉభ‌య‌ప‌క్షాలూ అంత‌ర్జాతీయ స‌హ‌కారాన్ని కోరాల్సిన దాని ప్రాధాన్య‌త‌ను చ‌ర్చ‌ల‌లో గుర్తించారు. కేంద్ర విద్యుత్‌,నూత‌న‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న శాఖ మంత్రి, గ్రీన్ హైడ్రోజ‌న్‌, స్టోరేజ్‌, స‌ముద్ర‌తీర‌స‌మీప ప‌వ‌న విద్యుత్‌, విద్యుత్ మార్కెట్ త‌దిత‌ర అంశాల‌కు సంబంధించిన ల‌క్షాల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించిన ఒక సూర్యుడు, ఒక ప్ర‌పంచం, ఒక గ్రిడ్ ( ఒ.ఎస్‌.ఒ.డ‌బ్ల్యు.ఒ.జి)  విధానం పున‌రుత్పాద‌క ఇంధ‌నానికి మ‌ద్ద‌తు నిచ్చేందుకు , గ్రిడ్ ఇంటిగ్రేష‌న్‌కు అనుకూల  ప్ర‌త్యామ్నాయం కాగ‌ల‌దని వారు ఆకాంక్షించారు.

***



(Release ID: 1762506) Visitor Counter : 214