గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

'స్వచ్చత మహానాయకులకు ' సన్మానం


స్వచ్ఛత దినోత్సవం రోజున పారిశుధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

స్వచ్ భారత్ అర్బన్ మిషన్ -2.0 ప్రారంభం

Posted On: 02 OCT 2021 7:02PM by PIB Hyderabad

దేశం వివిధ ప్రాంతాల్లో గాంధీ జయంతి రోజున  స్వచ్ఛ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పారిశుధ్య సిబ్బందిని వివిధ రీతుల్లో సన్మానించారు. ఆజదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు అక్టోబర్ 2,3 తేదీల్లో సఫయ్ మిత్ర సమ్మాన్ అమృత్ సమారోహ్ కార్యక్రమం జరగనున్నది. రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలుస్థానిక సంస్థలలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య సిబ్బందికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతారు. నిన్న (అక్టోబర్ 1న ) ప్రారంభం అయిన స్వచ్చ భారత్ అర్బన్ మిషన్ -అర్బన్ 2.0 దీనికి మరింత ప్రాధాన్యత ఇచ్చింది. 'చెత్త రహిత 'భారతదేశ రూపాకల్పనకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. పారిశుధ్య సిబ్బంది సన్మాన కార్యక్రమాన్ని కేంద్ర గృహ నిర్మాణంపట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హారదీప్ సింగ్ పూరి ప్రారంభించారు. న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్కు లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో పాల్గోవాలని ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. అన్ని రాష్ట్రాలుస్థానిక పట్టణ సంస్థల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఝార్ఖండ్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మధ్యప్రదేశ్  ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని కార్మికులను సన్మానించారు. సిబ్బందికి క్రికెట్ పోటీలను నిర్వహించారు. రాజస్థాన్ లో సిబ్బందికి గౌరవ సూచకంగా 'పగిడీ'లను ప్రధానం చేశారు. భోపాల్ లో జరిగిన కార్యక్రమం లో సిబ్బంది నిర్వహించిన క్రికెట్ పోటీలు ప్రజలను ఆకర్శించాయి. హిమాచల్ ప్రదేశ్ఛత్తీస్ ఘర్ కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సిబ్బందికి నగదు బహుమతులను అందించారు. జమ్మూ కాశ్మీర్హర్యానా తదితర రాష్ట్రాల్లో సిబ్బందికి పనిముట్లుదుస్తులను అందించారు. 

ఈరోజు సాయంకాలం నాటికి దేశంలో 1150 స్థానిక సంస్థల్లో 3.6 లక్షలకు పైగా సిబ్బందికి సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. 

స్వచ్ఛ భారత్ అర్బన్ కార్యక్రమంలో పారిశుధ్య సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభత్వం నిర్ణయించింది. వీరి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలను అమలు చేయడం జరుగుతుంది. పారిశుధ్య సిబ్బందిని 'మహానాయకులు'గా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. అసమానతలను నిర్మూలించడానికి పట్టణ ప్రాంతాలు అభివృద్ధి సాధించాలన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిలుపును గుర్తు చేసిన శ్రీ మోదీ దీనికోసం స్వచ్చ భారత్ మిషన్ 2లో ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు పారిశుధ్య సిబ్బంది తమకు లభించిన గౌరవంతో మరింత సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. 

స్వచ్చ భారత్ మిషన్ తాజా సమాచారాన్ని Facebook Swachh Bharat Mission - Urban Twitter - @SwachhBharatGov ద్వారా పొందవచ్చు. 



(Release ID: 1760748) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi , Tamil