పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ బన్సాల్
प्रविष्टि तिथि:
01 OCT 2021 2:39PM by PIB Hyderabad
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి వప్రదీప్ సింగ్ ఖరోలా ఐఎఎస్ (కెఎన్ః85) పదవీకాలం 30 సెప్టెంబర్ 2021న పూర్తి కావడంతో ఆయన స్థానంలో రాజీవ్ బన్సాల్ ఐఎఎస్ (ఎన్ఎల్88) బాధ్యతలను స్వీకరించారు.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల అధికారి అయిన బన్సాల్ 1988 బ్యాచ్ కు చెందిన నాగాలాండ్ కేడర్ అధికారి. కేంద్ర ప్రభుత్వంలో ఆయన పౌర విమానయాన శాఖ పరిధిలోని ఎయిర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, పెట్రోలియం & సహజవాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సంయుక్త కార్యదర్శిగా, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సిఇఆర్‌సి) కార్యదర్శిగా, భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి సహా వివిధ కీలక పదవీ బాధ్యతలను నిర్వహించారు. నాగాలాండ్ ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ & కార్యదర్శిగా, పాఠశాల విద్య శాఖ కమిషనర్ & కార్యదర్శిగా, ఆర్ధిక శాఖ కమిషనర్ & కార్యదర్శి వంటి కీలక బాధ్యతలను నిర్వహించారు.
***
(रिलीज़ आईडी: 1760080)
आगंतुक पटल : 194