ఆర్థిక మంత్రిత్వ శాఖ

' పండోరా పేపర్స్' సంబంధించిన కేసుల పరిశోధన

Posted On: 04 OCT 2021 6:29PM by PIB Hyderabad
ఇంటర్నేషనల్ జర్నలిస్ట్స్ ఇంటర్నేషనల్ కన్సార్టియం (ఐసిఐజె) 3 అక్టోబర్ 2021 న,  200 కంటే ఎక్కువ దేశాలు, ప్రాదేశికాల నుండి సంపన్న ఉన్నత వర్గాల ఆఫ్‌షోర్ రహస్యాలను బహిర్గతం చేసే 2.94 టెరాబైట్ డేటా ట్రోవ్‌ అని చెబుతున్న గుట్టును బయటపెట్టింది. షెల్ కంపెనీలు, ట్రస్ట్‌లు, ఫౌండేషన్‌లు మరియు ఇతర సంస్థలను తక్కువ లేదా పన్ను లేని అధికార పరిధిలో చేర్చాలని కోరుకునే సంపన్న వ్యక్తులు మరియు కార్పొరేషన్‌లకు వృత్తిపరమైన సేవలను అందించే 14 ఆఫ్‌షోర్ సర్వీస్ ప్రొవైడర్ల రహస్య రికార్డుల లీక్ ప్రకారం ఈ పరిశోధన ఆధారపడి ఉంది. 

ఈ పరిణామాలను ప్రభుత్వం గమనించింది. సంబంధిత దర్యాప్తు ఏజెన్సీలు ఈ కేసులలో విచారణ చేపడతాయి, చట్ట ప్రకారం అటువంటి సందర్భాలలో తగిన చర్యలు  తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులలో సమర్థవంతమైన దర్యాప్తును నిర్ధారించే ఉద్దేశ్యంతో, సంబంధిత పన్ను చెల్లింపుదారులు/సంస్థలకు సంబంధించి సమాచారాన్ని పొందడం కోసం ప్రభుత్వం విదేశీ అధికార పరిధిలో కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తుంది. అటువంటి లీక్‌లతో సంబంధం ఉన్న పన్ను నష్టాలను సమర్థవంతంగా పరిష్కరించడానికి సహకారం, అనుభవాన్ని పంచుకునేలా చేసే ఒక అంతర్-ప్రభుత్వ సమూహంలో భారత ప్రభుత్వం కూడా భాగం..

ఐసిఐజే,  హెచ్ఎస్బిసి, పనామా పేపర్లు మరియు పారడైజ్ పేపర్‌ల రూపంలో గతంలో ఇలాంటి లీకేజీలను అనుసరించి, ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్ మనీ (వెల్లడించని విదేశీ ఆదాయం మరియు ఆస్తులు) మరియు పన్ను చట్టం 2015 ని అమలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. బ్లాక్ మనీని అరికకట్టడం లేదా అటువంటి ఆదాయంపై తగిన పన్ను మరియు జరిమానా విధించడం ద్వారా వెల్లడించని విదేశీ ఆస్తులు మరియు ఆదాయాన్ని అరికట్టడం ప్రభుత్వ లక్ష్యం.   పనామా మరియు ప్యారడైజ్ పేపర్లలో జరిపిన పరిశోధనలలో సుమారు రూ.20,352 కోట్లు (15.09.2021 నాటికి స్థితి) అప్రకటిత క్రెడిట్‌లు కనుగొన్నారు.

మీడియాలో ఇప్పటివరకు కొంతమంది భారతీయుల (చట్టపరమైన సంస్థలు అలాగే వ్యక్తులు) పేర్లు మాత్రమే వచ్చాయి. ఐసిఐజే  వెబ్‌సైట్ (www.icij.org) కూడా ఇంకా అన్ని సంస్థల పేర్లు, ఇతర వివరాలను విడుదల చేయలేదు.  ఐసిఐజే  వెబ్‌సైట్ సమాచారం దశలవారీగా విడుదల విడుదలవుతోంది. పండోర పేపర్స్ విచారణకు సంబంధించిన నిర్మాణాత్మక డేటా దాని ఆఫ్‌షోర్ లీక్స్ డేటాబేస్‌లో రాబోయే రోజుల్లో మాత్రమే విడుదల చేస్తుందని సూచిస్తుంది.

ఇంకా, పండోరా పేపర్స్ లీక్ అయిన సందర్భాలలో 'పండోరా పేపర్స్' అనే పేరుతో మీడియాలో కనిపించే కేసుల దర్యాప్తు మల్టీ-ఏజెన్సీ గ్రూప్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని ప్రభుత్వం సూచించింది. దీనిలో సిబిడిటి చైర్మన్ నేతృత్వంలో సిబిడిటి,ఈడి, ఆర్బిఐ, ఎఫ్ఐయు నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. 

****



(Release ID: 1760978) Visitor Counter : 241