సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

డీడీ న్యూస్ చివ‌రి కాంక్లేవ్ 'ఇండియా ఫస్ట్' విదేశీ విధానం - విశ్వగురువు తయారీపై దృష్టి సారించింది


- సంవత్సరాలుగా భారతదేశ విదేశాంగ విధానంలో పరివర్తనపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌తో ప్రత్యేక చర్చ

- ‘ఈ రోజు మనది ఆత్మవిశ్వాసంతో కూడిన‌ దేశం. సంస్కృతి మరియు విలువలతో కూడుకొని, మనం జాతీయ ప్రయోజనాల సాధనకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము’: డా. ఎస్. జైశంకర్

- ప్రపంచ ప‌రిణామంలో స‌రికొత్త భారతదేశం యొక్క చిత్రం మారుతోందని అభిప్రాయ‌ప‌డిన‌ నిపుణుల ప్యానెల్

Posted On: 08 OCT 2021 10:32AM by PIB Hyderabad


భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలలో భాగంగా నిర్వ‌హిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌' కార్య‌క్ర‌మంలో  భాగంగా..  డీడీ  న్యూస్ సంస్థ వార్త‌ల్లోని ప్రముఖులు, విధాన నిర్ణేతలు, విష‌య నిపుణులతో నిర్వ‌హించిన ఏడు ఎపిసోడ్‌ల కాన్‌క్లేవ్ సిరీస్ ముగిసింది.  యువశక్తి నుండి సామాజిక సాధికారత నుండి ఈజ్ ఆఫ్ లివింగ్ వరకు.. స‌రికొత్త భార‌తావ‌ని ముఖ్యాంశాలను స్పృశిస్తూ అనేక అంశాలపై ఈ సమావేశంలో చ‌ర్చించారు. ఈ సిరీస్‌లో చివ‌రి కాన్‌క్లేవ్‌లో భాగంగా ‘ఇండియా ఫస్ట్’ ఫారిన్ పాలసీ గురించి చర్చించించారు. ‘ఇండియా ఫస్ట్' విదేశీ విధానం - విశ్వగురువు తయారీ అనే అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి డా.ఎస్. జైశంకర్‌తో ఒక ప్రత్యేక పరస్పర చర్చా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని డిస్టింగ్విష్డ్ ఫెలో, ఓఆర్ఎఫ్ అయిన డాక్టర్ హర్షవర్ధన్ పంత్ పర్యవేక్షించారు.  ఇందులో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మాజీ చీఫ్  వైస్ అడ్మిరల్ శేఖర్ సిన్హా, మాజీ డిప్యూటీ ఎన్ఎస్ఏ  డా. అర‌వింద్ గుప్తా, జేఎన్‌యు స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెస‌ర్ స్వ‌ర‌ణ సింగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అంతర్జాతీయ సంబంధాలను బోధించే ఉపాధ్యాయులు, విద్యార్థులతో కూడిన విష‌యాసక్తి గల ప్రేక్షకులు సెషన్‌లో పాల్గొని ప్రముఖులతో సంభాషించారు.
భారతదేశం  ఆర్థిక వ్యవస్థ పురోగ‌మిస్తోంది..
భారత విదేశాంగ విధానం - సామర్థ్యాలు, విశ్వసనీయత మరియు సందర్భాలను 3సీ ల పరివర్తన జరిగిందని కేంద్ర విదేశాంగ మంత్రి శాఖ డా ఎస్. జైశంకర్ అన్నారు.  'కోవిడ్ -19మ‌హ‌మ్మారిపై పోరాట చేస్తున్న సమయంలో భారత దేశపు సామర్థ్యాల పెరుగుదల స్పష్టంగా వెలుగులోకి వ‌చ్చింది. భారతదేశం  ఆర్థిక వ్యవస్థ పురోగ‌మిస్తోంది, పీపీపీ పరంగా ఇప్పుడు మ‌న దేశం మూడో అతిపెద్ద  వ్య‌వ‌స్థ‌గా అవ‌తరించింది. ప్రపంచ మానవతా సంక్షోభాలకు 'మొదటి ప్రతిస్పందనదారుడిగా'ను ప్రపంచ ఎజెండాను రూపొందించడంలో ప్రభావశీలిగా నిలుస్తుండ‌డం.. ప్రపంచం భారతదేశ సామర్థ్యాలను ఎలా ప‌రిగ‌ణిస్తోంద‌న్న అంశంలో మార్పు క‌నిపిస్తోంది' అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్' అనేది మ‌న రక్షణవాదం కాదు..
 'ఆత్మనిర్భర్ భారత్' అనేది మ‌న రక్షణవాదం కాదు, ఇది ప్రపంచానికి పని చేయడానికి, సహకారం అందించడానికి భారత దేశ సామర్థ్యాలు, మేటి బలాలను నిర్మించడానికి ఒక పిలుపు అని మంత్రి స్పష్టం చేశారు. ఇది ‘మేక్ ఇన్ ఇండియా, కానీ.. మేక్ ఫర్ ది వరల్డ్’ అనే గౌరవనీయులైన ప్రధాన మంత్రి దృష్టికి అనుగుణంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. దీనికి మంచి ఉదాహ‌ర‌ణ ఇటీవ‌ల దేశీయంగా రూపొందించిన టీకాల‌ని మంత్రి  పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారతదేశం తన స్వదేశీ వ్యాక్సిన్‌ను అందిస్తోంద‌ని పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకారంలో భాగంగా భార‌త్‌లో టీకాల‌ను త‌యారు చేస్తూ ఆయా దేశాల‌కు పంపిణీ చేస్తోంద‌ని వివ‌రించారు. అటువంటి దీర్ఘకాలిక ఆలోచనల‌తో మాత్రమే భారతదేశం దాని లోతైన బలాలను అభివృద్ధి చేయగలదు మరియు పరపతి పొందగలదని ఆయన అన్నారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీల‌కంగా..
‘కీల‌క ఇండో-పసిఫిక్ కీల‌క‌’ గురించి, విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, హిందూ మహాసముద్రం దాటి మన అభిరుచులు విస్తరించి ఉన్నందున, హిందూ మహాసముద్రం మధ్య పాత వ్యత్యాసం కనుమరుగైందని అన్నారు. ఆయా ప్రాంత నాగరిక వారసత్వం కలిగి ఉంద‌ని పేర్కొన్నారు. వాణిజ్యం, అనుసంధాన‌త‌ మరియు భద్రత విష‌యంలో మా ముఖ్య భాగస్వాములందరూ ఈ ప్రాంతంలోనే ఉన్నారు.  ఇండో-పసిఫిక్‌లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాలతో మేం అభిరుచులను పంచుకుంటామని మంత్రి వివ‌రించారు.  భారతదేశం కూడా విస్తరించిన పొరుగు ప్రాంతాలతో దాని చారిత్రక సంబంధాన్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించింది. తూర్పున ఆసియాన్, పశ్చిమాన పర్షియన్ గల్ఫ్ మరియు ఆఫ్రిక‌న్ దేశాల‌తో సంబంధాల‌ను పున‌ర్నిర్మించ‌డంపై దృష్టి సారిస్తోంది. భారతదేశం మరియు చైనాల మధ్య సంబంధాలకు శాంతి మరియు ప్రశాంతతే ఆధారం అని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ అన్నారు. శాంతిని కాపాడుతూ, భారత్ మరియు చైనా సరిహద్దు చర్చలను పరిష్కరించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్య ప్రయోజనాలపై త‌గిన విధంగా స‌హ‌క‌రించే విష‌యాన్ని ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌ని తెలిపారు. నేడు ప్రపంచ ప్రాముఖ్యత మార్గంలో పాత నాగరికతలు రెండూ, పరస్పర గౌరవం, పరస్పర స్థలాన్ని మరియు విభిన్న ఆసక్తులను గుర్తించడం ముఖ్యంమ‌ని మ‌న‌కు  బహుళ ధ్రువ ఆసియా అవసర‌మ‌ని మంత్రి వివ‌రించారు.
'పొరుగుదేశాల‌కు తొలి ప్రాధాన్య‌త‌..
'పొరుగుదేశాల‌కు తొలి ప్రాధాన్య‌త‌' అనే విధానం భారతదేశం తీసుకువ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు. భార‌తదేశ‌ విధానం వ‌ల్ల  బంగ్లాదేశ్‌తో భారతదేశ సంబంధాల‌లో విశేష‌మైన  మార్పు వ‌చ్చింద‌ని తెలిపారు, ఈ విధానం కార‌ణంగా సముద్ర మరియు భూ సరిహద్దు సమస్యలను పరిష్కరించడం, అనుసంధాన‌త  మరియు శక్తి సంబంధాలను పునర్నిర్మించబ‌డ్డాయని ఆయ‌న వివ‌రించారు. మ‌న పొరుగుదేశాలైన‌ భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవుల విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. వర్తకం, పెట్టుబడులు, ప్రజలు, విద్యుత్‌, కనెక్టివిటీ విష‌యంలోనూ సంబంధాలు పెరిగాయి.
ప్రపంచ ప్రధాన శక్తులలో ఒకటిగా భార‌త్‌..
 చ‌ర్చ‌లో భాగంగా నిపుణుల ప్యానెల్ భారతదేశం యొక్క గౌర‌వం ఎంత‌గానో అభివృద్ధి చెందింద‌ని  అంగీకరించ‌బ‌డింది. ఈ రోజు భారతదేశం ప్రపంచ ప్రధాన శక్తులలో ఒకటిగా పరిగణించబడుతోంద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌న దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు చూసే తరుణంలో ఉంద‌ని పేర్కొన్నారు. వైస్ అడ్మిరల్ శేఖర్ సిన్హా మాట్లాడుతూ నిర్ణయాత్మక చర్యలు, ఉన్నత ఆశయాలకు కృతజ్ఞతలు, భారతదేశం యొక్క విశ్వాసం గ‌రిష్ఠంగా ఉందని మరియు సైనిక సామర్థ్యాలకు సంబంధించి శక్తివంతమైన దేశంగా భార‌త స్థాయి ఎదుగుతూ వ‌స్తోంద‌ని వైస్ అడ్మిరల్ శేఖర్ సిన్హా అన్నారు. భార‌త్‌ హిందూ మహాసముద్ర ప్రాంతంలో నికర భద్రతా ప్రదాతగా మరియు ప్రధాన సముద్ర శక్తిగా మారింది.  హై-టెక్నాలజీ సైనిక పరికరాలలో పెట్టుబడి పెట్టడం మరియు దాని సరిహద్దు సంసిద్ధతను పెంచడంలో భార‌త్ మేటిగా ముందుకు సాగుతోంద‌ని అన్నారు. డాక్టర్ అరవింద్ గుప్తా మాట్లాడుతూ మునుపటిలా కాకుండా విదేశాంగ విధానం పై విపరీతమైన ఆసక్తి నెల‌కొని ఉంద‌ని, ప్రజా దౌత్యానికి ఒక నమూనా మార్పు అని అన్నారు.వాణిజ్యం, జాతీయ భద్రత లేదా ఉగ్రవాదం పరంగా - దేశీయ విధానంపై విదేశీ విధానం ప్రభావం కూడా స్పష్టంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ అంశం గురించి ఆయ‌న మాట్లాడుతూ భారతదేశ పెట్టుబడులు దీర్ఘకాలికంగా ఉన్నాయని, ఆఫ్ఘన్ మరియు ప్రపంచం రెండూ ఈ విష‌యం గుర్తించాయని ఆయన అన్నారు. ప్రొఫెసర్ స్వరన్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచం ఖండాల నుండి మహాసముద్రాల వైపు దృష్టి కేంద్రీకరిస్తోందని, దీనికి త‌గ్గ‌ట్టుగా భారతదేశం కూడా త‌న సముద్ర శక్తిని పెంపొందించుకోవడం ద్వారా త‌గిన విధంగా సిద్ధమవుతోందని అన్నారు. భారత నావికాదళం శోధన, సహాయక చర్యలు, తరలింపులు, స‌ముద్రాల‌లో దోపిడి నిరోధక కార్యకలాపాలలో భార‌త్ మేటిగా ముందుకు సాగుతోంది.  మారుతున్న ప్ర‌పంచ ప‌రిణామాల మధ్య, భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని విజయవంతంగా నిర్వహించింది. ఎజెండాను రూపొందించడంలో తన ప్రత్యేక ముద్రను చాటింది అని పేర్కొన్నారు.



(Release ID: 1762209) Visitor Counter : 163