రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

శ్రీలంక‌తో 'మిత్ర శక్తి 21' ఉమ్మడి విన్యాసాల‌లో పాల్గొనేందుకు బయలుదేరిన భార‌త బృందం

Posted On: 02 OCT 2021 11:30AM by PIB Hyderabad

భార‌త, శ్రీ‌లంక  ద్వైపాక్షిక ఉమ్మ‌డి సైనిక విన్యాసం  'మిత్ర శక్తి 21' ఎనిమిదో  ఎడిషన్‌ను  అక్టోబర్ 4 నుండి 15 వరకు.. శ్రీలంకలోని అంపారాలో గ‌ల‌ పోరాట శిక్షణా పాఠశాలలో నిర్వహించనున్నారు. అన్ని ఆయుధాలు ప‌ఠాలాలకు చెందిన 120 మంది భారత సైన్యంతో కూడిన బృందం  శ్రీలంక సైన్యం యొక్క బెటాలియన్‌తో పాటు విన్యాసంలో పాల్గొంటాయి. రెండు దేశాల సైన్యాల మధ్య సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించడం,  ఇంటర్-ఆపరేబిలిటీని మెరుగుపరచడం, తిరుగుబాటు మరియు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ఈ విన్యాసాల‌ యొక్క ముఖ్య‌ ధ్యేయం. ఈ విన్యాసం అంతర్జాతీయ వ్యతిరేక తిరుగుబాటు, తీవ్రవాద వ్యతిరేక వాతావరణంలో ఉప యూనిట్ స్థాయిలో వ్యూహాత్మక స్థాయి కార్యకలాపాలను కలిగి ఉంటుంది.
దక్షిణాసియా దేశాల మధ్య సంబంధాన్ని మరింతగా బలోపేతం చేయడానికి గాను ఈ  విన్యాసాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. క్షేత్రస్థాయిలో క‌లిసి ప‌ని చేయ‌డానికి.. సినర్జీని తీసుకురావ‌డానికి  మరియు సహకారాన్ని పెంపొందించేందుకు  రెండు దేశాల సైన్యాల మధ్య ఇది ఒక  ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. 'మిత్ర శక్తి' ఏడ‌వ ఎడిష‌న్‌ను 2019లో భార‌త్‌లోని పూణే మహారాష్ట్రలో నిర్వ‌హించారు.
                                                                                 

***


(Release ID: 1760495) Visitor Counter : 234