ప్రధాన మంత్రి కార్యాలయం
స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 నుప్రారంభించిన ప్రధాన మంత్రి
‘‘ ‘స్వచ్ఛ్భారత్ మిశన్-అర్బన్ 2.0’ లక్ష్యమల్లానగరాల ను చెత్త చెదారానికి ఎంత మాత్రం తావు లేనటువంటివి గా తీర్చిదిద్దడమే’’
‘‘మిశన్ అమృత్ తదుపరి దశ లో దేశం నిర్దేశించుకొన్నలక్ష్యాలు ఏవేవంటే.. మన నగరాల ను జల సురక్షత కలిగిన నగరాలు గా తీర్చిదిద్దడం, సీవేజి & సెప్టిక్ మేనేజ్ మెంట్ ను మెరుగు పరచడం, మన నదుల లో ఎక్కడా కూడామురుగునీటి కాలువ లు కలవకుండా చూడటమూను’’
‘‘స్వచ్ఛ్ భారత్ అభియాన్, ఇంకా అమృత్ మిశన్ ల ప్రస్థానం లో ఒక మిశన్ అంటూ ఉంది; దేశంపట్ల గౌరవం, మర్యాద, ఆకాంక్ష నిండివున్నాయి; అంతేకాక, మాతృ భూమిఅంటే సాటిలేనటువంటి ప్రేమ కూడా ఉంది’’
‘‘అసమానత ల తొలగింపున కు ఒక గొప్ప సాధనం పట్టణ ప్రాంతాలఅభివృద్ధి అని నమ్మిన బాబా సాహెబ్ ఆమ్బేడ్ కర్.. స్వచ్ఛ్ భారత్ మిశన్, మిశన్ అమృత్ ల తదుపరి దశ లు బాబా సాహెబ్ కలల నునెరవేర్చే దిశ లో ఒక ముఖ్యమైన అడుగు’’
‘‘స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి విషయం లోను, ప్రతి రోజూ, ప్రతి పక్షమూ, ప్రతి సంవత్సరమూ, తరాలతరబడి కొనసాగవలసిన అటువంటి ఒక మహత్తర ప్రచార ఉద్యమంగా ఉంది; స్వచ్ఛత అనేది ఒక జీవన శైలి, అది ఒక జీవన మంత్రం’’
‘‘2014వ సంవత్సరం లో 20 శాత
Posted On:
01 OCT 2021 1:28PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, అటల్ మిశన్ ఫర్ రిజూవినేశన్ ఎండ్ అర్బన్ ట్రేన్స్‌ఫర్ మేశన్ 2.0 (ఎఎమ్ఆర్ యుటి.. ‘అమృత్’) ను ప్రారంభించారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ ప్రహ్ లాద్ సింహ్ పటేల్, శ్రీ కౌశల్ కిశోర్, శ్రీ శ్రీ బిశ్వేశ్వర్ టుడూ, రాష్ట్రాల మంత్రులు, మేయర్ లు, పట్టణ, స్థానిక సంస్థ ల చైర్ పర్సన్ లు, మ్యూనిసిపల్ కమిశనర్ లు పాలుపంచుకొన్నారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 2014వ సంవత్సరం లో దేశ ప్రజలు భారతదేశాన్ని బహిరంగ ప్రదేశాల లో మల మూత్రాదుల విసర్జన కు తావు లేనటువంటిది (ఒడిఎఫ్) గా ఆవిష్కరించడం కోసం ప్రతిన పూనారు, మరి వారు 10 కోట్ల కు పైగా టాయిలెట్ ల నిర్మాణం ద్వారా ఈ ప్రతిజ్ఞ ను నెరవేర్చారు అని పేర్కొన్నారు. ఇక ‘స్వచ్చ్ భారత్ మిశన్-అర్బన్-2.0’ లక్ష్యమల్లా నగరాల ను చెత్త కు ఎంతమాత్రం తావు ఉండనటువంటివి గా తీర్చిదిద్దడమే అని ఆయన చెప్పారు. ‘సీవేజీ మరియు సెప్టిక్ మేనేజ్ మెంట్ లో సంస్కరణ, మన నగరాల ను జల సురక్షత కలిగినవి గా తీర్చిదిద్దడం తో పాటు మన నదుల లో ఎక్కడా కూడాను మురుగు కాలువలు కలవకుండా చూడటం’ అనేవి మిశన్ అమృత్ తదుపరి దశ లో దేశం నిర్దేశించుకొన్న లక్ష్యాలుగా ఉన్నాయి అని ప్రధాన మంత్రి వివరించారు.
పట్టణ ప్రాంతాల ఉత్థానం, స్వచ్ఛత తో ముడిపడ్డ మార్పు తాలూకు సాఫల్యాల ను మహాత్మ గాంధీ కి ప్రధాన మంత్రి అంకితం చేశారు. ఈ మిశన్ లన్నీ మహాత్మ గాంధీ ఇచ్చిన ప్రేరణ వల్ల ఒనగూరిన ఫలితాలు, మరి ఆయన ఆదర్శాల ను అనుసరించడం ద్వారానే అవి కార్యరూపం దాల్చుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. టాయిలెట్ ల నిర్మాణం తో మాతృమూర్తుల, కుమార్తెల జీవనం మెరుగుపడిందని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు.
దేశ ప్రజల ఉత్సాహాని కి ప్రధాన మంత్రి వందనాన్ని ఆచరిస్తూ, ఇంతవరకు సాగిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ మరియు అమృత్ మిశన్ ల ప్రస్థానం దేశం లో ప్రతి ఒక్కరు గర్వపడే విధం గా ఉంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘దీనిలో ఒక మిశన్ అంటూ ఉంది, దీనిలో గౌరవం, మర్యాద ఉన్నాయి. దీనిలో ఒక దేశం ఆకాంక్ష కూడా ఇమిడి ఉంది. అంతేకాదు, మాతృభూమి పట్ల సాటి లేనంతటి ప్రేమ కూడా ఉంది.’’ అని ఆయన చెప్తూ, ప్రజల మనోభావాల కు వాగ్రూపాన్ని ఇచ్చారు.
ఈ రోజు చేపట్టిన కార్యక్రమం ఆమ్బేడ్ కర్ ఇంటర్ నేశనల్ సెంటర్ లో జరుగుతున్నదని ప్రధాన మంత్రి పేర్కొంటూ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి అనేది అసమానతల ను తొలగించడానికి ఒక గొప్ప సాధనం అని బాబా సాహెబ్ నమ్మారు అని చెప్పారు. గ్రామాల లో ఉండే ప్రజలు అనేక మంది మెరుగైనటువంటి జీవనాన్ని ఆకాంక్షిస్తూ నగరాల కు విచ్చేస్తారని ఆయన అన్నారు. వారు ఉపాధి దొరుకుతుంది కానీ వారి జీవన స్థాయి పల్లెల లో కంటే మరింత కష్టమైంది గా ఉంటోందన్న సంగతి ని మనం ఎరుగుదుము అని ఆయన అన్నారు. ఇది వారిని రెండిందాలు గా దెబ్బ తీసేది గా ఉంటుంది, ఒకటేమో వారు స్వస్థలానికి దూరం గా బతకవలసి రావడం, మీదు మిక్కిలి గా ఇటువంటి స్థితిలో ఉండడం అని ఆయన అన్నారు. ఈ స్థితిగతులను మార్చడం పైన, ఈ అసమానత్వాన్ని దూరం చేయఃడం పైన శ్రద్ధ తీసుకోవాలని బాబా సాహెబ్ నొక్కి చెప్పారు అని ప్రధాన మంత్రి అన్నారు. స్వచ్ఛ్ భారత్ మిశన్, మిశన్ అమృత్ తదుపరి దశ లు బాబా సాహెబ్ కన్న కలల ను పండించే దిశ లో ఒక ముఖ్యమైన అడుగు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
స్వచ్ఛత తాలూకు ప్రచార ఉద్యమం ఆశించిన ఫలితాల ను ఇవ్వాలి అంటే గనక ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ లతో పాటు సబ్ కా ప్రయాస్’ కూడా కీలకం అని ప్రధాన మంత్రి అన్నారు. దీనికి తోడు స్వచ్ఛత కు సంబంధించినంత వరకు ప్రజల ప్రాతినిధ్యం స్థాయి ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ప్రస్తుత తరం స్వచ్ఛత ప్రచార ఉద్యమాన్ని బలపరచే బాధ్యత ను తీసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. టాఫీ రేపర్ లను పిల్లలు ఇప్పుడు నేల మీద పారేసేవేయకుండా వారి జేబు లో పెట్టుకొంటున్నారు. వారు తగని పని చేయకండంటూ పెద్దల కు బుద్ధులు చెప్తున్నారు కూడా అని ఆయన అన్నారు. ‘‘స్వచ్ఛత అనేది ఏ ఒక్క రోజు కో, ఒక పక్షం రోజులకో, ఒక సంవత్సరానికో, లేదా కొద్ది మందే చేయవలసిందో కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి ప్రచార ఉద్యమం, ప్రతి రోజూ, ప్రతి పక్షం రోజుల పాటు, ప్రతి సంవత్సరం పొడవునా, తరం తరువాత తరం వారీ గా అనుసరించవలసినటువంటి మహా ప్రచార ఉద్యమం. స్వచ్ఛత ఒక జీవనశైలి. స్వచ్ఛత అనేది జీవన మంత్రం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి గా తాను ఆ రాష్ట్రం లో పర్యటన అవకాశాల ను పెంపొందింప చేయడం కోసం చేసిన కృషి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొంటూ, స్వచ్ఛత కోసం సాగిన అన్వేషణ ను నిర్మల్ గుజరాత్ కార్యక్రమం ద్వారా ఒక ప్రజా ఉద్యమం గా మార్చివేసినట్లు తెలియ జేశారు.
స్వచ్ఛత తాలూకు ప్రచార ఉద్యమాన్ని తదుపరి స్థాయి కి తీసుకు పోవడం కోసం తీసుకున్న చర్యల ను ప్రధాన మంత్రి ఒక్కటొక్కటిగా వివరిస్తూ, భారతదేశం ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు గా ఒక లక్ష టన్నుల వ్యర్థాల ను శుద్ధి చేస్తోందని, ‘2014వ సంవత్సరం లో దేశం ఈ ప్రచార ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు నిత్యం పోగయ్యే వ్యర్థాల లో 20 శాతం కన్నా తక్కువ వ్యర్థ పదార్థాల ను శుద్ధిపరచడం జరిగింది. ప్రస్తుతం రోజువారీ వ్యర్థ పదార్థాల లో దాదాపుగా 70 శాతం వ్యర్థాల ను శుద్ధి పరచడం జరుగుతోంది. మరి దీనిని 100 శాతానికి చేర్చవలసి ఉంది’ అని ఆయన తెలిపారు. పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు కేటాయింపుల ను పెంచడాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. 2014వ సంవత్సరానికి పూర్వం 7 సంవత్సరాల కాలం లో ఆ మంత్రిత్వ శాఖ కు సుమారుగా 1.25 లక్షల కోట్ల రూపాయలను ఇవ్వడం జరుగగా, 2014వ సంవత్సరం తరువాత ఏడేళ్ళ లో సదరు మంత్రిత్వ శాఖ కు దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడమైంది అని ఆయన వెల్లడించారు.
దేశం లో నగరాల అభివృద్ధి కి గాను ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడం అనేది కూడా ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఇటీవలే ప్రవేశపెట్టిన నేశనల్ ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలిసి ని గురించి ప్రస్తావించి, ఈ కొత్త విధానం ‘వ్యర్థం నుంచి సంపద’ అనే ప్రచార ఉద్యమాన్ని, ఒక సర్క్యులర్ ఇకానమి ని పటిష్ట పరుస్తుందని పేర్కొన్నారు.
వీధి వీధి కీ తిరుగుతూ సరుకుల ను అమ్మే వ్యాపారులు పట్టణాభివృద్ధి కి సంబంధించిన కార్యక్రమాల అమలు లో అత్యంత ముఖ్య భాగస్వాముల లో ఒకరు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ వీధి విక్రేతల కు ‘పిఎం స్వనిధి యోజన’ ఒక కొత్త ఆశాకిరణం గా మారింది అని ఆయన అన్నారు. స్వనిధి పథకం లో భాగం గా ఎంతో మంది వీధి విక్రేత లు ప్రయోజనాల ను అందుకొన్నారని, 25 లక్షల మంది కి 2,500 కోట్ల రూపాయల సొమ్ము అందిందని ఆయన తెలిపారు. ఈ వ్యాపారులు డిజిటల్ ట్రాన్సాక్శన్స్ ను పెంచుతున్నారు, వీరు తాము తీసుకొన్న రుణాల ను తిరిగి చెల్లించడం లో చాలా చక్కని రికార్డు ను నమోదు చేస్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలుపరచడం లో అగ్రభాగాన నిలుస్తున్నాయి అని చెప్తూ ఈ పరిణామం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
***
DS/AK
(Release ID: 1760090)
Visitor Counter : 234
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam