సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

వృద్ధుల కోసం దేశంలోని మొదటి దేశవ్యాప్త హెల్ప్‌లైన్.. ఎల్డర్ లైన్ (టోల్ ఫ్రీ నం- 14567) అందుబాటులోకి

Posted On: 28 SEP 2021 1:57PM by PIB Hyderabad

భారతదేశంలో 2050 నాటికి జనాభాలో దాదాపు 20% వృద్ధులు, అంటే 30 కోట్ల మందికిపైగా సీనియర్ సిటిజన్లు ఉంటారని అంచనా. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే చాలా దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. ఈ వయస్సువర్గం వివిధ మానసిక, భావోద్వేగ, ఆర్థిక, చట్టపరమైన , శారీరక సవాళ్లను ఎదుర్కొంటుంది. మహమ్మారి దానిని మరింత తీవ్రతరం చేసింది.  మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వయస్సువాళ్ల ఆర్థిక, సామాజిక జ్ఞానం వనరులను దేశం ఉపయోగించుకోవచ్చు. దేశంలో వృద్ధులకు మద్దతు ఇవ్వడానికి పెరుగుతున్న అవసరాన్ని గుర్తించి, వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు , సమస్యలను పరిష్కరించడానికి  కేంద్రం ఒక గొప్ప అడుగు వేసింది, దేశంలోని మొదటిసారి జాతీయస్థాయిలో టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్...-14567-(ఎల్డర్ లైన్)ను అందుబాటులోకి తెచ్చింది. పెన్షన్, చట్టపరమైన ఇబ్బందులను పరిష్కరించడం, భావోద్వేగపరమైన మద్దతును అందించడం, వారు మోసపోయిన కేసుల్లో జోక్యం చేసుకోవడం , నిరాశ్రయులైన వృద్ధులను రక్షించడం వంటి విషయాలకు సంబంధించిన ఉచిత సమాచారం , మార్గదర్శకాలను అందిస్తుంది.

 

'ఎల్డర్ లైన్'  ఉద్దేశ్యం సీనియర్ సిటిజన్లకు లేదా వారి శ్రేయోభిలాషులకు, దేశవ్యాప్తంగా ఒక వేదికను అందించడం, వారి ఆందోళనలను పంచుకోవడం, రోజువారీగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాచారం , మార్గదర్శకత్వాన్ని సులువుగా అందించడం.

ఉదాహరణకు, కాల్ చేసిన వారిలో ఒకరు పార్కిన్సన్‌తో బాధపడే తన అత్త కోసం ఆసుపత్రి కోసం చూస్తున్నాడు.  ఆరోగ్య సమస్యలతో ఆవిడ మంచం పట్టారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఐసీయూలోని కోవిడ్ వార్డుకు మార్చవలసి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత, ఆమె పాజిటివే అయినప్పటికీ ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని ఆసుపత్రి పట్టుబట్టింది. దీనిని అర్థం చేసుకోలేకపోయిన బాధితుడు సాయం కోసం ఎల్డర్ లైన్‌ను సంప్రదించాడు. ఎల్డర్ లైన్ బృందం వెంటనే ఒక ప్రైవేట్ హోటల్ హోటల్‌తో మాట్లాడి, ఆమెను తాత్కాలికంగా అక్కడికి పంపించింది.

ఎల్డర్ లైన్  భారతదేశంలోని పురాతన దాతృత్వ సంస్థ అయిన టాటా ట్రస్టు, దాని భాగస్వామి అయిన విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ చొరవ  2017 లో హైదరాబాద్‌లో మొదలయింది. ప్రభుత్వ సహకారంతో నగరంలోని వృద్ధులకు ఇది సహాయం చేస్తుంది. టాటా ట్రస్టులు వ్యూహాత్మక దాతృత్వాన్ని కొనసాగిస్తున్నాయి.  జాతీయ ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై మన స్థాయి , జోక్యం ద్వారా లక్షలాది మంది జీవితాలలో లోతైన, విశాలమైన , తిరుగులేని ప్రభావాన్ని సృష్టించాయి.

  టాటా ట్రస్ట్‌లు , ఎన్ఎస్ఇ ఫౌండేషన్, సాంకేతిక భాగస్వాములుగా, ఎల్డర్ లైన్ నిర్వహణలో మంత్రిత్వ శాఖకు సంయుక్తంగా మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటి వరకు, 17 రాష్ట్రాలు ఇప్పటికే తమ ప్రాంతాల్లో ఎల్డర్ లైన్‌ను తెరిచాయి. ఇతర రాష్ట్రాలు కూడా తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి. గత 4 నెలల్లోనే ఈ హెల్ప్లైన్కు 2 లక్షలకు పైగా కాల్‌లు వచ్చాయి. దాదాపు 30,000 మందికి పైగా సీనియర్‌ సిటిజన్లకు ఇప్పటికే సాయం చేశారు. వీటిలో దాదాపు 40% కాల్స్ వ్యాక్సిన్‌లో అవసరమైన మార్గదర్శకత్వం , దానికి సంబంధించిన ప్రశ్నలకు సంబంధించినవి, దాదాపు 23% కాల్‌లు పెన్షన్‌కు సంబంధించినవి.మరో ఉదాహరణ ఏమిటంటే.. ఒక కాలర్ పింఛను పొందలేకపోయాడు. అతను ఎల్డర్ లైన్ బృందం నుండి మద్దతు కోరాడు. బృందం సంబంధిత పెన్షన్ ఆఫీసర్‌ని సంప్రదించి, రాష్ట్రం , కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న అన్ని ఆన్లైన్ సదుపాయాలను పరిశీలించింది. పెన్షన్ వెంటనే సీనియర్ సిటిజన్ ఖాతాలోకి బదిలీ అయింది. ఎల్డర్ లైన్  ద్వారా లక్షలాది మంది ఇటువంటి సంఘటనల గురించి ఫిర్యాదు చేయవచ్చు. వృద్ధుల మద్దతును పొందవచ్చు . అందుకే ‘ఎల్డర్ లైన్: 14567’  రాబోయే కాలంలో గొప్ప సేవగా అవతరిస్తుంది.

***(Release ID: 1759107) Visitor Counter : 325