పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
'ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్' సందర్భంగా విద్యార్థులు, యువత చేత హరిత ప్రతిజ్ఞ చేయించిన - శ్రీ భూపేంద్ర యాదవ్
ప్లానెట్-బి అనేది లేదు, ఈరోజు మన దగ్గర ఉన్నది వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, ఇది మన భవిష్యత్ తరాల నుండి వచ్చిన రుణం మాత్రమే : శ్రీ భూపేందర్ యాదవ్
జీవనశైలిలో వివేకంతో మార్పులు తీసుకురావాలని అందరినీ ప్రోత్సహిస్తుంది
Posted On:
04 OCT 2021 5:42PM by PIB Hyderabad
ఒక సారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలన సమస్యపై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత మరియు విద్యార్థులతో, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, దృశ్య మాధ్యమం ద్వారా అనుసంధానమై సంభాషిస్తూ, మన జీవనశైలిలో వివేకంతో మార్పులు తీసుకురావడం అనేది మనం వ్యక్తిగతంగా చేపట్టవలసిన ముఖ్యమైన వాతావరణ చర్యలలో ఒకటి అని పేర్కొన్నారు. ఇప్పుడు మన వద్ద ఉన్నది మన తల్లిదండ్రుల ద్వారా లభించిన ఆస్తి కాదనీ, అలాగే, ఇది మన భవిష్యత్తు తరాల నుండి మనకు లభించిన రుణంగా మనం గ్రహించేలా తెలియజెప్పే, ప్లానెట్-బి అనేది లేదనీ, ఆయన నొక్కిచెప్పారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడంతో పాటు, ఒక సారి ఉపయోగించి పారవేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ లను తగ్గించడం అనే మన లక్ష్యాన్ని సాధించడంలో విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని శ్రీ యాదవ్ ఉద్ఘాటించారు. మనమందరం మన పర్యావరణ వ్యవస్థకు ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన సూచించారు.
దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన వెబీనార్ లో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచీ పాల్గొన్న విద్యార్థులు, యువత చేత కేంద్ర పర్యావరణ మంత్రి హరిత ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఒక సారి ఉపయోగించి పారవేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ లను 2022 నాటికి పూర్తిగా తొలగించాలని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇచ్చిన స్పష్టమైన పిలుపును దృష్టిలో ఉంచుకుని, 'ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్' కింద, కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.ఈ.ఎఫ్.సి.సి), 2021 అక్టోబర్, 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన, వారోత్సవాలలో ఒక ఇతివృత్తంగా, "ఒక సారి ఉపయోగించి పారవేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్స్ వాడకాన్ని నివారించడానికి అవగాహన కార్యక్రమాలు" అనే అంశాన్ని గుర్తించడం జరిగింది.
"ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" కింద చేపడుతున్న కార్యక్రమాల పరంపరలో మొదటి కార్యక్రమంగా, "ఒక సారి ఉపయోగించి పారవేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ ల తొలగింపుపై" దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత కోసం, నిర్వహించిన వెబీనార్, హరిత ప్రతిజ్ఞ తీసుకునే కార్యక్రమంలో విద్యార్థులు, యువత తో పాటు పలు పర్యావరణ క్లబ్బులు, యువజన సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకునే విధంగా నిర్వహించిన ఈ వెబీనార్ లో, "ఒక సారి ఉపయోగించి పారవేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన" పై, దేశంలోని విద్యార్థులు, యువత ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని, పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థులు, యువత మార్పుకు ప్రతినిధులుగా మారే శక్తిని ప్రముఖంగా తెలియజేస్తూ, ఇందుకోసం, విద్యార్థులు, యువత తమను తాము నిర్వహించుకోవడానికి వీలుగా చేపట్టడానికి అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలను వివరించడం జరిగింది.
ఒక సారి ఉపయోగించి పారవేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నివారించడానికి, ప్రవర్తనా మార్పు అనేది, అత్యంత ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన సాధనాలలో ఒకటి. ఇది తక్కువ వినియోగం మరియు అధిక చెత్త వేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా, సమాజంలో ప్రవర్తనా మార్పును తీసుకురావడానికి విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషిస్తారు.
ఈ వెబీనార్ లో పాల్గొన్న బిహార్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలకు చెందిన విద్యార్థులు, యువకులు మాట్లాడుతూ, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంతో పాటు, ఒక సారి ఉపయోగించి పారవేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించడానికి తమ సంఘాలలో తీసుకున్న చర్యలపై తమ అనుభవాలను పంచుకున్నారు. భూమిని మరియు దాని సహజ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం; పునర్వినియోగాన్ని అలవాటు చేసుకోవడం; ఒకసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించడం; ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్రం సంచులను ఉపయోగించడం; పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం; ఎక్కువగా మొక్కలు నాటడం; విద్యుత్తు ను, నీటిని ఆదా చేయడం వంటి చర్యలు అవలంబించడానికి, తమవంతు కృషి చేస్తామని, ఈ వెబీనార్ లో పాల్గొన్న విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేశారు.
ఈ వారోత్సవాలలో భాగంగా, పాఠశాల విద్యార్థులు, యువత, పౌరులు, పౌర సమూహాలు, పరిశ్రమలు, మార్కెట్ సంఘాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయితీలను లక్ష్యంగా చేసుకుని, ఒకసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించడం కోసం, అవగాహన కార్యకలాపాలను చేపట్టాలని, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరడం జరిగింది. మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రాంతీయ, అనుబంధ కార్యాలయాలు / సంస్థలు / సంఘాలు కూడా దేశవ్యాప్తంగా, ఒక సారి ఉపయోగించి పారవేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులపై విస్తృతంగా అవగాహన కల్పించే కార్యకలాపాలను చేపట్టాలి.
ఒక సారి ఉపయోగించి పారవేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్ధాలు తీవ్రమైన పర్యావరణ ముప్పుగా పరిణమించాయి. ఈ విధమైన ప్లాస్టిక్ వ్యర్ధాలు నీటి వనరుల ద్వారా సముద్రాల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి సముద్ర పర్యావరణ వ్యవస్థతో పాటు మొత్తం పర్యావరణ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఒక సారి ఉపయోగించి పారవేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వ్యర్ధాల కారణంగా సంభవించే కాలుష్యాన్ని పరిష్కరించడానికి పౌరుల విస్తృత భాగస్వామ్యం ఒక ముఖ్యమైన అంశం.
ప్రవర్తనలో మార్పు, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, విభజన, పునర్వినియోగంతో పాటు, పరిశ్రమలతో నిమగ్నమవ్వడానికి వీలుగా సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపై మంత్రిత్వ శాఖ ఒక వ్యూహాన్ని అవలంబించింది. స్థిరమైన వినియోగం, ఉత్పత్తి అనేవి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఒక సారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, సమర్థవంతమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను పెంపొందించుకోవడంలో ప్రజలందరికీ అవగాహన కల్పించడం అనేది చాలా ఒక ముఖ్యమైన సాధనం.
ఎన్.సి.సి; ఎన్.ఎస్.ఎస్; యువజన క్లబ్బులు, పర్యావరణ-క్లబ్బుల ద్వారా విద్యార్థులు, యువకులు ఒక సారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నివారించడానికి అనువైన పర్యావరణాన్ని నిర్మించడంలో సహాయపడవచ్చు. అదేవిధంగా, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణలో కూడా వారు సహాయపడవచ్చు.
*****
(Release ID: 1760968)
Visitor Counter : 147