విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంత‌ర్జాతీయ విద్యుత్ రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ఎల‌క్ట్రిసిటి డి ఫ్రాన్స్ ఎస్‌.ఎ తో ఒప్పందం కుదుర్చుకున్న ఎన్‌.టి.పి.సి

Posted On: 07 OCT 2021 1:34PM by PIB Hyderabad

విద్యుత్‌రంగంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. విద్యుత్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో గ‌ల ప్ర‌ముఖ విద్యుత్ రంగ కంపెనీ ఎల‌క్ట్రిసిటీ డి ఫ్రాన్స్ ఎస్‌.ఎ  , భార‌త‌దేశ‌పు  అతిపెద్ద ఇంధ‌న కంపెనీ ఎన్‌.టి.పి.సి లిమిటెడ్ లు ఒక అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాలు చేశాయి. మ‌ధ్య‌ప్రాచ్యం, ఆసియా, యూర‌ప్, ఆఫ్రికాల‌లో విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేందుకు ఈ  అవగాహ‌నా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్లాట్స్ టాప్ 250 గ్లోబ‌ల్ ఎన‌ర్జీ కంపెఎనీ ర్యాంకింగ్‌ల‌లో ఎన్‌.టి.పి.సి రెండో స్థానంలో ఉంది. 

ఈ ఎం.ఒ.యును ఎన్‌.టి.పి.సి వైపునుంచి ప్రాజెక్టుల డైర‌క్ట‌ర్ ఎ ఉజ్వ‌ల కాంతి భ‌ట్టాచార్య‌, ఫ్రాన్స్‌కు భార‌త రాయ‌బారి జావేద్ అష్రాఫ్, భార‌త్‌లో ఫ్రాన్స్ రాయ‌బారి ఎమ్మాన్యుయేల్‌లెనాఇన్‌, ఎన్‌.టి.పి.సి సిఎండి గురుదీప్ సింగ్‌, ఎన్‌టిపిసి క‌మ‌ర్షియ‌ల్ డైర‌క్ట‌ర్ సికె.మొండొల్‌, ఇడిఎఫ్ ఇండియా సిఇఒ, కంట్రీ ప్రెసిడెంట్ హ‌ర్‌మంజీత్‌సింగ్ న‌గి, ఎన్‌టిపిసి ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్ హెడ్ ఎన్‌.ఎం. గుప్త‌, ఎన్‌టిపిసి, ఇడిఎప్‌, ఐఎస్ె ,ఇండియాలో ఫ్రెంచ్ ఎంబ‌సీ సీనియ‌ర్ ఎక్జిక్యుటివ్‌ల స‌మ‌క్షంలో ఈ సంత‌కాలు జ‌రిగాయి.
ఇడిఎఫ్ ఫ్రాన్స్‌కు  ఇండియాలోని అతి పెద్ద విద్యుత్ ప్రాజెక్టు ఎన్‌.టి.పి.సి మ‌ధ్య  కుదిరిన అవ‌గాహ‌నా ఒప్పందం  మ‌ధ్య‌ప్రాచ్యం, యూర‌ప్‌, ఆఫ్రికా ప్రాంతంలో విద్యుత్‌ప్రాజెక్టుల అభివృద్ధి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డానికి అవ‌కాశం క‌లిపిస్తుంది.


రెండు కంపెనీలు  విజ్ఞాన మార్పిడి, ప‌రిశోధ‌న అభివృద్ధి, సాంకేతిక సేవ‌లు, క‌న్స‌ల్టెన్సీ అసైన్‌మెంట్‌ల‌ను అంత‌ర్జాతీయంగా చేప‌ట్ట‌డంలో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోనున్నాయి.
ఈ కొలాబ‌రేష‌న్ ప‌ట్ల ఎన్‌.టి.పి.సి ఆశాభావంతో ఉంది. ఇడిఎఫ్‌తో ఎన్‌టిపిసి కొలాబ‌రేష‌న్ అంత‌ర్జాతీయ‌మార్కెట్‌లో మ‌న పోటీత‌త్వాన్ని మ‌రింత పెంపొందించ‌నున్న‌ది. ఎన్టిపిసి అంత‌ర్జాతీయంగా  ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్ ఆస్తుల‌ను విస్త‌రింప చేసేందుకు ఇది ఉపక‌రిస్తుంది. క్లీన్ ఎన‌ర్జీ ప్రాజెక్టుల రోడ్ మ్యాప్‌న‌కు ఈ ఎం.ఒ.యు మ‌ద్ద‌తునిస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్లీన్ ఎన‌ర్జీ ప్రాజెక్టుల అభివృద్ధికి ఈ ఎం.ఒ.యు మ‌ద్ద‌తునిస్తుంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ప‌ర‌స్ప‌రం నిర్మాణాత్మ‌క పెట్టుబ‌డి అవ‌కాశాల‌ను ఇది క‌ల్పించ‌నుంది.

 అలాగే ఇడిఎఫ్ కూడా ఎన్ టిపిసితో ఒప్పందంపై స్పందించింది. ఎన్‌.టి.పి.సితొ క‌లిసి ఇండియాలో త‌క్కువ కార్బ‌న్ ఎన‌ర్జీ అవ‌కాశాల విష‌యంలో ప‌నిచేసేందుకు మేం ఎంతో ఆస‌క్తితో ఉన్నామ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఇడిఎప్ ప్ర‌స్తుతం త‌న కార్య‌క‌లాపాల‌ను 25 దేశాల‌లో నిర్వ‌హిస్తోంది. ఇడిఎఫ్‌కు అంత‌ర్జాతీయ రికార్డు ఉంది. ఎన్‌టిపిసితో క‌లిసి ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో మ‌రిన్ని అవ‌కాశాలను అందిపుచ్చుకునేందుకు ఎదురుచూస్తున్న‌ట్టు ఇడిఎఫ్ తెలిపింది.

ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం క‌ల దేశాల‌లో విద్యుత్ ప్రాజెక్టుల  అభివృద్ధిని ఇడిఎఫ్‌.ఎన్‌టిపిసి సంయుక్తంగా చేప‌ట్టేఅంశాన్ని ప‌రిశీలించ‌ను్నాయి. అలాగే ఈ రంగానికి సంబంధించిన విజ్ఞానం,సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకోనున్నారు. టెక్నిక‌ల్ సేవ‌లు, అంత‌ర్జాతీయ క‌న్సల్టెన్సీ అసైన్‌మెంట్‌ల అవకాశాల‌ను కూడా ప‌రిశీలించ‌నున్నారు. అలాగే క‌లిసిక‌ట్టుగా క్లీన్ ఎన‌ర్జీ విషయంలో పైల‌ట్ ప్రోగ్రామ్‌ల‌ను చేప‌ట్టే అంశాన్ని ప‌రిశీలించ‌నున్నాయి.

***

 (Release ID: 1762464) Visitor Counter : 84


Read this release in: English , Urdu , Hindi , Tamil