నీతి ఆయోగ్

నీతి ఆయోగ్ ఐఎఫ్‌పిఆర్‌ఐ,ఐఐపీఎస్,యునిసెఫ్‌ మరియు ఐఈజీలతో కలిసి 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ది స్టేట్ న్యూట్రిషన్ ప్రొఫైల్స్' ప్రారంభించింది.

Posted On: 01 OCT 2021 12:12PM by PIB Hyderabad

నీతి ఆయోగ్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఎఫ్‌పిఆర్‌ఐ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్), యునిసెఫ్ మరియు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ (ఐఈజీ) లతో కలిసి సంయుక్తంగా 30 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కోసం 'ది స్టేట్ న్యూట్రిషన్ ప్రొఫైల్స్'ను 30, సెప్టెంబర్, 2021 ప్రారంభించింది. ఐఎఫ్‌పిఆర్‌ఐ నిర్వహించిన "భారతదేశంలో పోషకాహారంపై పురోగతి: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఫేజ్ -1)" అనే వెబ్‌నార్‌లో నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్ రాష్ట్ర పోషకాహార ప్రొఫైల్‌లను విడుదల చేశారు.

'స్టేట్ న్యూట్రిషన్ ప్రొఫైల్స్' (ఎస్‌ఎన్‌పిలు) ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌- 3, 4 మరియు 5 రౌండ్లు ఆధారంగా పోషకాహార ఫలితాలు, తక్షణ మరియు అంతర్లీన నిర్ణయాలు మరియు కార్యక్రమాలపై సవివరమైన జాబితాను ఇస్తాయి. స్టంటింగ్, రక్తహీనత, తక్కువ బరువు మరియు అధిక బరువు మరియు ఎన్‌సిడిలు (డయాబెటిస్ మరియు అధిక రక్తపోటు) వంటి కీలక సూచికల ధోరణి విశ్లేషణ జిల్లాల వ్యాప్తంగా పనితీరు యొక్క వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. దేశంలోని అత్యుత్తమ మరియు అధ్వాన్నమైన జిల్లాలు, అత్యధిక భారం ఉన్న జిల్లాలు మరియు టాప్ కవరేజ్ జిల్లాలను ఈ నివేదికలు హైలైట్ చేస్తాయి. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం ప్రజారోగ్య సమస్యలతో రాష్ట్రంలోని ప్రాధాన్య జిల్లాలు మరియు జిల్లాల సంఖ్యను గుర్తించడంలో సహాయపడే జాబితాను అందించడానికి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ -5 నుండి డేటా ఆధారంగా హెడ్‌కౌంట్-ఆధారిత విశ్లేషణలు మరియు ఎన్‌ఎన్‌పిలు ఆధారపడి ఉంటాయి. ప్రతి ఎస్‌ఎన్‌పి పిల్లలు, మహిళలు మరియు పురుషుల కోసం కీలకమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది మరియు రాష్ట్రం మరింత మెరుగుపడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తుంది.

ఆరోగ్యం మరియు పోషకాహార ఫలితాలు మరియు నిర్ణయాధికారుల ఎన్‌ఎఫ్‌హెచ్‌-5 విశ్లేషణపై ప్రముఖ వక్తలు (దివ్య నాయర్, ఐడిన్‌సైట్; దివిజ్ సిన్హా, ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్; షీలా వీర్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ మరియు రస్మి అవుల,ఐఎఫ్‌పిఆర్‌ఐ; ఎస్‌.కె. సింగ్, ఐఐపీఎస్‌; రాబర్ట్ జాన్స్టన్, యునిసెఫ్; విలియం జో, ఐఈజీ) భాగస్వామి సంస్థల నుండి ప్రదర్శన అందించారు . ఈ వెబ్‌నార్‌లో వివిధ సంస్థల నుండి 200 మందికి పైగా పాల్గొన్నారు.ఎస్‌ఎన్‌పిలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి:

http://poshan.ifpri.info/category/publications/data-notes/

***



(Release ID: 1760112) Visitor Counter : 249