వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఇనీశియల్పబ్లిక్ ఆఫర్ మాధ్యమం ద్వారా ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేశన్ లిమిటెడ్ను స్టాక్ ఎక్చేంజ్ లో నమోదు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 29 SEP 2021 3:57PM by PIB Hyderabad

నమోదు కానటువంటి సిపిఎస్ఇ గా ఉన్న మెసర్స్ ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేశన్ లిమిటెడ్ (ఇసిజిసి) సెబి యొక్క (మూలధనం జారీ మరియు వెల్లడి ఆవశ్యకతలు సంబంధి) నిబంధన లు, 2018 పరిధి లో ఇనీశియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) మాధ్యమం ద్వారా స్టాక్ ఎక్చేంజ్ లో నమోదు చేయడానికి గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది.

ఎగుమతుల కు క్రెడిట్ రిస్క్ ఇన్ శువరన్స్ మరియు సంబంధి సేవల ను అందించి ఎగుమతుల యొక్క పోటీతత్వాన్ని మెరుగు పరచాలి అనే ఉద్దేశ్యం తో ఏర్పాటు చేసిన ఇసిజిసి లిమిటెడ్ భారత ప్రభుత్వ సంపూర్ణ యాజమాన్యం లో ఉన్నటువంటి ఒక సిపిఎస్ఇ . ఈ కంపెనీ తన మేక్సిమమ్ లయబిలిటీస్ (ఎమ్ఎల్) ను ఇప్పుడున్న 1.0 లక్ష కోట్ల రూపాయల స్థాయి నుంచి పెంచుకొని, 2025-26 కల్లా 2.03 లక్షల కోట్ల రూపాయలు గా చేసుకోవాలని లక్ష్యం గా పెట్టుకొన్నది.

ఇసిజిసి లిమిటెడ్ (స్టాక్ ఎక్చేంజ్ లో) నమోదు కావడం వల్ల, కంపెనీ తాలూకు వాస్తవిక విలువ వెలుగు లోకి వస్తుంది. అంతేకాకుండా, కంపెనీ యొక్క ఎక్విటి హోల్డింగ్ లో సార్వజనిక భాగస్వామ్యానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం వల్ల మంది కి యజమానత్వాన్ని కట్టబెట్టేందుకు కూడా ఊతం లభిస్తుంది. అలాగే పారదర్శకత్వం, జవాబుదారుతనం మరింత గా పెరగడం వల్ల కార్పరిట్ గవర్నన్స్ ను సైతం ప్రోత్సహించినట్లు అవుతుంది.

లిస్టింగ్ ప్రక్రియ తో ఇసిజిసి కి మార్కెటు నుంచి, లేదా అదే ఐపిఒ మాధ్యమం ద్వారా, లేదా అటు తరువాత ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్ పిఒ) మాధ్యమం ద్వారా తాజా గా మూలధనాన్ని పోగేసుకోవడానికి మార్గం సుగమం అయ్యే ఆస్కారం ఉంది. తత్ఫలితం గా మేక్సిమమ్ లయబిలిటీ ని పెంచుకోవడం లో కూడాను కంపెనీ కి తోడ్పాటు అందగలదు.

డిసిన్వెస్ట్ మెంట్ వల్ల ప్రాప్తించే రాశి ని సామాజిక రంగం లోని పథకాల కు ఆర్థిక సహాయం చేయడం కోసం వినియోగించడం జరుగుతుంది.

 

 

***(Release ID: 1759394) Visitor Counter : 46