ఆయుష్
పరిశోధనా రంగంలో పరస్పర సహకారానికి సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం, ఆయుర్వేద పరిశోధనా సంస్థల మధ్య కుదిరిన అవగాహన
రెండు సంస్థల మధ్య సహకారం, అవగాహన పెంపొందించే ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రతినిధులు
Posted On:
02 OCT 2021 2:54PM by PIB Hyderabad
గుర్తించిన రంగాలలో పరిశోధనా కార్యక్రమాలను చేపట్టి పరస్పర సహకారం అందించుకోవడానికి సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థల మధ్య అవగాహన కుదిరింది. అవగాహనా ఒప్పందంపై ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఇంచార్జ్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీప్రకాష్, సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం,వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజన్ ఎస్ గ్రేవల్ రెండు సంస్థల తరఫున సంతకాలు చేశారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో గ్యాంగ్ టోక్ లో సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ రిఫరల్ ఆసుపత్రిని ప్రారంభించాలని డాక్టర్ గ్రేవల్ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన డాక్టర్ శ్రీప్రకాష్ ఢిల్లీలో ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పరిశోధనారంగంలో తమ అనుభవాలను రెండు సంస్థలు పంచుకుని శాస్త్రీయ, వైద్య, ఆరోగ్య రంగాలలో పరిశోదనాలను విస్తృతం చేస్తాయి.
విద్యారంగంలో కూడా పరస్పరం సహకరించుకోవడానికి రెండు సంస్థలు అంగీకరించాయి. సదస్సులు, సమావేశాలు, వర్క్ షాపులను కలసి నిర్వహించాలని నిర్ణయించారు. విద్య, పరిశోధనా రంగాలలో పాఠ్యంశాలు, శిక్షణ అంశాలలో కూడా రెండు సంస్థలు సహకరించుకుంటాయి.
కార్యక్రమంలో ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ నుంచి డాక్టర్ రాహుల్ ధనరాజ్ గుసే, డాక్టర్ అశోక్ సిన్హా,సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె ఎస్ షేర్ప, డాక్టర్ రిమోన్ చెట్రి, డాక్టర్ ప్రగ్య కఫ్లే తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1760479)
Visitor Counter : 165