వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పంటల సేకరణపై రాష్ట్రాల పోర్టల్స్.ను సమీకృతంచేసే వ్యవస్థ!
ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఆధ్వర్యంలో రూపకల్పన..
పంటలకు సరైన ధరను కల్పించే ప్రత్యేక ఏర్పాటు..
వ్యాపారుల, దళారుల ప్రమేయాన్ని నివారించడనమే లక్ష్యం
प्रविष्टि तिथि:
07 OCT 2021 3:15PM by PIB Hyderabad
వ్యాపారులను, మధ్య దళారులనుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు, రైతులకు తగిన ప్రయోజనం కలిగించేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఒక సానుకూల వ్యవస్థతో కూడిన అప్లికేషన్.ను రూపొందించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పంటసేకరణ పోర్టళ్లను సమీకృతం చేసేందుకు, పర్యవేక్షణకు, వ్యూహాత్మక నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన కనీస ప్రారంభ ప్రమాణాలతో (ఎం.టి.పి.లతో) ప్రత్యేక ఏర్పాట్లతో ఈ వ్యవస్థను రూపొందించారు.
అక్టోబరు నెలలో మొదలైన 2021-22వ సంవత్సరపు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కె.ఎం.ఎస్.)తో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పంటల సేకరణ ప్రక్రియలో మధ్య దళారుల ప్రమేయాన్ని తొలగించేందుకు, రైతులు తమ పంటకు సాధ్యమైనంతవరకూ అత్యుత్తమమైన విలువను పొందేలా చూసేందుకు ఈ కనీస ప్రారంభ ప్రమాణాల విధానం అవసరమైంది. ఇందుకు సంబంధించిన కేంద్ర పోర్టల్.ను సమీకృతం చేయడవల్ల, ఆయా రాష్ట్రాల సేకరణ లెక్కలను సర్దుబాటు చేసుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు వీలు కలుగుతుంది.
ఈ వ్యవస్థవల్ల సాధారణంగా సమాజానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నా, వివిధ భాగస్వామ్య వర్గాలకు అందే ప్రయోజనాలు మాత్రం ఈ కింది విధంగా ఉంటాయి.:
- రైతులు: తమ ఉత్పత్తులను తగిన రేట్లకు అమ్ముకోవడానికి రైతులకు వెసులుబాటు కలుగుతుంది. పంటలను తెగనమ్ముకోవలసిన అవసరం ఉండదు.
- సేకరణ సంస్థలు: పంటసేకరణ కార్యకలాపాల నిర్వహణకు మరింత మెరుగైన వ్యవస్థ అందుబాటులోకి రావడంతో వివిధ రాష్ట్రాల ఏజెన్సీలు, భారతీయ ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) తమ పరిమిత వనరులతోనే సమర్థవంతంగా సేకరణ ప్రక్రియను నిర్వహించ గలుగుతాయి.
- ఇతర భాగస్వామ్య వర్గాలు: సేకరణ ప్రక్రియ కార్యకలాపాలను యాంత్రీకరించి, ప్రమాణీకరించడంతో, ఆహార ధాన్యాల సేకరణ, గోదాముల్లో నిల్వ తదితర అంశాలపై సమీకృత పరిశీలనకు అవకాశం ఉంటుంది.
ఏకరూపత, పరస్పర నిర్వహణా ప్రయోజనాలకోసం కనీస ప్రారంభ ప్రమాణాలను అన్ని సేకరణ పోర్టళ్లలోనూ ఈ కింది అంశాలతో పొందుపరచవలసిన అవసరం ఉంది.:
- రైతుల/పంట భాగస్వాముల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్: పేరు, తండ్రిపేరు, చిరునామా, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు, భూమి వివరాలు, సొంతంగా సాగు, లేదా భాగస్వామ్య సాగు వంటి అంశాలను రిజిస్టర్ చేయించాలి.
- రిజిస్టరైన రైతు సమాచారాన్ని సంబంధిత రాష్ట్రానికి చెందిన భూమి రికార్డు పోర్టల్.తో సమీకృతం చేయడం.
- డిజిటలైజ్ చేసిన మండి/సేకరణ కేంద్రం కార్యకలాపాలు: కొనుగోలుదారు/విక్రయదారు ఫారాలు, విక్రయ ప్రక్రియకు సంబంధించిన బిల్లులు తదితరాలు.
- ఎక్స్.పెండిచ్యూర్ అడ్వాన్స్ ట్రాన్సఫర్ (ఇ.ఎ.టి.) పద్ధతి ద్వారా ఆన్ లైన్ చెల్లింపు. కనీస మద్దతు ధర ప్రయోజనాన్ని వేగంగా రైతులకు బదలాయించేందుకు ఇదే మార్గం.
- మర ఆడించిన లెవీ బియ్యం/గోధుమల బట్వాడా నిర్వహణ- అంగీకార పత్రం అప్.లోడ్ చేసిన వెంటనే తనంతట తానే బిల్లును రూపొందించే న్యవస్థ/బరువును సరిచూసే మెమో, నిల్వను స్వాధీనం పరుచుకునే వ్యవస్థ.
వాస్తవ సమయంలో ఎంతమంది రైతులు, పంట భాగస్వాములు ప్రయోజనం పొందారన్నది తెలిసేందుకు వీలుగా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సమీకృత పోర్టల్.కు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్.ఫేసెస్ ద్వారా సమాచారాన్ని పంపిణీ చేయడం. ప్రయోజనం పొందిన రైతుల్లో చిన్నకారు/మధ్యతరహా రైతుల సంఖ్య, దిగుబడి, సేకరించిన పంట పరిమాణం, జరిగిన చెల్లింపు, కేంద్ర నిల్వల నిర్వహణ వంటి అంశాలను తెలుసుకునేందుకు కూడా ఈ వ్యవస్థలో వీలు కలుగుతుంది.
వివిధ రాష్ట్రాలో ఈ వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమలు వివిధ స్థాయిల్లో ఉందన్న అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడం అవసరం. పైగా,.. స్థానిక అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంవల్ల అఖిల భారత స్థాయిలో ప్రమాణీకరించిన సానుకూల వ్యవస్థ ఎక్కడా అందుబాటులో లేదు.
పంటల సేకరణ వ్యవస్థల్లో వ్యత్యాసాలు కొనసాగుతున్న కారణంగా, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో సవాళ్లు ఎదురవుతున్నాయి. వివిధ రాష్ట్రాల సేకరణ కార్యకలాపాలతో సర్దుబాటు చేసుకోవడం ఒక్కోసారి దీర్ఘకాలిక ప్రక్రియగా మారుతోంది. దీనితో రాష్ట్రాలకు నిధుల విడుదల ప్రక్రియలో పలు రకాలుగా జాప్యం చోటుచేసుకుంటోంది. దీనికి తోడు,..ప్రమాణీకరించిన సేకరణ కార్యకలాపాలు లేని కారణంగా, ప్రక్రియ సమర్థవంతంగా జరగడంలేదు. దీనితో పంటల సేకరణ కార్యకలాపాల్లో మధ్యదళారుల రూపంలో జోక్యం ఏర్పడుతోంది.
రైతుల సంక్షేమానికి, కనీస మద్దతు దర ప్రాతిపదిన చేపట్టే సేకరణ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నది ఇక్కడ గమనార్హం. రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధరను పొందేలా చూడటానికి ఇదే సరైన సంప్రదాయబద్ధమైన మార్గం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి, జాతీయ ఆహార భద్రతా చట్టం సంపూర్ణ స్థాయిలో అమలు చేయడానికి వీలవుతుంది. పంటల సేకరణ కార్యకలాపాల్లో పారదర్శకత, సామర్థ్యం సాధించాలంటే సదరు కార్యకలాపాలను ప్రమాణబద్ధం చేయడం చాలా అవసరం. తద్వారానే చివరకు దేశ ప్రజలకు ఆహార భద్రత సాధించడం సులభతరమవుతుంది.
ఈ నేపథ్యంలోనే పంటల సేకరణకోసం కనీస ప్రారంభ ప్రమాణాలను రూపొందించడం, వాటిని కేంద్ర ఆహార ధాన్యాల సేకరణ పోర్టల్.తో (సి.ఎఫ్.పి.పి.తో) సమీకృతం చేయడం తదితర అంశాల ఆవశ్యకతపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వ సేకరణ ఏజెన్సీలకు కేంద్రప్రభుత్వం అవగాహన కల్పించింది. ఇందుకోసం కేంద్రం పలు వేదికలను ఆశ్రయించింది. అనంతరం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఒక సానుకూల వ్యవస్థతో కూడిన అప్లికేషన్.ను రూపొందించింది.
****
(रिलीज़ आईडी: 1762011)
आगंतुक पटल : 215