ఆర్థిక మంత్రిత్వ శాఖ
మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లలో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
04 OCT 2021 5:33PM by PIB Hyderabad
ముంబై, పూణె, నోయిడా, బెంగళూరు సహా పలు నగరాలలో గల 37 ఆవరణలపై ఆదాయపు పన్ను శాఖ 30.09.2021న సెర్చ్ అండ్ సీజర్ (సోదాలు, స్వాధీనం) ఆపరేషన్లను నిర్వహించింది. శాఖ దాడులు నిర్వహించిన సంస్థలు, వ్యక్తులు కేబుల్ ఉత్పత్తి, రియల్ ఎస్టేట్, జౌళి,, ప్రింటింగ్ యంత్రాంగాలు, హోటళ్ళు, లాజిస్టిక్స్ తదితర వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నారు.
తన సోదా ఆపరేషన్లలో డైరీలు, విడిపత్రాలు, నేరారోపణ చేసే పత్రాలు, ఇమెయిళ్ళు, ఇతర డిజిటల్ ఆధారాలను కనుగొన్నారు- ఇందులో పెద్ద సంఖ్యలో విదేశీ బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులు ఉన్నాయి. అయితే, వీటివేటి గురించీ ఆదాయపు పన్ను శాఖకు వెల్లడించలేదు. ఈ వ్యక్తులు, సంస్థలు లెక్కలలోకి రాని తమ ఆస్తులను దాచుకునేందుకు, యుఎఇ, బివిఐ, జిబ్రాల్టర్, మారిషస్ వంటి పన్ను ఎగవేతకు స్వర్గధామమైన మారిషస్ వంటి దేశాలలో బూటకపు, సంక్లిష్టమైన విదేశీ కంపెనీల జాలం, ట్రస్టులు రూపంలో వీటిని దుబాయ్‌లోని ఆర్ధిక సేవా సంస్థ సేవలను ఉపయోగించుకొని సృష్టించారు. దుబాయ్‌లోని ఆర్ధిక సేవల సంస్థ ద్వారా ఈ గ్రూపులు, వ్యక్తుల బ్యాంకు ఖాతాల విలువ 100 మిలియన్ అమెరికన్ డాలర్ల (దాదాపు 750 కోట్లు) దాటింది. దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి పోగుచేస్తున్న ఈ మొత్తాన్ని స్విట్జర్లాండ్, యుఎఇ, మలేషియా, అనేక ఇతర దేశాలలోని బ్యాంకు అకౌంట్లలో నిర్వహిస్తున్నట్టు కనుగొన్నారు.ఈ సోదాలలో సేకరించిన ఆధారాల ద్వారా ఈ గ్రూపులు విదేశాలలో దాచిన అప్రకటిత నిధులను యుకె, పోర్చుగల్, యుఎఇ తదితర దేశాలలో పని చేయని సంస్థల పేరుతో స్థిరాస్తులను కొనుగోలు చేశారు. ఇందుకు నిధులను విదేశీ బ్యాంక్ అకౌంట్లను పలు పొరల ద్వారా మళ్ళించి, ప్రమోటర్లు వారి కుటుంబ సభ్యులు విదేశాలలో చేసే వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించినట్టుగా చూపుతూ, వాటిని తిరిగి తమ భారతీయ సంస్థలలోకి తిరిగి తీసుకువచ్చారు.
ఈ సోదాలలో నగదును ఉత్పత్తి చేసేందుకు బోగస్ చెల్లింపులకు సంబంధించిన ఆధారాలు, లెక్కల్లోకి రాని నగదు వ్యయం, హవాలా లావాదేవీలు, ఓవర్ ఇన్‌వాయిసింగ్‌లకు సంబంధించిన రుజువులను సేకరించారు. దాదాపు రూ.2 కోట్లకు పైగా లెక్కల్లోకి రాని నగదు, ఆభరణాలను వారి నివాసాలు, వాణిజ్య ఆవరణల నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 50కి పైగా బ్యాంకు లాకర్లను స్తంభింపచేశారు.
****
(Release ID: 1760965)
Visitor Counter : 117