ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

88 కోట్ల డోసుల మైలురాయిని దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 65.34 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

97.85 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి తర్వాత గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 23,529 కొత్త కేసులు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (2,77,020) 0.82 శాతం

వారపు పాజిటివిటీ రేటు (1.74 శాతం) గత 97 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 30 SEP 2021 9:42AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 88 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 65,34,306 డోసులతో కలిపి, మొత్తంగా 88 కోట్ల డోసులను (88,34,70,578) టీకా కార్యక్రమం అధిగమించింది. 85,92,824 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,72,470

రెండో డోసు

88,82,131

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,52,116

రెండో డోసు

1,49,71,767

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

35,78,56,886

రెండో డోసు

8,10,29,611

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

15,88,81,646

రెండో డోసు

7,62,14,993

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,10,10,623

రెండో డోసు

5,58,98,335

మొత్తం

88,34,70,578

 

గత 24 గంటల్లో 28,718 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,30,14,898 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.85 శాతానికి చేరింది. 2020 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 95వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 23,529 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,77,020. ఇది 195 రోజుల కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.82 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 15,06,25 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 56.89 కోట్లకుపైగా (56,89,56,439) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.74 శాతంగా ఉంది. గత 97 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 31 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 114 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****


(Release ID: 1759671) Visitor Counter : 214