పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
డ్రోన్ ల కోసం డిమాండ్ సృష్టించడానికి అనువుగా ప్రభుత్వం పనిచేస్తోంది: పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
"ప్రజా ప్రయోజనాల కోసం డ్రోన్లు" అనే అంశంపై సామూహిక అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన - శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
Posted On:
06 OCT 2021 7:37PM by PIB Hyderabad
డ్రోన్ల విషయంలో ప్రమాణాల ఆధారిత విధాన రూపకల్పన యొక్క కొత్త విధానాన్ని అనుసరిస్తూ, ప్రభుతం ఒక సానుకూల వ్యవస్థగా పనిచేస్తోందే కానీ ఒక నియంత్రిత వ్యవస్ధగా కాదనీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వ పాత్ర మారిందని పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.
"ప్రజా ప్రయోజనాల కోసం డ్రోన్లు" అనే అంశంపై ఫిక్కీ నిర్వహించిన సామూహిక అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, సాంకేతికాభివృద్ధి కీలకమనీ, డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, మారుమూల నివసించే వారిని, అభివృద్ధి కేంద్రానికి తీసుకు వస్తుందనీ, పేర్కొన్నారు. "దేశవ్యాప్తంగా ప్రజలందరినీ అనుసంధానం చేయడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి." అని ఆయన చెప్పారు.
ఆవిష్కరణ లేదా సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిణామ క్రమంలో భారతదేశం ఇంత కాలం ఒక సాధారణ అనుసరించే దేశం గా ఉండేది, అయితే, ఇప్పుడు, మనం, నాయకులుగా, మొదటిసారి చూస్తున్నామని, పౌరవిమానయాన శాఖ మంత్రి శ్రీ సింధియా పేర్కొన్నారు.
కొత్త డ్రోన్ నియమాలు, డ్రోన్‌ల కోసం పి.ఎల్.ఐ. పధకంతో చాలా తక్కువ వ్యవధిలో, దేశీయ తయారీ పరిశ్రమ కు భారీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. "ఈ రంగానికి 40 శాతం విలువ జోడించడం ద్వారా , ఇది, ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తుంది." అని శ్రీ సింథియా చెప్పారు.
ఏదైనా సాంకేతికత విజయవంతం కావాలంటే, పాలసీ నిర్మాణం, నిధుల ప్రోత్సాహకాలు, డిమాండ్ నిర్మాణం వంటి మూడు దశలు అవసరమని కూడా ఆయన పేర్కొన్నారు. స్వామిత్వ (గ్రామాల సర్వే మరియు గ్రామ ప్రాంతాలలో మెరుగైన సాంకేతికతతో మ్యాపింగ్) పథకం ద్వారా, భారతదేశంలో డ్రోన్ పరిశ్రమకు భారీ ప్రోత్సాహాన్నిచ్చే విధంగా, వేలాది గ్రామాలను మ్యాప్ చేయడం కోసం డ్రోన్‌లను ఉపయోగించాలని భారతదేశం యోచిస్తున్నట్లు, ఆయన తెలియజేశారు.
భారతదేశంలో చేరుకోడానికి చాలా కష్టతరమైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, అలాంటి ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా టీకాలు అందించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఫలితంగా టీకాలు వేసే కార్యక్రమ పరిధి పెరుగుతుందని, మంత్రి తెలియజేశారు. "టీకాలు వేసే కార్యక్రమానికి, మ్యాపింగ్ కోసం, భారతదేశంలో డ్రోన్ సాంకేతికతకు డిమాండ్ సృష్టించడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే, కీలక వినియోగదారునిగా పనిచేస్తోంది," అని సింథియా వివరించారు. డ్రోన్ పరిశ్రమ కోసం ప్రభుత్వం ఆమోదించిన పి.ఎల్.ఐ. పథకం భారతదేశంలో తాజా పెట్టుబడులు మరియు ఉపాధిని పెంచుతుందని మంత్రి చెప్పారు. డ్రోన్ సాంకేతికత ప్రస్తుతం ప్రయాణానికి సిద్ధంగా ఉందనీ, సాంకేతికత వేగం పుంజుకోడానికి సహాయపడాలని, ఆయన పారిశ్రామిక సంస్థలను కోరారు.
ప్రపంచ ఆర్ధిక మండలి, ఏరోస్పేస్ మరియు డ్రోన్స్ కి చెందిన శ్రీ విఘ్నేష్ సంతానం, ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెరిగిన ఉత్పత్తి ద్వారా, సురక్షితమైన జీవనోపాధి కోసం గ్రామీణ జనాభా నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా, నాల్గవ ఐ.ఆర్. టెక్ కోసం దిక్సూచిగా ఉన్న ఈ రంగానికి మద్దతు ఇవ్వడానికి డ్రోన్లు వ్యవసాయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయాలని, సూచించారు.
డ్రోన్ల పై ఫిక్కీ కమిటీ మరియు ఛైర్మన్ కార్యాలయం అధిపతి; రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రత్యేక ప్రాజెక్టుల అధిపతి, శ్రీ రాజన్ లూత్రా, ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశంలో భారీ మార్కెట్ సామర్థ్యంతో వ్యవసాయం చాలా ముఖ్యమైన రంగాలలో ఒకటి అనీ, వ్యవసాయంలో డ్రోన్ ల వినియోగం రైతులకు మరియు సామాన్య ప్రజలకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందనీ. పేర్కొన్నారు.
*****
(Release ID: 1761649)
Visitor Counter : 134