ఆర్థిక మంత్రిత్వ శాఖ

మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 27 SEP 2021 2:33PM by PIB Hyderabad

మహారాష్ట్రలో జల్నా ప్రాంతంలో ఉన్న నాలుగు ప్రధాన స్టీల్ రోలింగ్ మిల్లులను క‌లిగి ఉన్న ఒక  గ్రూపు లావాదేవీల‌కు విష‌య‌మై  ఆదాయ‌పు ప‌న్ను శాఖ 23.09.2021న సోదాలు, జ‌ప్తు కార్య‌క్ర‌మాల‌ను నిర్వహించింది. ఆయా  కంపెనీలు వ్య‌ర్థ ఉక్కును త‌మ  ముడిసరుకుగా ఉపయోగించే స్టీల్ టీఎంటీ బారులు, బిల్లెట్ల తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాయి. జల్నా, ఔరంగాబాద్, పుణే, ముంబ‌యి మరియు కోల్‌కతాల‌లోని మొత్తం 32కు పైగా ప్రాంగణాలలో ఈ సోదాలు మ‌రియు జ‌ప్తు ఆపరేషన్ జరిగింది. సోదాలు, జప్తు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న సమయంలో, అనేక నేరపూరిత పత్రాలు, వదులుగా ఉండే విలువైన  ప‌త్రాలు మరియు ఇతర డిజిటల్ ఆధారాలు కనుగొనబడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఎంట్రీ ప్రొవైడర్‌లను ఉపయోగించి కొనుగోళ్ల ద్రవ్యోల్బణం చూప‌డం, లెక్క‌కు చూప‌ని నగదు ఖర్చులు మరియు పెట్టుబడులు మొదలైన వాటితో సహా సాధారణ ఖాతాల పుస్తకాల వెలుపల పెద్ద ఎత్తున లెక్క‌కు చూప‌ని ఆర్థిక లావాదేవీలలో కంపెనీల ప్రమేయం క‌లిగిన ప‌లు సాక్ష్యాలు ఈ సోదాల‌లో స్పష్టంగా వెలుగులోకి వ‌చ్చాయి. షేర్ ప్రీమియం, డొల్ల‌ కంపెనీలను ఉపయోగించి అసురక్షిత రుణాల ముసుగులో కంపెనీలు గణనీయంగా లెక్కించని ఆదాయాన్ని లాండరింగ్ చేసిన‌ట్టుగా కూడా ఆధారాలు ఈ సోదాల‌లో వెలుగులోకి వ‌చ్చాయి.  దాదాపు రూ.200 కోట్లకు మించి లెక్కించని కొనుగోళ్ల‌కు సంబంధించిన‌ ఆధారాలు కనుగొనబడ్డాయి. కంపెనీల ఫ్యాక్టరీ ఆవరణలో కూడా పెద్ద మొత్తంలో లెక్కించబడని స్టాక్ కనుగొనబడ్డాయి. సోదాల నిర్వ‌హ‌ణ  సమయంలో 12 బ్యాంక్ లాకర్లు బయటపడ్డాయి. రూ.2.10 కోట్లు  కంటే ఎక్కువ గాలెక్కకు చూపని నగదు మరియు రూ.1.07 కోట్ల విలువ క‌లిగిన జ్యువెల్ల‌రీ  మొత్తం వివిధ ప్రాంగణాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు కనుగొన్న ఆధారాల ప్ర‌కారం లెక్కలు చూపని ఆదాయం రూ. 300 కోట్ల మేర గుర్తించ‌బ‌డింది.  నాలుగు కంపెనీల‌లో ఇప్పటికే రూ.71 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని క‌లిగి ఉన్న‌ట్టుగా సోదాల‌లో తేలింది. ఈ విష‌య‌మై త‌దుప‌రి విచార‌ణ కొనసాగుతోంది. 

***

 



(Release ID: 1758585) Visitor Counter : 153