రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో సువర్ణముఖినది ఆకస్మిక వరదల్లో రాత్రి సమయంలో భారత నావికాదళ హెలికాప్టర్ తరలింపులు

Posted On: 28 SEP 2021 1:41PM by PIB Hyderabad

ఆకస్మిక వరదల కారణంగా సువర్ణముఖి నదిలో చిక్కుకున్న గ్రామస్తున్ని రక్షించేందుకు సోమవారం సాయంత్రం 5:30 గంటలకు రాష్ట్ర పరిపాలన అధికారుల నుండి ఎస్‌ఓఎస్‌ అభ్యర్థన అందింది. దీంతో బాధితుడి శోధన మరియు రక్షణ (ఎస్‌ఎఆర్‌) కోసం నావికాదళ హెలికాప్టర్ అందించడానికి ఈస్టర్న్ నేవల్ కమాండ్ వెంటనే మిషన్ కోసం ఐఎన్‌ఎస్‌ డెగా నుండి అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్‌) ని మోహరించింది. నివేదించబడిన ప్రదేశానికి చేరుకున్న తర్వాత (డేగా నుండి సుమారు 120 కిమీ) తీవ్రమైన వాతావరణం, భారీ వర్షం మరియు చీకటి పరిస్థితుల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ గ్రామస్తుడిని గుర్తించలేకపోయింది.

   తదనంతరం రాత్రి 11 గంటల సమయంలో రెస్క్యూ మిషన్ చేపట్టడానికి తగిన నైట్ విజన్ పరికరాలతో కూడిన సీకింగ్ 42సి  హెలికాప్టర్ బయల్దేరింది. ఇలాంటి వర్షపు వాతావరణం మరియు బలమైన గాలులు ఉన్నప్పటికీ సీకింగ్ హెలికాప్టర్ శోధన చేపట్టి బాధితుడిని ప్రాణాలతో బయటకు తీసుకువచ్చింది. హెలికాప్టర్ సువర్ణముఖి నదిలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ బాధితుడిని రక్షించగలిగింది. అనంతరం ఎయిర్‌క్రాఫ్ట్‌ ఐఎన్‌ఎస్‌ డేగాకు తిరిగి వచ్చింది. బాధితుడికి అందులోనే ప్రాథమిక చికిత్స అందించబడింది. అనంతరం వారిని తదుపరి వైద్య చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. నావల్ ఎయిర్ స్టేషన్ ద్వారా అతని కుటుంబ సభ్యులకు అతని శ్రేయస్సు గురించి సమాచారం అందించబడింది.

   ప్రాణాలతో బయటపడిన శ్రీ డి సింహాచలం, విజయనగరం జిల్లాలోని వెంకటభైరవపాలెం గ్రామానికి చెందిన సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. రాత్రి సమయంలో సకాలంలో సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

 

***



(Release ID: 1758990) Visitor Counter : 184


Read this release in: English , Urdu , Hindi , Tamil