మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
5వ తూర్పు ఆసియా దేశాల విద్యా మంత్రుల సమావేశంలో ప్రసంగించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి
- '21వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేర్చడానికి భారతదేశం ప్రపంచ సామర్థ్యాలను నిర్మిస్తోంది': శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
01 OCT 2021 4:31PM by PIB Hyderabad
'21 వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేర్చడానికి భారతదేశం ప్రపంచ సామర్థ్యాలను నిర్మిస్తోంది 'అని కేంద్ర విద్య మరియు నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 5వ తూర్పు ఆసియా దేశాల(ఈఏఎస్) విద్యా శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్‌కుమార్ రంజన్ సింగ్, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీ ప్రధాన్.. మనీలా కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న పరిపూరకాలతో సమకాలీకరించడంలో దీర్ఘకాలికమైన, పరస్పర ప్రయోజనకరమైన విద్యా సహకారాన్ని పెంపొందించడంలో భారతదేశం నిబద్ధతను పునరుద్ఘాటించారు. భారత విద్యావిధనం యెక్క లక్ష్యాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. విద్య యొక్క సార్వత్రికీకరణ, సమానత్వం, నాణ్యత, స్థోమత మరియు వశ్యత, సాంకేతికత ఆధారిత అభ్యాసనం మరియు విద్యపై మనీలా కార్యాచరణ ప్రణాళిక సూత్రాలను పాటించే అనేక ఇతర అంశాలతో సహా భారత జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలను ఈ సందర్భంగా మంత్రి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రధాన్ మల్టీ-మోడల్ డిజిటల్ అంశాలను గురించి వివరించారు. మహమ్మారి విస్తరించి ఉన్న సమయంలోనూ ప్రభుత్వం చేపట్టిన పీఎం-ఈవిద్యా, స్వయం, దీక్ష, మొదలైనవి విద్యార్థులు నేర్చుకునే ప్రక్రియను నిర్ధారించేలా దోహదం చేశాయని అన్నారు. డిమాండ్ మేరకు నేర్చుకోవడాన్ని సులభతరం చేయడానికి, డిజిటల్ తారతమ్యతను రూపుమాపేలా ఒక వంతెనెలా పని చేయడానికి తాము ఏర్పాటు చేసిన డిజిటల్ మౌలిక వసతులు పెంచడం ఇవి ఎంతగానో దోహదం చేసినట్టుగా మంత్రి తెలిపారు. దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టి కోణం అనుగుణంగా, విద్య మరియు నైపుణ్యాలను మరింత కలుపుకొని, సరసమైన, సమానమైన, శక్తివంతమైన మరియు ఆకాంక్షను కలిగించడానికి గాను అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడానికి విద్యార్ధి మరియు విద్యాసంబంధ మార్పిడిని ప్రోత్సహించడం, టీవీఈటీతో సహా పరిశోధన మరియు విద్యా సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం యొక్క మద్దతును మంత్రి శ్రీ ప్రధాన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.


*****
(Release ID: 1760086)