కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐసీఎస్ఐ 53 వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Posted On: 04 OCT 2021 8:07PM by PIB Hyderabad

కంపెనీ సెక్రటరీలు తమ ప్రస్తుత బాధ్యతలకు మించి పనిచేయాలని, ప్రజలు మరింత సులువుగా పన్ను చెల్లించేలా మంత్రిత్వ శాఖలు , నియంత్రణ సంస్థలతో కలిసి పనిచేయాలని  కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ)  53 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో ఆమె మంగళవారం పాల్గొన్నారు.ఈ వేడుకల కోసం ఐసీఎస్ఐ ఆజాది కా అమృత్ మహోత్సవ్ను నేపథ్యంగా ఎన్నుకొని "ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్  ఇన్నోవేషన్ ద్వారా ఆత్మనిర్భర్ భారత్‌కు శక్తినివ్వడం" అనే థీమ్‌ను ఎంచుకున్నందుకు ప్రశంసించారు.

 

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కంపెనీ సెక్రటరీలు సమర్థంగా పనిచేసి అభినందనలు పొందినందుకు ఆర్థిక మంత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు  సన్‌రైజ్ సెక్టార్‌లో భవిష్యత్తులో సెక్రటరీల పాత్ర మరింత విస్తరిస్తుందని, దేశంలోని మరింతమంది యువత ఈ వృత్తిలో చేరాలని ఆమె కోరారు.

 

ఈ జ్ఞాపకార్థ వేడుకల్లో గౌరవ అతిథులుగా భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి  రాజేష్ వర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి & కార్యదర్శి, ఖర్చుల శాఖ కార్యదర్శి సోమనాథర్, భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి  రాజేశ్ వర్మ హాజరయ్యారు. డాక్టర్ టివి సోమనాథన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 53 సంవత్సరాలలో మంచి కార్పొరేట్ పాలనను ప్రోత్సహించడంలో విశేషమైన కృషి చేసినందుకు ఇనిస్టిట్యూట్‌ను అభినందించారు. కంపెనీ సెక్రటరీల పాత్ర  ప్రాముఖ్యత గురించి చర్చిస్తున్నప్పుడు, ఆయన స్పందిస్తూ "మీరు సమ్మతి విధానంలో నిపుణులు.  మీ ఆదర్శప్రాయమైన సలహా కార్పొరేట్లకు అదనపు సమ్మతి భారాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది" అని అన్నారు.

వాటాదారులకు, వివిధ సంస్థలకు  ఇతర సేవలకు, మంత్రిత్వ శాఖకు ప్రతి సహాయాన్ని అందించడంలో కంపెనీ కార్యదర్శుల కృషిని  రాజేష్ వర్మ ప్రశంసించారు. "కంపెనీల చట్టం, ఎల్ఎల్పీ చట్టం, బీఆర్ఆర్ కమిటీ నివేదిక రూపకల్పనలో అవసరమైన సవరణలు తీసుకురావడానికి విలువైన సూచనలు అందించడంలో ఐసీఎస్ఐ కీలక పాత్ర పోషించింది" అని  వర్మ పేర్కొన్నారు.

 

ఈ  సందర్భంగా, ఐసీఎస్ఐ తన 5 వ విదేశీ కేంద్రాన్ని ఆస్ట్రేలియాలో ఆర్థిక మంత్రి  చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ ఇన్స్టిట్యూట్ తన వృత్తి పురోగతిని మెరుగుపర్చుకుంటున్నదని నిర్మల అన్నారు. గ్లోబల్ కార్పొరేట్ గవర్నెన్స్ రంగంలో ఇన్స్టిట్యూట్  పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూట్ ప్రచురణ, సెబిపై రిఫరెన్సర్ (షేర్ ఆధారిత ఉద్యోగుల ప్రయోజనం  స్వెట్ ఈక్విటీ) నిబంధనలు 2021 ను ప్రారంభించింది.

 

సీఎస్ నాగేంద్ర రావు, ఐసీఎస్ఐ ప్రెసిడెంట్  మాట్లాడుతూ ఐసీఎస్ఐ  ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు సంతోషించారు. రికవరీని ముందుకు తీసుకెళ్లడం,  ప్రపంచంలో బలమైన  దృఢమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. "సమీప భవిష్యత్తులో ఇన్స్టిట్యూట్ దృష్టి  నైపుణ్యం ఆధారిత అభివృద్ధి; టెక్నాలజీ ఉపయోగం; వృత్తి  ప్రపంచీకరణ; పరిశోధన & నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు & పరిపాలన ప్రమాణాల ప్రచారంపై ఉంటుంది”అని వెల్లడించారు.

ఐసీఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ సీఎస్ సీఎస్ దేవేంద్ర  దేశ్‌పాండే, ఐసీఎస్ఐ చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. ‘‘కేఎంపీకిగా గుర్తింపుతో మనం సంతృప్తిపడకూడదు. సంపూర్ణ విధానంతో నిపుణులుగా మారుదాం. వాటాదారులందరికీ పరిష్కారాలను అందిద్దాం”అని సూచించారు.

సీఎస్ఎస్ఐ  గత అధ్యక్షుడు సీఎస్ రంజీత్ పాండే తన ప్రసంగంలో ఐసీఎస్ఐ  53 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణంలోని విశేషాలను పంచుకున్నారు.వేడుక  రెండవ భాగం "ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ , ఇన్నోవేషన్ ద్వారా ఆత్మనిర్భర్ భారత్‌కు శక్తినివ్వడం" అనే అంశంపై చర్చతో కొనసాగింది. ఇన్వెస్ట్ ఇండియా, ఎండీ, సీఈఓ దీపక్ బాగ్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్యానలిస్టులు అంతర్జాతీయ వినియోగదారు విధాన నిపుణుడు  వ్యవస్థాపకుడు, కన్స్యూమర్ ఆన్‌లైన్ ఫౌండేషన్ చైర్మన్ బెజోన్ కుమార్ మిశ్రా, ఎన్క్యాష్ ఫౌండర్ యాదవేంద్ర త్యాగి, ఐసిఎ ఎడుస్కిల్స్ వ్యవస్థాపకుడు  చైర్మన్   నరేంద్ర కుమార్ శ్యాంసుఖ పాల్గొన్నారు.


(Release ID: 1761133) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Marathi , Hindi