మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

కుక్కల వల్ల వచ్చే రేబిస్ నిర్మూలన కోసం 2030 నాటికి జాతీయ కార్యాచరణ ప్రణాళిక


ప్రపంచ రేబిస్ దినోత్సవం రోజున ఎన్ఏపిఆర్ఈ ప్రారంభించిన శ్రీ మన్సుఖ్ మాండవియా, శ్రీ పర్శోత్తం రూపాల

"రాబిస్ వంటి జూనోటిక్ వ్యాధులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి": శ్రీ మాండవ్య

"హడక్వా (రాబిస్) గురించి ప్రస్తావిస్తే చాలు గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనలు రేగుతాయి. రేబిస్ నిర్ములనకు జరిగే గొప్ప ప్రయత్నంలో వారు ప్రభుత్వానికి చురుకుగా సహాయం చేస్తారు ": శ్రీ రూపాల

Posted On: 28 SEP 2021 4:45PM by PIB Hyderabad

నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా,  2030 కల్లా రేబిస్ నిర్ములించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ మరియు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాల సమక్షంలో జాతీయ కార్యాచరణ ప్రణాళిక  (ఎన్ఏపిఆర్ఈ) ను ఆవిష్కరించారు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి   డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్,  మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ సహాయ మంత్రి. శ్రీ సంజీవ్ కుమార్ బాల్యన్ పాల్గొన్నారు. 

రాబిస్‌ను గుర్తించదగిన వ్యాధిగా మార్చాలని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను మంత్రులు కోరారు. శ్రీ మన్సుఖ్ మాండవియా మరియు శ్రీ పరశోత్తం రూపాల కూడా 2030 నాటికి వన్ హెల్త్ అప్రోచ్ ద్వారా ఇండియా నుండి డాగ్ మెడియేటెడ్ రేబిస్ నిర్మూలన కోసం "జాయింట్ ఇంటర్-మినిస్టీరియల్ డిక్లరేషన్ సపోర్ట్ స్టేట్‌మెంట్" ను ప్రారంభించారు.

 

 

 

 

 

The event was webcast at:
https://youtu.be/ug64i6MoNfE

****



(Release ID: 1759117) Visitor Counter : 179