ఆర్థిక మంత్రిత్వ శాఖ
అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌లో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
08 OCT 2021 2:36PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంతం, పశ్చిమ బెంగాల్ నుంచి పని చేస్తున్న రెండు గ్రూపుల కేసుకు సంబంధించి 05.10.2021న ఆదాయపు పన్ను శాఖ సెర్చ్ అండ్ సీజర్ (సోదాలు, స్వాధీనం) ఆపరేషన్‌ను నిర్వహించింది. కొల్‌కతా, గువాహతి, రంగియా, షిల్లాంగ్, పట్నాలలో విస్తరించి ఉన్న 15 ఆవరణలపై ఈ సోదాలు నిర్వహించారు.
ఈ గ్రూపులలో ఒకటి సిమెంట్ ఉత్పత్తి వ్యాపారంలో నిమగ్నమై ఉంది. సోదాలలో పుస్తకాలలో నమోదు చేయని అమ్మకాల ద్వారా, బోగస్ వ్యయాన్ని చూపడం ద్వారా ఈ గ్రూపు లెక్కల్లోకి రాని ఆదాయాన్ని సమకూర్చుకుందని తేలింది. ఈ లెక్కల్లోకి ఆదాయాన్ని షెల్ కంపెనీల ద్వారా తిరిగి వ్యాపారాలలోకి తీసుకువచ్చారు. తన ప్రతిష్ఠాత్మక సంస్థలోకి అనుమానించలేని విధంగా దచిన్న మొత్తాలను ప్రవేశపెట్టేందుకు (అకామడేషన్ ఎంట్రీస్) అనేక కాగితాలపై ఉన్న కంపెనీలు సోదాలలో వెల్లడయ్యాయి. పేర్కొన్న చిరునామాలలో ఈ కాగితాలపై ఉనికి లేదని తేలింది. బోగస్ అసురక్షిత రుణాలను సూచించే నేరారోపణను ధృవీకరించగల ఆధారాలు, బోగస్ కమిసన్ చెల్లింపు, షెల్ కంపెనీల ద్వారా పొందిన బోగస్ షేర్ ప్రీమియం తదితరాలు సోదాలలో లభ్యమయ్యాయి. ఈ ఆధారాలు రూ. 50 కోట్లకన్నా ఎక్కువ మొత్తాన్ని లెక్కల్లో చూపలేదని సూచిస్తున్నాయి. కొందరు గిరిజన వ్యక్తులను రుణదాతలుగా ఈ గ్రూపు తప్పుడు ఆధారాలు చూపుతోంది. ఈ మొత్తం సుమారు రూ. 38 కోట్లుగా ఉంది. అంతేకాకుండా, కొన్ని విదేశీ సంస్థలు / బ్యాంకు ఖాతాలను కూడా సోదాల సందర్భంగా కనుగొన్నారు. వీటిని సహేతుకమైన ఆదాయపు రిటర్నులుగా ప్రకటించలేదు.
మరొక గ్రూపు, అస్సాం, మిజోరాం, ఈశాన్యంలోని ఇతర ప్రాంతాలలో రైల్వే కాంట్రాక్టులను అమలు చేయడంలో చురుకుగా నిమగ్నమై ఉంది. సోదాలు నిర్వహించే సమయంలో నేరారోపణ రుజువు చేసే పత్రాలు, విడి షీట్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా వెల్లడించని భూమి, ఇతర పెట్టుబడులలో రూపంలో ఉన్నట్టు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, భూమి, ఇతర ఆస్తులకు సంబంధించిన సేల్ డీడ్లు పెద్ద సంఖ్యలో ఉననాయి. వీటి విలువ, రూ.110 కోట్లకన్నా అధికంగా ఉంటుంది. సోదాల సందర్బంగా, ఈ ఆస్తుల సేకరణకు మూలానికి సంబంధించిన సంబంధిత ఆధారాలను వివరించలేకపోయారు. అదనంగా, ఆస్తుల అమ్మకాలలో రూ. 13 కోట్లకన్నా ఎక్కువ మొత్తంలో జరిపిన వివరాలతో కూడిన పత్రాలను కూడా కనుగొన్నారు.
ఈ సెర్చ్ అండ్ సీజర్ చర్యల ఫలితంగా రూ. 250 కోట్లకన్నా ఎక్కువ మొత్తంలో వెల్లడించని ఆదాయాన్ని గుర్తించారు. లెక్కల్లోకి రాని రూ. 51 కోట్లకన్నా ఎక్కువ నగదును స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది బ్యాంకు లాకర్లను స్తంభింపచేశారు. వీటిని ఇంకా తెరువవలసి ఉంది.
తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉంది.
***
(Release ID: 1762445)
Visitor Counter : 185