ఆర్థిక మంత్రిత్వ శాఖ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధీకృత శాఖలలో ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం
Posted On:
29 SEP 2021 5:17PM by PIB Hyderabad
'ఎలక్టోరల్ బాండ్ పథకం 2018'ను భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ సంఖ్య-20 రూపంలో 02 జనవరి 2018వ తేదీన నోటిఫై చేసింది. ఈ పథకం నిబంధనల ప్రకారం ఎలక్టోరల్ బాండ్లను వ్యక్తులు కొనుగోలు చేయవచ్చు (గెజిట్ నోటిఫికేషన్ యొక్క ఐటమ్ నం 2 (డి) లో నిర్వచించిన విధంగా). భారత దేశ పౌరుడు లేదా భారత దేశంలో విలీనం చేసిన లేదా స్థాపించబడిన ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఎలక్టోరల్ బాండ్లను వ్యక్తిగతంగా కానీ లేదా ఇతర వ్యక్తులతో కలిసి కొనుగోలు చేయవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 (1951 లో 43) సెక్షన్ -29వి కింద నమోదు చేయబడిన రాజకీయ పార్టీలు మరియు గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల లేదా శాసనసభకు పోలైన ఓట్లలో ఒకశాతం కంటే తక్కువ కాకుండా ఓట్లను సాధించిన పార్టీలు ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించడానికి అర్హులు. ఎలక్టోరల్ బాండ్‌లు అర్హత కలిగిన రాజకీయ పార్టీ ద్వారా అధీకృత బ్యాంకులో ఉన్న బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే క్యాష్ చేయబడతాయి. XVIII అమ్మకపు దశలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన 29 అధీకృత శాఖల ద్వారా (అనుబంధ జాబితా ప్రకారం) 01.10.2021వ తేదీ నుండి 10.10.2021 వరకు.ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి మరియు ఎన్‌కాష్ చేయడానికి అధికారం పొందింది. ఎలక్టోరల్ బాండ్‌లు జారీ చేసిన తేదీ నుండి పదిహేను క్యాలెండర్ రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ డిపాజిట్ చేయబడితే సదరు రాజకీయ పార్టీకి ఎలాంటి సొమ్ము చెల్లించబడదు. అర్హత కలిగిన రాజకీయ పార్టీ తన ఖాతాలో జమ చేసిన ఎలక్టోరల్ బాండ్ అదే రోజున జమ చేయబడుతాయి.
***
(Release ID: 1759507)
Visitor Counter : 186