ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

92 కోట్ల డోసుల మైలురాయిని దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 59.48 లక్షలకుపైగా టీకాలు నిర్వహణ

97.94 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 18,833 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (2,46,687) 0.73 శాతం

వారపు పాజిటివిటీ రేటు ‍(1.68 శాతం) గత 103 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 06 OCT 2021 9:34AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 92 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 59,48,360 డోసులతో కలిపి, మొత్తంగా 92 కోట్ల డోసులను (92,17,65,405) టీకా కార్యక్రమం అధిగమించింది. 89,35,354 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,74,287

రెండో డోసు

89,58,559

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,56,341

రెండో డోసు

1,51,75,327

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

37,28,82,633

రెండో డోసు

9,25,66,106

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

16,26,25,090

రెండో డోసు

7,99,44,079

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,30,08,128

రెండో డోసు

5,78,74,855

మొత్తం

92,17,65,405

 

గత 24 గంటల్లో 24,770 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,31,75,656 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.94 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 101వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 18,833 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,46,687. ఇది 203 రోజుల కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఈ సంఖ్య 0.73 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,09,825 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57.68 కోట్లకుపైగా (57,68,03,867) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. గత 103 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.34 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 37 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 120 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****


(Release ID: 1761412) Visitor Counter : 175