ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 08 OCT 2021 9:07AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 93.17 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 21,257 కొత్త కేసులు నమోదయ్యాయి.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.71% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,40,221. ఇది 205 రోజుల కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 97.96% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 24,963 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,32,25,221 కు పెరిగింది.

వారపు పాజిటివిటీ రేటు (1.64%) గత 105 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.53%) గత 39 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 58.00 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****


(Release ID: 1762065) Visitor Counter : 158