ఆర్థిక మంత్రిత్వ శాఖ
8 రాష్ట్రాల్లో రూ.2,903.80 కోట్ల మూలధన వ్యయం ప్రాజెక్టులను ఆమోదించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ
8 రాష్ట్రాలకు రూ.1,393.83 కోట్లు విడుదల
Posted On:
25 SEP 2021 9:37AM by PIB Hyderabad
"2021-22 కోసం మూలధన వ్యయాల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం" పథకం ఆర్థిక పునరుద్ధరణకు సకాలంలో ఉద్దీపనను ఇస్తుంది
'2021-22 కోసం మూలధన వ్యయాల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం' అనే పథకం కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం 8 రాష్ట్రాల్లో రూ. 2,903.80 కోట్ల మూల ధన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మంత్రిత్వ శాఖ బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, సిక్కిం మరియు తెలంగాణకు రూ. 1,393.83 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్రాల వారీగా ఆమోదించిన, విడుదల చేసిన మొత్తం కింద విధంగా ఉంది:
(రూ.కోట్లలో)
వ.సంఖ్య
|
రాష్ట్రం
|
ఆమోదం లభించిన నిధులు
|
విడుదలైన నిధులు
|
1
|
బీహార్
|
831.00
|
415.50
|
2
|
ఛత్తీస్గఢ్
|
282.00
|
141.00
|
3
|
హిమాచల్ ప్రదేశ్
|
200.00
|
100.00
|
4
|
మధ్యప్రదేశ్
|
649.00
|
324.50
|
5
|
మహారాష్ట్ర
|
522.00
|
249.73
|
6
|
పంజాబ్
|
45.80
|
22.90
|
7
|
సిక్కిం
|
200.00
|
100.00
|
8
|
తెలంగాణ
|
174.00
|
40.20
|
Total
|
2903.80
|
1393.83
|
మూలధన వ్యయం అధిక గుణకం ప్రభావం మరియు కోవిడ్ -19 మహమ్మారి 2 వ తరంగం నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన వనరులను అందించడానికి, '2021-22 సంవత్సరానికి మూలధన వ్యయాల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం' పథకం 29 ఏప్రిల్, 2021 న ప్రారంభించారు. ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణం రూపంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లుమించని మొత్తం వరకు ప్రత్యేక సహాయం అందిస్తారు. ఈ పథకం మూడు భాగాలను కలిగి ఉంది:
పార్ట్ -1: ఈ పథకంలోని ఈ పార్ట్ 8 ఈశాన్య రాష్ట్రాలు అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం మరియు త్రిపుర, మరియు ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల కోసం రూపొందించారు. ఈ భాగం కింద, 7 ఈశాన్య రాష్ట్రాలలో ఒక్కో దానికి రూ.200 కోట్లు కేటాయించారు. అస్సాం, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఒక్కొక్కటి రూ.400 కోట్లు కేటాయించారు.
పార్ట్- II: ఈ భాగం పార్ట్ -1 లో చేర్చని అన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించినది. ఈ భాగానికి రూ .7,400 కోట్లు కేటాయించారు. 2021-22 సంవత్సరానికి 15 వ ఆర్థిక సంఘం అవార్డు ప్రకారం కేంద్ర పన్నుల వాటాకు అనులోమానుపాతంలో ఈ రాష్ట్రాల మధ్య ఈ మొత్తం కేటాయించారు.
పార్ట్-III: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల (ఎస్పిఎస్ఈలు) ప్రైవేటీకరణ/డిజిన్వెస్ట్‌మెంట్ మరియు ఆదాయాల మోనటైజేషన్/రీసైక్లింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందించడం కోసం ఈ పథకం భాగం. ఈ భాగం కింద, రాష్ట్రాలు పార్ట్ -1 లేదా పార్ట్-II కింద వాటి కేటాయింపు కంటే ఎక్కువ స్కీమ్ కింద అదనపు నిధులు అందించబడతాయి పొందవచ్చు. ఈ పథకంలో భాగంగా రూ .5,000 కోట్లు కేటాయించారు. ఈ భాగం కోసం, రాష్ట్ర నిర్దిష్ట కేటాయింపు లేదు మరియు "ఫస్ట్-కమ్ ఫస్ట్-సర్వ్ ప్రాతిపదికన" నిధులు అందించబడతాయి.
'2020-21 కోసం మూలధన వ్యయాల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం' పేరుతో ఇదే విధమైన పథకాన్ని గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ప్రారంభించింది. ఈ పథకం కింద, మూలధన వ్యయ ప్రతిపాదనలు రూ. 27 రాష్ట్రాలలో రూ.11,911.79 కోట్లు వ్యయ శాఖ ఆమోదించింది. 2020-21లో రూ.11,830.29 కోట్లు రాష్ట్రాలకు విడుదలయ్యాయి.
****
(Release ID: 1758070)
Visitor Counter : 243